Advertisement
రెండో వారం ఎలిమినేషన్‌కి ఏకంగా 9మంది ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు.దానితో ఈ వారం నాగ్ ఎంతమందిని ఎలిమినేట్ చేస్తారో అనే చర్చ ఇప్పటికే సోషల్ మీడియాలో స్టార్ట్ అయ్యింది.ఇక మంగళవారం ఎపిసోడ్ విషయానికి వస్తే అఖిల్,మోనాల్ మధ్య ముదురుతున్న వ్యవహారం అభిజిత్ కు కోపాన్ని తెప్పించింది.ఆ కోపం ఎవరి మీద చూపాలో తెలియని అభిజిత్ అన్నం మీద చూపించాడు.పాపం అభిజిత్ పార్టనర్ అయిన హారిక ఈ విషయాన్ని అర్థం చేసుకొని అభిజిత్ కు ముద్దలు తినిపిస్తూ కెమెరాలు కాసేపు అటు తిప్పితే బాగుంటుంది అని కామెంట్ చేసింది.
ఇక ఆ తరువాత రాజశేఖర్ మాస్టర్,కరాటే కళ్యాణి ని టార్గెట్ చేసి కామెడీ పండించారు.ఆయన కామెడీకి ఓపిక కోల్పోయిన కరాటే కళ్యాణి ఆయనను ఇల్లంతా పరుగులు పెట్టించింది.ఇక చాలాసేపు ముచ్చట్లు పెట్టుకున్న మోనాల్,అభిజిత్ తమ పాస్ట్ స్టోరీస్ గురించి ఒకరితో ఒకరు పంచుకున్నారు.
బ్లాక్ బస్టర్ సాంగ్ తో మొదలైన బిగ్ బాస్ ఇంటి సభ్యులు పదవ రోజు. కిచెన్ లో వంట చేయడం విషయంపై లాస్యకి,దేవికి చాలాసేపు చర్చ జరిగింది. ఇక గార్డెన్ లో ఉన్న దివి ,అఖిల్ ను పెద్ద పులిహోర రాజా అని సొహైల్ అయితే ఆ పులిహార లో తాలింపు కూడా వేస్తాడు అంటూ పంచులు వేసి తెగ నవ్వించింది.
మార్నింగ్ మస్తీలో భాగంగా..బిగ్ బాస్ దేత్తడి హారిక అందరి చూపు తనవైపు తిప్పుకునేలా ఎంటర్ టైన్ చేయాలని కోరాడు.దానితో అందాల ప్రదర్శన చేస్తూ పోకిరి చిత్రంలో పాటకి డ్యాన్స్ వేసి షో చూస్తున్న కురాళ్ళ మతులు పోగొట్టింది.ఆతరువాత అఖిల్ తో ర్యాంప్ వాక్, గంగవ్వ,నోయల్ తో కలిసి ఓ స్కిట్ చేసి అందరినీ అలరించింది.
Advertisement
ఆతరువాత చీర కట్టులో వచ్చిన దివిని ఎత్తుకున్న మొహబూబ్ రాజశేఖర్ మాస్టర్ కంటబడ్డాడు. దానికి రాజశేఖర్ మాస్టర్.. ఎంత మందిని ఎత్తుకుంటావు రా.. హారికను ఎత్తుకున్నావు.. ఇప్పుడు దివిని ఎత్తుకున్నావు.. వీళ్లందర్నీ కాదు.. కరాటే కళ్యాణిని ఎత్తుకో అని ఓ ఫన్నీ ఛాలెంజ్ చేశాడు.అది విని వెంటనే వంట గదిలో నుండి పరుగున వచ్చింది కరాటే కల్యాణి.ఆమెను నిరాశ పరచడం ఏమాత్రం ఇష్టంలేని మొహబూబ్ ఆమెను కష్టపడి ఎత్తుకున్నాడు.ఇక డైనింగ్ టేబుల్ దగ్గర మొనాల్ అఖిల్ తో ముద్దలు పెట్టించుకోవడం. అది చూసి అభిజిత్ ఫీల్ అవ్వడంతో ఇక ఈరోజు ట్రై యాంగిల్ లవ్ స్టోరీలో అఖిల్ పైచేయి సాధించాడు.
Advertisements
ఇక ఈవారం లగ్జరీ బడ్జెట్ టాస్క్ వివరాలను వివరించే బాధ్యత బిగ్ బాస్ యాంకర్ సుజాతకు అప్పజెప్పారు.ఇక అత్తా అల్లుడు-అమెరికా మోజు అనే లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో అత్తగా కళ్యాణి,పని మనిషిగా దేవి,కళ్యాణి కూతురి పాత్రలో దివి, అమెరికా అల్లుడు పాత్రలో అఖిల్, కళ్యాణి కోడలు పాత్రలో సుజాత, మతిమరుపు గుమస్తాగా కుమార్ సాయి,కొడుకుగా అభిజిత్ పాత్రలు పోషించారు.ఇక అత్త క్యారెక్టర్ వేసిన కళ్యాణి సూర్యకాంతం తరహాలో నటించే ప్రయత్నం చేసింది.ఇక ఈ టాస్క్ లో ముఖ్యంగా కుమార్ సాయి,దేవి లవ్ ట్రాక్ బాగా వర్క్ అవుట్ అయ్యింది.దేవి గుమస్తాతో రొమాన్స్ చేస్తూ.. ‘సినిమాకి వెళ్దాం వస్తావా?’ అని అడగడం.. ఏం సినిమా అంటే ‘నువ్వు నేను డింగ్ డింగ్’ అని చెప్పి ఇంట్లో నవ్వులు పువ్వులు పూయించారు.
ఇక టాస్క్ మధ్యలో మిగిలిన ఇంటి సభ్యులు చేసిన చీపురు, విగ్ యాడ్లు లెన్త్ చాలా ఎక్కువగా ఉంది.ఇక ఈ యాడ్ లు కొంచెం విసిగించాయి అలాగే కొంచెం అలరించాయి.ఇక దివి,అఖిల్‌ని ఉద్దేశించి నువ్వు బాగా పులిహోర కలుపుతావుగా అంటూ పంచులు వేసి అందరినీ నవ్వించింది.ఈరోజు దాదాపు అందరినీ ఎంటర్ టైన్ చేసిన బిగ్ బాస్ ఎపిసోడ్ రేపటి ప్రోమో లో ట్రై యాంగిల్ లవ్ స్టోరీ లో కొన్ని ఆసక్తికర అంశాలను చూపించి ఈరోజు ఎపిసోడ్ ను ముగించారు.
Advertisements
BigBoss Video: