Advertisement
నాన్నకు ప్రేమతో చిత్రంలోని ఫాలో ఫాలో సాంగ్ తో మొదలైన మంగళవారం బిగ్ బాస్ ఎపిసోడ్ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.ముందుగా బిగ్ బాస్ హౌస్ లో గంగవ్వ అనవసరంగా కొట్టుకోవడం మంచిది కాదని ఇతర ఇంటి సభ్యులతో తన అనుభవాన్ని పంచుకుంది.
ఇక బిగ్ బాస్ హౌస్ రూల్స్ ను వివరించడానికి టీచర్ అవతారం ఎత్తిన కరాటే కళ్యాణి పై ఇతర కాంటెస్ట్ లు జోకులు వేసి నవ్వులు పువ్వులు పూయించగా ఇక కరాటే కళ్యాణిని జీతాలు తీసుకుని ఫెయిల్ చేస్తావా??పిచ్చాసుపత్రిలో పేషెంట్ లెక్క చేస్తున్నావ్ అని గంగవ్వ ఓ రేంజిలో ఆడేసుకుంది.ఇక సీక్రెట్ రూమ్ లో ఉన్న అరియనా తనకు సోహెల్ కు ఫుడ్ ఆర్డర్ ఇవ్వడం కోసం బిగ్ బాస్ హౌస్ కి ఫోన్ చేసి అడ్డంగా దొరికిపోయింది.మొదట అరియనా కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడిన అకిల్ సార్థక్ చాలా బోర్ కొట్టించాడు.ఇలా అయితే కష్టమనుకున్న నోయల్ రంగంలోకి దిగి అసలు ఎవరు నువ్వు?.. ఏంటి నీ ప్రాబ్లమ్.. నువ్వు మర్యాదగా అడిగితే మర్యాదగా పంపిస్తాం లేకుంటే పంపమని కౌంటర్ ఇచ్చి ఫోన్ పెట్టేసి అరియానాకు షాక్ ఇచ్చాడు.
ఇక హౌస్ లో కట్టప్ప ఉన్నాడని ఇంతకీ అతనెవరని ఇంటి సభ్యులు అభిప్రాయపడుతున్నారు వారి పేరు ను రాసి అక్కడ ముందుగా ఏర్పరచిన బాక్స్ లో వేయాలని సూచించారు.అందరూ కంటెస్టెంట్ లు ఈ తంతు పూర్తి చేశాక ఆ బాక్స్ ను బిగ్ బాస్ నిర్వహకులు బయటకు తీసుకెళ్లారు.
Advertisement
ఆతరువాత మాటలో సందర్భంలో కరాటే కళ్యాణ్ ట్రెడిషనల్ గా ఉండడం తనకు ఇష్టమని తను క్లాసికల్, వెస్టరన్, ఫోక్ డాన్స్‌లను వేయగలనని అలాగే గంగవ్వలా చీర కట్టుకోవడం నేను నేర్చుకుంటానని అన్నారు.దానికి అభిజిత్ మీరు ఆమెలా చీర కట్టుకోకండి చూడలేక చస్తాం అని అన్నాడు.దీనికి తెగ ఫీల్ అయిన కరాటే కళ్యాణి బాబోయ్.. నేను సరదాగా అన్నానని అభిజిత్ చెబుతున్నా పట్టించుకోకుండా ఈ విషయంపై చాలాసేపు డిస్కషన్ పెట్టింది.
Advertisements
వరసగా రెండో రోజు బిగ్ బాస్ హౌస్ లో మొనాల్ కన్నీటి పర్యంతమైంది.ఇదంతా వెజ్, నాన్ వెజ్ ఫుడ్ కి సంబంధించిన అంశంపై జరిగింది.ఇక బిగ్ బాస్ సీజన్ 4లో తొలిసారిగా లగ్జరీ బడ్జెట్ టాస్క్ జరిగింది. ఇందులో ఒక సభ్యుడికి 1000 పాయింట్ల చొప్పున.. 14 మందికి 14 వేల పాయింట్లు బిగ్ బాస్ కేటాయించారు.ఈ టాస్క్ కోసం బిగ్ బాస్ లాస్యను కన్ఫెషన్ రూమ్ కి పిలిచి లెటర్ ఇచ్చి పంపి దాన్ని చదివించారు.
తొలి లగ్జరీ బడ్జెట్ టాస్క్ కు సంచాలకురాలిగా యాంకర్ దేవిని, న్యాయ నిర్ణేతగా అమ్మ రాజశేఖర్ మాస్టర్‌ని బిగ్ బాస్ ఎంచుకున్నారు.ఇందులో ఇంటి సభ్యులు జంటలుగా మారి ఒకరు బొమ్మలు ఎక్స్‌ప్లైన్ చేస్తుంటే మరొకరు వేయాలి.ఈ టాస్క్ లో గంగవ్వ రంగులు సరిగ్గా చెప్పలేకపోయింది.దాని కారణంగా ఇంటి సభ్యులకు 5000 పాయింట్స్ మాత్రమే వచ్చాయి.
ఇక బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి ఇతర ఇంటి సభ్యులను కలవకుండా సీక్రెట్ రూమ్ లో కాలం వెల్లదీస్తున్న అరియానా-సొహైలులు బిగ్ బాస్ ఇంటి వాళ్లు తమకు ఫుడ్ పెట్టకపోవడానికి గల కారణంమేంటో తెలుసుకోవాలని వారిద్దరినీ బిగ్ బాస్ హౌస్ లోకి పంపించాడు.ఇక వారి మధ్య ఇతర కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన వాగ్వాదం రేపటి ఎపిసోడ్ కి వాయిదా పడింది.సో ఇదండీ మంగళవారం బిగ్ బాస్ ఎపిసోడ్.ఈ ఎపిసోడ్ ను చూడని మీ ఫ్రెండ్స్ తో ఈ ఆర్టికల్ షేర్ చేయండి.
Watch Video:
Advertisements