Advertisement
బయోపిక్స్ కేవలం ఆనందాన్ని మాత్రమే ఇవ్వకుండా ఒక వ్యక్తి గురించి ఎక్కువ తెలుసుకోవడానికి అవకాశం కల్పిస్తాయి.ఇటీవల కాలంలో సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా “మహానటి”.. అప్పటి వరకు సావిత్రి అంటే తెలియని ఈ తరం వారికి కూడా తన గురించి తెలిసింది.కేవలం నటిగా మాత్రమే తెలిసిన వాళ్లు సావిత్రి గురించి మరింత తెలుసుకున్నారు.సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ జీవించింది..ఆ తర్వాత టాలివుడ్లో వరుసగా బయోపిక్స్ ట్రెండ్ నడిచింది.. అటువంటి కొన్ని బయోపిక్స్ గురించి తెలుసుకుందాం.
కథానాయకుడు,మహానాయకుడు:
నందమూరి తారకరామరావు జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం కథానాయకుడు..తన తండ్రి పాత్రను తానే పోషించారు నందమూరి బాలక్రిష్ణ.. కథనాయకుడికి కొనసాగింపే మహానాయకుడు..
మల్లేశం:
Advertisements
ఆసు యంత్రం కనిపెట్టి నేతన్నల కష్టాన్ని తగ్గించిన చింతకింది మల్లేశం కథే.. మల్లేశం సినిమా..ప్రియదర్శి నటించిన ఈ చిత్రం 2019లో విడుదలైన ఒక మంచి తెలుగు చిత్రంగా నిలిచింది..చిత్రంలో ఝాన్సి పాత్ర అందరిని ఆకట్టుకుంది.
యాత్ర:
వై ఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా తీసిన చిత్రం యాత్ర..ఇందులో YSR పాత్రకి మమ్ముట్టి జీవం పోశారు..మళ్లీ YSR ని చూస్తున్నామా అన్నట్టుగా ఆనందపడ్డారు రాజశేఖర్ రెడ్డి అభిమానులు.
జార్జిరెడ్డి:
జీనా హైతో మర్నా సీకో..కదం కదం పర్ లడ్నా సీకో అని..ఉస్మానియా విద్యార్దుల్లో పోరాట స్పూర్తిని నింపిన వ విద్యార్ధి ఉద్యమ నాయకుడు జార్జిరెడ్డి జీవితకథ.. అక్కడక్కడా కొన్ని లోపాలున్నప్పటికి జార్జిరెడ్డి ఎవరూ అనేది ఎక్కువమందికి తెలిసేలా చేసింది ఈ సినిమా.
Advertisement
సైరా:
ముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, రేనాటి సూర్యుడుగా కొలవబడే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా నిర్మించబడింది..ఇందులో చిరంజీవి సైరా నరసింహరెడ్డిగా నటించారు..నిర్మాతగా వ్యవహరించిన రాంచరణ్ కి డబ్బులు రాకపోయినప్పటికి చిరంజీవి అభిమానులకు మాత్రం కనువిందు చేసింది సైరా..
రాణి రుద్రమ దేవి:
కాకతీయ రారాణి రుద్రమదేవి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం రాణి రుద్రమదేవి… రుద్రమ దేవిగా అనుష్క, గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్ ఈ చిత్రంలో తమ తమ పాత్రలకి న్యాయం చేశారు..
ధోని:
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కథ. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మహేంద్ర సింగ్ ధోనిగా అదరగొట్టాడు..స్ట్రెయిట్ తెలుగు సినిమా కానప్పటికి ఎక్కువమందిని ఆకట్టుకున్న బయోపిక్ లలో ధోని ఒకటి.
ఇవే కాకుండా మరికొన్ని బయోపిక్స్ రానున్నాయి..వాటిల్లో పుల్లెల గోపిచంద్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో నటుడు సుధీర్ బాబు గోపిచంద్ పాత్ర పోషించనున్నారు.. రఘుపతి వెంకయ్య నాయుడు బయోపిక్‌లో సీనియర్ నరేష్ నటించారు..అవి విడుదల కావాల్సి ఉన్నాయి.
Advertisements