Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

వీళ్లు బిగ్ బాస్ హౌస్ లో ఉంటే ఎలా ఉంటుంది? RGV మాత్రం జ‌డ్జ్ గా ‌ ఫిక్స్ చేశాం. కంటెస్ట్స్ లిస్ట్ ఇక్క‌డిచ్చాం!

Advertisement

మా టివి వాళ్లు బిగ్ బాస్ 4 హడావిడిలో ఉన్నారు..కంటెస్టెంట్స్ , జడ్జ్ గురించి ఒకటే హైరానా పడుతున్నారు.. అది ఇప్పట్లో వచ్చేలా లేదు కానీ,  ఈ లోపు మనం కొందరు సోషల్ మీడియా స్టార్స్ తో బిగ్ బాస్ హౌజ్ ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దామా.. వీళ్లంతా హౌజులో ఉంటే  రచ్చ రచ్చే… కంటెస్టెంట్ ఎవరు,వీళ్లకి జడ్జ్ గా ఎవరుంటే  రచ్చరంబోలాలా ఉంటుందో చూసేయండి..

రాకేష్ మాస్ట‌ర్:

జ‌ఫ్పా…నా జ‌ఫ్పా….అంటూ యూట్యూబ్ వీడియోస్ తో  ట్రెండింగ్ లో ఉండే  రాకేష్ మాస్ట‌ర్ బిగ్ బాస్ షోలో ఉంటే…. మ‌స్త్ కిక్ ఉంటుంది!  యాంక‌ర్ల‌ను తిట్టిన‌ట్టే హోస్ట్ ను కూడా ఏసుకుంటాడేమో!?

శ్రీరెడ్డి:

Advertisements

ఫైర్ బ్రాండ్ గా పేరుప‌డ్డ శ్రీరెడ్డికి బిగ్ బాస్ ఛాన్స్ వ‌స్తే….అది కూడా హౌస్ లో రాకేష్ మాస్ట‌ర్ కూడా ఉంటే …. షో నిర్వాహకుల‌కు మ‌స్త్ కంటెంట్ దొరికిన‌ట్టే! ఎపిసోడ్ ను రెండు గంట‌లు బోర్ కొట్ట‌కుండా అవ‌లీల‌గా న‌డిపేయొచ్చు!

ఉప్ప‌ల్ బాలు:

హాయ్ అండీ….నేను ఉప్ప‌ల్ బాలునండీ…అంటూ టిక్ టాక్ లో టాక్ ఆఫ్ ది మ్యాన్ గా రిజిస్ట‌ర్డ్ అయిన ఉప్ప‌ల్ బాలు కూడా హౌస్ లో ఉండే ఆ హాడావుడి వేరుగా ఉంటుంది. స్విమ్మింగ్ ఫూల్ సీన్ ఎలా ఉంటుందో  ఊహించ‌డం కూడా క‌ష్ట‌మే!

KA పాల్:

ఇప్పుడే బిగ్ బాస్ నుండి పిలుపొచ్చింది… USA నుండి నా ఫ్లైట్ లో వ‌చ్చి ….బేగంపేట‌లో పార్క్ చేసి …అటు నుండి ఇటు వ‌చ్చాను లాంటి కామెడీని మ‌నం ప్ర‌తిరోజు క‌డుపుబ్బా న‌వ్వుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు!

బైరెడ్డి సిద్దార్థ రెడ్డి:

ముక్కుసూటిత‌నం., నిర్భ‌యంగా మాట్లాడే నైజం ఉన్న బైరెడ్డి గ‌నుక ఈ షో కు వ‌స్తే…మిగితా వాళ్ల‌ని ఎలా హ్యాండిల్ చేస్తార‌నేది చూడాల‌నిపిస్తుంది బ్రో!

కతర్ పాపా:

అంతేలే నాకు పెళ్లయిపోయింది కాబట్టి నాకెందుకు ఓట్లేస్తారులే..ఒక్క రెండు మూడు వందల ఓట్లు వేయండి సరిపెట్టుకుంటాను..వేయండే..మీరు వేస్తారు నాకు తెలుసు..మ్మ్… (వేయకపోతే మేం ఉంటమా అక్కా..నీ బూతులకి భయపడైనా వేస్తమక్కా)

బండ్ల గణేష్:

టైటిల్ విన్నర్  నేనే.. విన్నర్ గా గెలవకపోతే 7 o క్లాక్ బేడుతో నాలుక కోసుకుంటా .. ఓరేయ్ అన్న మస్తు కాకమీదుండు.. ఫైనల్స్ రోజు షాప్ లు బంధ్ పెట్టాల్సిందే.. లేదంటే బ్లేడ్ల ప్యాకెట్లు దాపెట్టాలే..!

Advertisement

లోకులు కాకులు ఆంటి:

బిగ్ బాస్ హౌజ్ లకు అనంగనే వచ్చినా.. ఫోన్ వొద్దన్నారు..అల్లు అర్జున్,మహేశ్ బాబు ఎవరెవరు ఫోన్ చేస్తున్నారో ఏందో..ఓరేయ్ గుండు నా కొడకా రూల్స్ మార్చండ్రా అంటూ రోజూ ఎంత లొల్లి ఉంటదో హౌజ్ లో ..

రేవతక్క:

అడి ఇడి కాడు..అడే ఇడి..అడి ఇడి కాడు..హౌజులో అక్క పాటందుకుంటే ఎంతమంది చెవుల్లోంచి రక్తం కారుతుందో ఏంటో..??

కోపదారి మనిషి:

బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర.. హౌజులో ఉండాలనే మూడు ,ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయండి..అంటేనేమో అందరికి కోపం, అందరూ హర్ట్ అయిపోతారు..తగలబెట్టండి సర్.. నిరంజన్ గారూ..నాకు ఇంట్రస్ట్ పోయింది.. ! ఈయన బిగ్ బాస్ హౌజే తగలెట్టేయడూ కదా..!

సునిశిత్:

సాక్రిఫైజ్ స్టార్ సునిశిత్ … బిగ్ బాస్ హౌజ్ లో ఉంటే  రోజుకెన్ని కథలు చెప్తాడో…బయటికి వచ్చాకా ఆఖరికి టైటిల్ నాకే ఇస్తా అన్నారు, నాకు వద్దు అని బండ్లన్నకి ఇచ్చేయమని టైటిల్ సాక్రిఫైజ్ చేసా అంటాడేమో..!

టిక్ టాక్ స్టార్ దివ్య శ్రీ:

మెచ్యురిటికి ,ఏజ్ కి సంబంధం లేదని పిచ్చిపిచ్చిగా వాగి అడ్డంగా బుక్కయిపోయే టిక్ టాక్ స్టార్ దివ్యశ్రీ హౌజులో ఉంటే.. నిరంజన్ గారూ ఈ పిల్లకి మీరే చెప్పాలండి కొంచెం.. కోపం తెచ్చుకోకుండా మెల్లిగా చెప్పండి ఏడుస్తుంది..అసలే పాప ఏడుపుకే 1మిలియన్ ఫాలోవర్స్ అంట..

వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. విశ్వక్ సేన్:

దెం_యండ్రా.. అన్న నోటి దూలకి రోజుకెంతమంది బలవుతారో ఏంటో.. మీరు దెం_మన్నా, బద్దలు పగుల్తయ్ అన్నా ఎటూ  పోలేరు ఫాఫం..

అప్సర రాణి

హాట్ హాట్ అందాలతో ఒక్కరోజులోనే సోషల్ మీడియాను షేక్ చేసింది.. హౌజులో ఎంటరయి ఇంకెంత హీట్ పుట్టిస్తుందో..!

కంటెస్టెంట్స్ చెప్పుకున్నాం కదా ఈ రచ్చరచ్చ బ్యాచ్ కి జడ్జ్ RGV అయితే పక్కా పర్ఫెక్ట్ గా ఉంటుంది..కొంచెం వెరైటీగా ఈ సారి హౌజ్ లోకి కంటెస్ట్ంట్స్ తో పాటు జడ్జ్ ని కూడా పంపిస్తే సూపర్ కదా! అబ్ ఆయేగా మజా…జనక్ జనక్ పాయల్ బాజా.. !!

Advertisements