Advertisement
బిర్యానీ (Biryani) అనే పదం Birian అనే పర్షియన్ పదం నుంచి వచ్చింది. Birian అంటే.. పర్షియన్ భాషలో fried before cooking అనే అర్థం వస్తుంది. అంటే వండేందుకు ముందుగా ఫ్రై చేయడమని అర్థం. ఇక బిర్యానీని కూడా దాదాపుగా ఇలాగే చేస్తారు, అందుకనే దాన్ని బిరియన్ అని మొదట్లో పిలిచేవారు. తరువాత అదే బిర్యానీ అయింది. కాగా మొదట బిర్యానీని 1398లో తయారు చేసినట్లు చరిత్ర చెబుతోంది. అప్పట్లో టర్క్ మంగోల్ చక్రవర్తి టిమూర్.. ఓ కుండలో బియ్యం, మసాలాలు, మాంసం తదితర అన్ని పదార్థాలను వేసి బాగా ఉడికించి బిర్యానీ తరహా ఆహారాన్ని తయారు చేయించాడని చరిత్రకారులు చెబుతారు. అయితే క్రీస్తు శకం 2వ శతాబ్దంలోనే అరబ్ వర్తకులు బిర్యానీని మన దేశానికి పరిచయం చేశారని మరికొందరు అంటారు. అప్పట్లో వారు దీన్ని Oon Soru అనే తమిళ పేరుతో పిలిచేవారట. అయితే నిజానికి అసలైన హైదరాబాద్ బిర్యానీని మాత్రం మొగల్ చక్రవర్తులే తయారు చేయించినట్లు ఆధారాలున్నాయి.
మొగల్ చక్రవర్తుల కాలంలో ఓ సారి మహారాణి ముంతాజ్ సైనిక స్థావరాల వద్దకు వెళ్లి చూడగా.. సైనికులందరూ చాలా బలహీనంగా, శక్తి లేనట్లు కనిపించారట. దీంతో ఆమె సైనికులకు బలవర్ధక ఆహారం అందించాలని చెప్పి.. బియ్యం, మాంసం, మసాలాలు వేసి వండి బిర్యానీని తయారు చేయించింది. అలా మొగలులు మొదట బిర్యానీని మన దేశంలో తయారు చేశారు. ఈ క్రమంలో ఓ సారి హైదరాబాద్‌కు చెందిన నిజం నవాబు ఆ బిర్యానీని రుచి చూసి దానికి ఫిదా అయి దాన్ని హైదరాబాద్‌కు పరిచయం చేశాడు. దీంతో హైదరాబాద్‌లో బిర్యానీని అప్పటి నుంచి వండడం మొదలు పెట్టారు. అది అలా అలా హైదరాబాదీ బిర్యానీ అయింది. అనంతరం హైదరాబాదీ బిర్యానీ విశ్వవ్యాప్తం అయింది. అయితే మన దేశంలో భిన్న ప్రాంతాలకు చెందిన వారు భిన్న రకాలుగా బిర్యానీలను తయారు చేస్తారు.
కలకత్తా బిర్యానీ…
వీరు బిర్యానీలో మాంసంకు బదులుగా ఆలుగడ్డలను ఎక్కువగా ఉపయోగిస్తారు. మసాలాలు, పెరుగు తదితర ఇతర అన్ని పదార్థాలను కలుపుతారు. దీంతో బిర్యానీకి చక్కని రుచి వస్తుంది. అయితే కొందరు మాంసంతోనూ తమ దైన శైలిలో బిర్యానీ వండుతారు.
Advertisements
దిండిగుల్ బిర్యానీ…
చెన్నై వాసులు ఈ బిర్యానీని తయారు చేస్తారు. జీరా, సాంబార్ రైస్ ఇందులో ప్రధానంగా ఉంటాయి. దీంతో బిర్యానీకి భిన్నమైన రుచి వస్తుంది. వీరు పెద్ద పెద్ద మాంసం ముక్కలతో, పెరుగు, నిమ్మరసం, మిరియాలు వేసి బిర్యానీ వండుతారు.
లక్నో బిర్యానీ…
లక్నో బిర్యానీలో మాంసం ముక్కలు మృదువుగా, మెత్తగా ఉంటాయి. మసాలాలను తక్కువగా వాడుతారు. మాంసాన్ని ఉడకబెట్టి దాన్నుంచి తీసిన నీటిలో మసాలాలు కలిపి బిర్యానీ తయారు చేస్తారు.
అర్కోట్ బిర్యానీ...
ఈ బిర్యానీని తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో ఎక్కువగా తయారు చేస్తారు. ఈ బిర్యానీలో వంకాయ కర్రీ, రైతాలను కలుపుకుని తింటారు. అలాగే మధ్యలో సాంబార్ రైస్‌ను కూడా వాడుతారు.
Advertisement
మెమొనీ బిర్యానీ…
గుజరాత్ – సింధ్ ప్రాంతంలో ఈ బిర్యానీని ఎక్కువగా తయారు చేస్తారు. ఇందులో మసాలాల వినియోగం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బిర్యానీ ఘాటుగా ఉంటుంది. బిర్యానీ తయారీలో ఆలుగడ్డలను కూడా వీరు వాడుతారు. కొందరు కూరగాయలను కూడా వేస్తారు.
తలసెరి బిర్యానీ…
దేశంలో చాలా మంది ఈ బిర్యానీని ఇష్టపడతారు. ఇది తియ్యగా ఉంటుంది. ఇందులో చికెన్ వింగ్స్, మలబార్ మసాలాలు, జీడిపప్పు, కిస్మిస్, సోంపు గింజలు వేస్తారు. అందుకనే ఈ బిర్యానీ కొద్దిగా తియ్యగా అనిపిస్తుంది.
కాంపురి బిర్యానీ...
అస్సాంలో ఈ బిర్యానీని తింటారు. ఇందులో పచ్చిబఠానీలు, క్యారెట్లు, ఆలుగడ్డలు, ఎల్లో క్యాప్సికం వంటి వాటిని ఎక్కువగా వేస్తారు. అలాగే యాలకుల వాడకం ఈ బిర్యానీలో అధికంగా ఉంటుంది. కొందరు కూరగాయలను కూడా వేస్తారు.
తహరి బిర్యానీ…
ఈ బిర్యానీని మాంసం లేకుండా తయారు చేస్తారు. మాంసానికి బదులుగా కూరగాయలను ఎక్కువగా వాడుతారు. ఆలుగడ్డలు, క్యారెట్లు ఉపయోగిస్తారు. కాశ్మీర్‌లో ఈ బిర్యానీని తింటారు. బిర్యానీకి వెజ్ వెర్షన్‌గా ఈ బిర్యానీని చెబుతారు.
బియరీ బిర్యానీ…
దక్షిణ కర్ణాటక వాసులు ఈ బిర్యానీని ఇష్టంగా తింటారు. బియ్యం, నెయ్యి, మసాలాలను వేసి రాత్రంతా ఉంచి మరుసటి రోజు ఆ మిశ్రమంతో బిర్యానీని తయారు చేస్తారు.
సింధీ బిర్యానీ…
పచ్చి మిరపకాయలు, మసాలాలు, రోస్ట్ చేయబడిన నట్స్ వినియోగం ఈ బిర్యానీలో ఎక్కువగా ఉంటుంది. ఈ బిర్యానీలో ఆలుగడ్డలను కూడా ఎక్కువగానే ఉపయోగిస్తారు.
భత్కలి బిర్యానీ…
కర్ణాటకలోని భత్కల్ అనే టౌన్‌లో ఈ బిర్యానీని తయారు చేస్తారు. అక్కడ విందుల్లో ఈ బిర్యానీని ప్రధానంగా వడ్డిస్తారు. ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, మసాలాల వాడకం ఈ బిర్యానీలో ఎక్కువగా ఉంటుంది.
బాంబే బిర్యానీ...
పేరుకు తగినట్టుగానే ఈ బిర్యానీని ముంబైలో ఎక్కువగా తయారు చేస్తారు. ఇది చాలా ఘాటుగా ఉంటుంది. చికెన్, మటన్ లేదా కూరగాయలతో ఈ బిర్యానీని తయారు చేస్తారు.
దూధ్ కీ బిర్యానీ…
దీన్ని హైదరాబాద్‌లోనే తయారు చేస్తారు. ఇందులో పాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని వల్ల బిర్యానీకి చక్కని రుచి వస్తుంది.
Advertisements
ధమ్ కీ బిర్యానీ... దీని గురించి స్పెషల్ గా చెప్పేదేముంటుంది. ఆన్ లైన్ లు ఓపెన్ చేసే ఉన్నాయి కదా…ఆర్డర్ చేసి ఓ పట్టు పట్టండి.!