Advertisement
భారతీయ సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వివాదాలు ఎప్పుడూ తెరపైకి వస్తూనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో చాలా మంది నటీమణులు గతంలో తాము కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డామని బహిరంగంగానే చెబుతుండడం సంచలనం సృష్టిస్తోంది. అయితే ఇప్పుడంటే మీడియా అదీ ఉంది కనుక అందరూ ధైర్యంగా ముందుకు వచ్చి తాము ఎదుర్కొన్న సంఘటనలను చెబుతున్నారు. కానీ ఒకప్పుడు.. అంటే.. 1950లలో ఇప్పటిలా అప్పుడు టెక్నాలజీ లేదు కదా.. మరి అప్పుడు నటీమణులు ఎలా ఇబ్బందులు పడ్డారు ? అంటే మనకు తెలియదు. కానీ కింద ఇచ్చిన పలు చిత్రాలు మాత్రం మనకు అప్పటి పరిస్థితులను కళ్లకు కడుతున్నాయి.
Advertisement
Advertisements
చిత్రాల్లో చూశారు కదా.. అప్పట్లో.. అంటే.. 1951లో జేమ్స్ బర్క్ అనే వ్యక్తి లైఫ్ మ్యాగజైన్ కోసం తీసిన ఫొటోలు అవి. వాటిల్లో ఉన్న వ్యక్తి దర్శకుడు ఏఆర్ కర్దార్. కర్దార్ ప్రొడక్షన్స్‌పై అప్పట్లో అతను షాజెహాన్ (1946), దిల్లగి (1949), దులరి (1949), దిల్ దియా దర్ద్ లియా (1966) వంటి సినిమాలు తీశాడు. చిత్రాల్లో ఉన్నది అతనే. కొందరు యువతులకు ఆడిషన్ నిర్వహిస్తున్నాడు. ఆ ఫొటోలను బట్టి చూస్తే అప్పట్లో పరిస్థితులు ఎలా ఉండేవో మనకు అర్థమవుతుంది.
అయితే అప్పట్లో కాస్టింగ్ కౌచ్ ఉందా, లేదా అనేది మాత్రం మనకు తెలియదు. పైన ఇచ్చిన చిత్రాలు అప్పటి వాస్తవ పరిస్థితిని మనకు కళ్లకు కడుతున్నాయి. అయితే ఇవి బయటకు వచ్చిన ఫొటోలు మాత్రమే. ఇంకా ఇలాంటివి ఎన్ని ఉన్నాయో.. ఇప్పటిలా అప్పుడు టెక్నాలజీ, మీడియా లేకపోవడం అప్పటి యాక్టర్లకు పెద్ద మైనస్ అని చెప్పవచ్చు. లేదంటే అప్పట్లోనే దీనిపై దుమారం చెలరేగి ఉండేది..!
Advertisements