Advertisement
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీకి అత్యంత ఖరీదైన ఇల్లు ముంబైలో ఉన్న విషయం విదితమే. అయితే కేవలం ఆయనకే కాదు.. పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఖరీదైన నివాసాల్లోనే ఉంటున్నారు. అంబానీ అంత ఖరీదు కాకపోయినా, ఓ మోస్తరుగా అయినా సరే వారి ఇళ్లు ఖరీదు చేస్తాయి. ఇక అలాంటి విలాసవంతమైన నివాసాల్లో ఉంటున్న బాలీవుడ్ సెలబ్రిటీల వివరాలను ఇప్పుడు తెలుసుకుందామా..!
అమితాబ్ బచ్చన్:
బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు ముంబైలో 5 బంగ్లాలు ఉన్నాయి. వీటిల్లో ప్రతీక్ష అనే బిల్డింగ్‌లో బిగ్ బీ తన యుక్త వయస్సులో ఎక్కువ కాలం గడిపారు. తరువాత జల్సా అనే మరో బంగ్లాకు మారారు. ఈ భవంతిని అప్పట్లో షోలే సినిమా సక్సెస్ అయినందుకు దర్శకుడు రమేష్ సిప్పీ ఆయనకు బహుకరించారు. ఈ బంగళా ఖరీదు రూ.50 కోట్లు.
సల్మాన్‌ఖాన్:
Advertisements
మరో బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్‌ఖాన్‌కు ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో ఉన్న బైరంజీ జీజీభోయ్ రోడ్‌లోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో రెండు 2 బీహెచ్‌కే ఫ్లాట్స్ ఉన్నాయి. ఒక్కో ఫ్లాట్ రూ.16 కోట్లు ఖరీదు చేస్తుంది. అలాగే సల్మాన్‌కు దుబాయ్‌లోనూ అనేక ప్రాపర్టీలు ఉన్నాయి.
సైఫ్ అలీ ఖాన్:
సైఫ్ అలీ ఖాన్‌కు తమ వంశ పారంపర్యంగా సంక్రమించిన ప్యాలెస్ ఒకటి హర్యానాలో ఉంది. దాన్ని ఇబ్రహీం ఇ తలుక్కత్ కోఠి అని పిలుస్తారు. ఆ ప్యాలెస్ ఖరీదు రూ.75 కోట్లు. దాన్ని 1800వ సంవత్సరంలో నిర్మించారు. సైఫ్‌ది నవాబుల కుటుంబం కనుక అతనికి ఆ ప్యాలెస్ తన పెద్దల నుంచి సంక్రమించింది. ఇక ముంబైలో సైఫ్‌కు రూ.70 కోట్ల ఖరీదు చేసే విలాసవంతమైన మరో అపార్ట్‌మెంట్ కూడా ఉంది.
Advertisement
జాన్ అబ్రహాం:
విల్లా ఇన్ ది స్కై అని పిలవబడే అపార్ట్‌మెంట్‌లో జాన్‌కు ఒక పెంట్ హౌస్ ఉంది. దాన్ని సోదరుడు, ఆర్కటెక్ట్ అలన్ అబ్రహాం డిజైన్ చేశారు. ఈ పెంట్ హౌజ్ ఖరీదు రూ.60 కోట్లు. ఇందులో జాన్ ఎక్కువగా జిమ్ చేస్తుంటాడు.
అమీర్ ఖాన్:
ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో అమీర్‌ఖాన్‌కు రూ.60 కోట్ల విలువ చేసే 4 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్ ఉంది. దాని విస్తీర్ణం 5వేల చదరపు అడుగులు.
అక్షయ్ కుమార్:
ముంబై ప్రైమ్ బీచ్‌లో అక్షయ్‌కి రూ.80 కోట్ల విలువ చేసే 2 స్టోరీ బంగ్లా ఉంది. అక్షయ్‌కి తన పెద్దల నుంచి వచ్చిన పలు ప్రాపర్టీలు కూడా ఉన్నాయి.
శిల్పాశెట్టి:
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలకు జుహులో అరేబియా సముద్రానికి ఎదురుగా బంగ్లా ఉంది. దాని పేరు కినారా. దాని ఖరీదు రూ.100 కోట్లు. వీరికి లండన్‌లో పలు ప్రాపర్టీలు ఉన్నాయి.
షారుఖ్‌ఖాన్:
షారుఖ్‌ఖాన్‌కు రూ.200 కోట్లు విలువ చేసే బంగ్లా ఉంది. దాని పేరు మన్నత్. ప్రపంచంలోని టాప్ 10 ఖరీదైన బంగ్లాల్లో ఇది ఒకటిగా పేరుగాంచింది. దుబాయ్, లండన్‌లలోనూ షారుఖ్‌కు ప్రాపర్టీలు ఉన్నాయి.
Advertisements