Advertisement
టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వారి లైఫ్ లోని సీక్రెట్ అంశాన్ని చెప్పాలంటూ బిగ్ బాస్ ఆదేశించాడు. అలా చెప్పిన వారికి వారి ఆత్మీయులు రాసిన లేఖలను అందజేస్తానని చెప్పాడు. దీంతో ఇంటి సభ్యులు తమ లైఫ్ లోని టాప్ సీక్రెట్ ను పంచుకున్నారు.
మెహబూబ్:
పోలీసు గొడవ పడి రెండు రోజులు జైల్లో ఉన్నాడట. తన ఫ్రెడ్ ( అమ్మాయి)ను రైల్వే స్టేషన్ లో డ్రాప్ చేయడానికి వెళ్లినప్పుడు….నో పార్కింగ్ వద్ద బండిని పార్క్ చేసి టికెట్ కోసం లోపలికి వెళ్ళాడట…. ఆ సమయంలో వచ్చిన పోలీస్ మెహబూబ్ ఫ్రెండ్ తో అసభ్యంగా ప్రవర్తించడంతో మెహబూబ్ అతనిపై సీరియస్ అయ్యాడట…ఈ క్రమంలో పోలీసులు అతడిని స్టేషన్ కు తీసుకెళ్లి 2 డేస్ ఉంచారట!
Advertisements
లాస్య:
తన భర్త మంజునాథ్ తనకంటే ఒక్క సంవత్సరం పెద్దవాడట!
అవినాష్:
ఓ సినిమాలో రౌడీ వేషం ఉందంటే వెళ్లిన అవినాష్ ను 80 వేలు అడిగారట.! తనకు 80 వేలు అవసరం ఉన్నాయని చెప్పడంతో…అవినాష్ తండ్రి 80 వేలు అప్పుగా తెచ్చి అతనికి ఇచ్చాడట…. అదే డబ్బును సదరు సినిమా డైరెక్టర్ ప్రొడ్యూసర్ చేతిలో పెట్టగా …వాళ్లు హ్యాండిచ్చారట! ఆ విషయం ఇప్పటికీ ఇంట్లో చెప్పలేదట!
అభిజిత్ :
Advertisement
న్యూయార్క్ వెళ్లినప్పుడు ….ఓ రెస్టారెంట్ కు వెళ్లినప్పుడు అతడితో ఓ వ్యక్తి క్లోజ్ గా ఉన్నాడట… తర్వాత ఫోన్ నెంబర్ కూడా అడగడంతో అనుమానమొచ్చిన అభి…కథేంటి అని అడగగా…నువ్వు గే బార్ కు వచ్చావ్ కదా అని చెప్పాడట!
సోహైల్ :
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన సోహెల్ కౌన్సెలింగ్ సమయంలో ఫేక్ పేరెంట్స్ ను తీసుకెళ్లే ప్రయత్నం చేశాడట!
అరియానా:
ముగ్గురు ఫ్రెండ్స్ తో కార్ లో ఇంటికి వెళుతున్న అరియానా కార్ పెద్ద ప్రమాదానికి గురైందట… పల్టీలు కొట్టి ఓ కరెంట్ పోల్ కు గుద్దుకుందట….అందరూ ప్రాణాలతో భయటపడ్డారట!
హారిక :
రెండేళ్ల క్రితం ఓ కుర్రాడితో రిలేషన్ షిప్ లో ఉన్నట్టు….ఇప్పుడు ఆ రిలేషన్ షిప్ నుండి బయటికొచ్చినట్టు చెప్పింది.
మోనల్ :
తన ఎడ్యుకేషన్ గురించి, తాను +2 తర్వాతే బ్యాంక్ జాబ్ లో జాయిన్ అయ్యిందట! తర్వాత జాబ్ చేస్తూనే స్టడీస్ కంటిన్యూ చేసిందట!
అఖిల్…సీక్రెట్ రూమ్ లో ఉండడంతో అతడి సీక్రెట్ తెలుసుకునే అవకాశం రాలేదు. బహూశా ఈ రోజు అతడు తన సీక్రెట్ రివీల్ చేశాకే…అతడికి లెటర్ అందొచ్చు!
Advertisements