Advertisement
గురువారం బిగ్ బాస్ హౌస్ లో జరిగిన విశేషాలు వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం.బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన నాటి నుండి సైలెంట్ గా ఉంటున్న దివి ఈరోజు బిగ్ బాస్ ఇంటి సభ్యులు గురించి తమ అభిప్రాయాన్ని చెప్పవల్సిందిగా అడిగారు.దానికి దివి అందరి ఇంటి సభ్యుల గురించి పూస గుచ్చినట్టు ఉన్నది ఉన్నట్టు చెప్పి వాళ్ళ చేత చప్పట్లు కొట్టించారు.
మొదట అఖిల్ తో స్టార్ట్ చేసిన దివి చివరిగా అమ్మ రాజశేఖర్ తో ఎండ్ చేశారు.ఇక నిన్న ఇంట్లో ఏడుపులకి, పెడబొబ్బలకి కారణమైన అరియానా, సొహైల్‌లను ఈరోజు బిగ్ బాస్ కన్ఫెషన్ రూంకి పిలిచి ఇంటి సభ్యులు కట్టప్ప అని ఎవరిని అనుకుంటున్నారో దానికి కారణం ఏంటో తెలుసుకోవాల్సిందిగా ఆదేశించారు.
ఇక కన్ఫెషన్ రూం నుండి బయటకు వచ్చిన అరియానా, సొహైల్‌ను ఇంటి సభ్యులంతా బిగ్ బాస్ ఏం చెప్పాడో చెప్పమని అడిగారు.దానికి సొహైల్ బిగ్ బాస్ చెప్పింది మొత్తం ఇంటి సభ్యులకి చెప్పాడు.ఇక నిన్నటి లాగే అరియానా సొహైల్‌లను పక్కకి లాక్కొని వెళ్ళి ” అలా అంతా చెప్పకు ఇది మనకిచ్చిన టాస్క్ అని క్లాస్ పీకింది.
ఇక అరియానా, సొహైల్ చెప్పిన టాస్క్ పై చాలాసేపు చర్చించిన మిగిలిన 14మంది ఇంటి సభ్యులు రెండు గ్రూపులుగా డివైడ్ అయ్యారు.అందులో ఒక గ్రూప్ తమ కట్టప్ప అనుకుంటున్న వ్యక్తి గురించి అరియానా, సొహైల్‌తో పంచుకున్నారు.ఇక ఇంకో గ్రూప్ తమ అభిప్రాయాన్ని అరియానా, సొహైల్‌తో పంచుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు.
మొదట సూర్య కిరణ్ తనకి నోయల్,మోనాల్ మీద అనుమానం ఉందని ఆతరువాత ఆ లిస్ట్ లోకి లాస్య,అఖిల్ కూడా చేరారని తన మైండ్ లో అఖిల్ ను కట్టప్ప అనుకుంటున్నట్లు అరియానా, సొహైల్‌కు చెప్పారు.
Advertisements
Advertisement
ఆతరువాత అరియానా, సొహైల్ ముందుకు వచ్చిన గంగవ్వ తాను అఖిల్ ను కట్టప్ప అనుకుంటున్నట్లు చెప్పింది.
ఇక ఆ తర్వాత వచ్చిన అమ్మ రాజశేఖర్ మాస్టర్ తనకు నోయల్ కట్టప్ప అనిపిస్తుంది అని చెప్పాడు.
దేవి అయితే ఇంట్లోకి ముందుగా వచ్చిన 14మందిలో కట్టప్ప ఎవరూ లేరు అని తేల్చి చెప్పింది.
ఇక ఆతరువాత వచ్చిన దివి సుజాత, లాస్య పై అనుమానం ఉందని కానీ తనకి సుజాత మీద అనుమానం ఉన్నట్లు చెప్పింది
ఈ టాస్క్ లో ఫైనల్ మెంబర్ గా మెహబూబ్ దిల్ సే పాటిస్పేట్ చేశాడు. అతనికి లాస్య మీద అనుమానం ఉన్నట్టుగా చెప్పాడు.
ఆతరువాత కొద్దిసేపటికి నోయల్ నాకు తెలుగు రాదు కానీ తెలివి ఉందని మోనాల్ కు ట్యాగ్ లైన్ ఇవ్వడం అలాగే బిగ్ బాస్ పై ర్యాప్ సాంగ్ పడడం గంగవ్వ ఇంటి సభ్యుల గురించి వాళ్ళ చేసే పనులు గురించి చెప్పిన విధానం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి.
Advertisements
ఇక ఇంటి సభ్యులకు బిగ్ బాస్ కట్టప్ప వెన్నుపోటు లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా టమోటో పల్ప్ ఫ్యాక్టరీ టాస్క్ ను ఇచ్చారు.ఈ టాస్క్ కోసం బిగ్ బాస్ ఇంటి సభ్యులను ఎల్లో, గ్రీన్, బ్లూ ,ఆరంజ్ టీమ్స్ గా విభజించారు.ఇక ఈ టాస్క్ జరుగుతున్న టైంలో ఈరోజు ఎపిసోడ్ ఎండ్ అయ్యింది.ఇక ఈరోజు ఎపిసోడ్ బిగ్ బాస్ హిస్టరీలో నే పరం బోరింగ్ గా జరిగింది.ఇక రేపటి ఎపిసోడ్ విషయానికి వస్తే ప్రోమో లోని అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి.మరి ప్రోమో లాగే ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉంటుందా లేదా అనేది తెలుసుకోవడం కోసం రేపటి వరకు ఆగాల్సి ఉంటుంది.