Advertisement
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పక్షులు మన దేశంలోని అనేక ప్రాంతాలకు ఏటా చలికాలం, వేసవికాలంలో వలస వస్తుంటాయి. అవి సాధారణంగా ఉండే ప్రదేశాల్లో పలు కాలాల్లో వాటి నివాసానికి తగిన పరిస్థితులు ఉండవు. కనుకనే ఎన్నో విదేశీ పక్షులు మన దేశానికి వలస వస్తాయి. వలస వచ్చాక అవి తాత్కాలికంగా కొన్ని రోజుల పాటు నివాసం ఉంటాయి. పిల్లల్ని కంటాయి. తిరిగి తమ ప్రదేశాలకు వెళ్లిపోతాయి. ఈ క్రమంలోనే భారత్‌కు వలస వచ్చే పలు ముఖ్యమైన పక్షుల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. సైబీరియన్ పక్షులు:
వీటినే సైబీరియన్ కొంగలు అని కూడా అంటారు. ఇవి కొంగల జాతికి చెందుతాయి. ఇవి రష్యా, సైబీరియాల్లో ఉంటాయి. చలికాలంలో ఘనాలోని కలాడియో ఘనా నేషనల్ పార్క్ లేదా మన దేశంలోని భరత్‌పూర్ నేషనల్ పార్క్‌లో కనిపిస్తాయి.
Advertisements
2. గ్రేటర్ ఫ్లెమింగో:
చలికాలంలో ఈ పక్షులు మనకు నల్ సరోవర్ బర్డ్ శాంక్చువరీ, ఖిజాదియా బర్డ్ శాంక్చువరీ, గుజరాత్‌లోని థాల్ బర్డ్ శాంక్చువరీలో ఉన్న ఫ్లెమింగో సిటీలలో మనకు కనిపిస్తాయి. ఫ్లెమింగో పక్షుల జాతిలో ఇవే అతి పెద్ద పక్షులుగా ఉన్నాయి.
3. డెమోయిసెల్లె క్రేన్:
కొంగ జాతికి చెందిన పక్షుల్లో ఇవి అత్యంత చిన్నవిగా ఉన్నాయి. ఇవి రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో మనకు కనిపిస్తాయి. అక్టోబర్ నెలలో యురేషియా నుంచి ఇండియాకు వస్తాయి. మార్చి నెలలో తిరిగి వెనక్కి వెళ్లిపోతాయి.
4. అముర్ ఫాల్కన్:
చలికాలంలో నాగాలాండ్‌లోని దోయాంగ్ లేక్‌లో ఇవి మనకు కనిపిస్తాయి. సైబీరియాలో ఇవి సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి. దక్షిణ ఆఫ్రికాకు కూడా వలస వెళ్తాయి.
5. బ్లూ త్రోట్:
చలికాలంలో మనకు ఇవి రాజస్థాన్‌లో కనిపిస్తాయి. అలస్కా లాంటి అత్యంత శీతలమైన ప్రాంతాల్లో ఇవి సంతానాన్ని వృద్ధి చేసుకుంటాయి.
Advertisement
6. బార్ హెడెడ్ గూస్:
ప్రపంచంలోనే ఎక్కువగా ఎగిరే పక్షిగా ఇది గుర్తింపు పొందింది. చలికాలంలో ఇవి హిమాలయాలకు వలస వస్తాయి.
7. రోజీ స్టార్లింగ్:
వీటి తల, లోక, రెక్కలు నలుపు రంగులో ఉంటాయి. ఛాతి క్రీమ్ కలర్‌లో ఉంటుంది. ఇవి చలికాలంలో భారత్‌కు వలస వస్తాయి. పొలాల్లో ఉండే మిడతలను తింటూ రైతులకు సహాయం చేస్తాయి.
8. రడ్డీ షెల్డక్:
అక్టోబర్‌లో ఈ పక్షులు భారత్‌కు వలస వస్తాయి. ఏప్రిల్ వరకు ఉండి వెళ్లిపోతాయి. సరస్సులు, రిజర్వాయర్లలో మనకు ఎక్కువగా కనిపిస్తాయి. జమ్మూ కాశ్మీర్‌లో అత్యంత ఎత్తులో ఉండే సరస్సులు, చిత్తడి నేలల్లో ఇవి గుడ్లను పెట్టి పిల్లల్ని పొదుగుతాయి.
9. కింగ్ ఫిషర్:
చలికాలంలో ఇవి నల్సరోవర్ సరస్సకు వలస వస్తాయి. ఏడాదికి ఒకసారి ఇవి ఎన్నో వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి నల్సరోవర్‌కు చేరుకుని కొంత కాలం గడుపుతాయి.
10. గ్రేట్ వైట్ పెలికన్:
అతి పెద్ద సరస్సులు, మడుగుల్లో మనకు ఎక్కువగా కనిపిస్తాయి. చలికాలంలో ఇవి మన దేశంలోని అస్సాం, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు వలస వచ్చి కొన్ని రోజులు ఉండి తిరిగి సొంత ప్రదేశాలకు వెళ్లిపోతాయి.
11. ఏషియన్ కోయెల్:
కోయిల జాతికి చెందిన పక్షి ఇది. ఇవి చలికాలంలో పాకిస్థాన్, ఇండియా, చైనాలకు వలస వస్తాయి.
12. రోజీ పెలికన్:
చలికాలంలో ఈ పక్షులు ఉత్తర భారతదేశానికి ఎక్కువగా వలస వస్తాయి. అక్కడి మంచినీటి సరస్సుల్లో పుష్కలంగా చేపలు ఉండే చోట ఇవి ఎక్కువగా నివాసం ఉంటాయి.
Advertisements