Advertisement
మధ్యతరగతి కుటుంబం, ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదు….. అయినా ఆ 24 ఏళ్ల కుర్రాడు తన టాలెంట్ తో బిగ్ బాస్ నిర్వాహకులను మెప్పించగలిగాడు. పాపులర్ షోకు ఇతడి వల్ల పాపులారిటీ వస్తుందని భావించిన బిబి నిర్వాహకులు మెహబూబ్ ను బిగ్ బాస్ షోకి సెలెక్ట్ చేశారు.
టిక్ టాక్ అతడి జీవితాన్ని మార్చేసింది.
టిక్ టాక్…..ఇది చాలా మందికి టైంపాస్ యాప్…కానీ మెహబూబ్ లైఫ్ లో మాత్రం లైఫ్ ఛేంజింగ్ యాప్! యస్….. డాన్స్ లంటే ఇష్టమున్న మెహబూబ్ అనేక పాటలకు కవర్ సాంగ్ లు చేసి వాటిని టిక్ టాక్ లో అప్ లోడ్ చేసేవాడు.అతడి టాలెంట్ నచ్చి చాలా మంది అతడిని ఫాలో అయ్యేవారు. టిక్ టాక్ లో అతడి ఫాలోవర్ల సంఖ్య 20 లక్షలకు పైనే….అతడు చేసిన 1600 వీడియోస్ కి దాదాపు 3 కోట్లకు పైగా లైక్స్ వచ్చాయ్….ఈ లెక్కలు చాలు మెహబూబ్ కు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పడానికి.
అతడిలోని ఫ్లస్ లు…
ఫిజిక్…. ప్రతి రోజు 2 గంటలు జిమ్ లో గడుపుతాడు. స్టైలిష్ ఉండడం…. డాన్స్ లో ఎప్పటికప్పుడు తనను తాను ఇంప్రూవ్ చేసుకోవడం, ఫ్యామిలీ సపోర్ట్.
పర్సనల్ లైఫ్:
మెహబూబ్ తల్లిదండ్రులది లవ్ మ్యారేజ్….తల్లిపేరు సుశీల, తండ్రి పేరు సలీం.! వీరికి 29 జులై 1995 న మెహబూబ్ జన్మించాడు. ఇంటర్ వరకు స్వస్థలం గుంటూర్ లో చదువుకున్న మెహబూబ్ హైద్రాబాద్ లో ఇంజనీరింగ్ చేసి ఇక్కడే ఓ కార్పోరేట్ కంపెనీలో సాప్ట్ వేర్ జాబ్ లో జాయిన్ అయ్యాడు.
Advertisements
Advertisement
కెరియర్:
చిన్నప్పటి నుండి స్టేజ్ షోస్ లో డాన్స్ చేసే అలవాటున్న మెహబూబ్… 2012 లో యూట్యూబ్ ఛానల్ పెట్టి సొంతంగా డాన్స్ లు, కవర్ సాంగ్స్ ,చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత టిక్ టాక్ లో కూడా వీడియోస్ చేయడం స్టార్ట్ కొద్ది రోజుల్లోనే మంచి పేరు తెచ్చుకున్నాడు.
గర్ల్ ఫ్రెండ్?
మెహబూబ్ దిల్ సే గర్ల్ ఫ్రెండ్ పేరు నవ్య అని ( ధృవీకరించలేదు)… ఆమె ఒక ఫ్యాషన్ డిజైనర్ అని.. మెహబూబ్ కి సంబందించిన డ్రెస్సులన్నీ ఆమే డిజైన్స్ చేస్తుందనే ఓ ప్రచారం మాత్రం సోషల్ మీడియాలో సాగుతుంది.
మెహబూబ్ దిల్ సే చేసిన వీడియోస్ :
Advertisements