Advertisement
పుడుతూనే ఎవరూ నోట్లో వెండి స్పూన్ తో పుట్టరు.. చాలా సాధారణ జీవితాల నుండి వచ్చి సెలబ్రిటిలుగా ఎదుగినవారూ ఉంటారు..మనకు సెలబ్రిటి అనగానే ఎక్కువగా సినిమా వారే గుర్తొస్తారు.. వారి ఎదుగుదల వెనుక ఎంతో కష్టం, ఎన్నో నిద్రలేని రాత్రులు..తినడానికి తిండి లేక ఖాళీ కడుపుతో పడుకున్న రోజులు లెక్కలేనన్ని ఉంటాయి.. అటువంటి కొందరు నటులు ఎవరు?? ఈ స్థాయికి చేరుకోవడానికి ముందు వారెటువంటి పనులు చేశారు..ఎన్ని కష్టాలు పడ్డారు..
అమితాబ్ బచ్చన్
ఇప్పుడు పద్మవిభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులు అతని సొంతం.. “మెడల్లీయన్ ఆఫ్ హానర్” గౌరవ డాక్టరేట్ తో సత్కారం.. కానీ “బాలివుడ్ షెహన్షా” గా పిలవబడుతున్న అమితాబ్ బచ్చన్ ఈ స్థానానికి రావడానికి ఎంతో కృషి ఉంది.. ఒకప్పుడు మెరైన్ డ్రైవ్ లో అర్దరాత్రులు ఒంటరిగా గడిపాడు, రెండు రేడియో స్టేషన్లు తిరస్కరించాయి అమితాబ్ ని జాకీగా చేర్చుకోవడానికి.. సినిమా ఛాన్సులు వచ్చాకా వరుసగా 12 సినిమాలు ప్లాప్ అయ్యాయి..అయినప్పటికి తన అంకితభావాన్ని, సంకల్పాన్ని కోల్పోకుండా పనిచేశారు..
షారూక్ ఖాన్
Advertisements
“కింగ్ ఖాన్” షారూక్ ఖాన్ ఒకప్పుడు మనందరిలాగే సామాన్యుడు.. ఢిల్లిలో ఒక చిన్న రెస్టారెంట్ స్టార్ట్ చేశాడు..ఫెయిల్ అయింది.. దాంతో ఒక ఆర్కెస్ట్రా ట్రూప్ లో పనికి చేరాడు..అవకాశాల కోసం వెతుక్కుంటూ ముంబై వచ్చాడు..ఉండడానికి చోటు లేక ముంబై హోటళ్ల ముందు నిద్ర పోయేవాడు..దాంతో ఎన్నో సినిమాల్లో అవకాశాలు పోగోట్టుకున్నాడు..తర్వాత అతికష్టం మీద దూరదర్శన్ వారి సీరియల్ కి ఎంపికయ్యాడు..
రజనికాంత్
ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు సూపర్ స్టార్ రజినికాంత్..జపాన్,మలేషియా, సింగపూర్ లో రజిని అంటే పడిచచ్చే అభిమానులున్నారు..ఇప్పుడు ఇంతమందికి డెమీగాడ్,లెజెండ్ గా మారిన రజని ఒకప్పుడు కార్పెంటర్, కూలి నుండి బస్ – కండక్టర్ గా ఎదిగి..అక్కడి నుండి సినిమాల్లోకి వచ్చిన సాదారణ వ్యక్తి.. “గాడ్ ఆఫ్ ఇండియన్ సినిమా” వెనుక రజినికాంత్ కృషి ఎంతో ఉంది.. పద్మ భూషణ్, పద్మ విభూషణ్, ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటి ఆఫ్ ది ఇయర్ లాంటి అనేక అవార్డులు ఇప్పుడు రజని సొంతం..
దిలీప్ కుమార్
పద్మభూషణ్, పద్మ విభూషణ్ లాంటి అవార్డులను పొందిన లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ ఒకప్పుడు రోడ్డు పక్కన పండ్లు అమ్ముకున్నారనే విషయం ఎవరైనా ఊహించగలరా..అంతేకాదు ఆర్మి క్లబ్ లో శాండ్ విచ్ స్టాల్ పెట్టుకుని దాని ద్వారా జీవనోపాదిని పొందాడు.. తొలిరోజుల్లో ఇంటికి , ఫిల్మ్ స్టూడియోలకు వెళ్లడానికి తన దగ్గర ఒక్క పైసా కూడా ఉండేది కాదట.. అటువంటి స్థానం నుండి లెజెండరీ యాక్టర్ గా ఎదిగిన దిలీప్ “పయోనీర్ ఆఫ్ మెథడ్ యాక్టింగ్ ఇన్ ఇండియా” గా పేరు గాంచాడు.. పాకిస్తాన్ ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పౌర గౌరవం నిషన్-ఎ-ఇంతియాజ్ అవార్డు అందుకున్న నటుడు కూడా ఈయనే..
దేవానంద్
భారతీయ సినిమాకు కొత్త శైలిని అందించిన నటుడు “ది ఎవర్ గ్రీన్ యాక్టర్” దేవానాంద్.. గైడ్ ,కాలా పానీ, హరే కృష్ణ హరే రామ్ లాంటి టైమ్ లెస్ క్లాసిక్ సినిమాలు దేవానంద్ ఖాతాలో ఉన్నాయి.. ఈ ప్రయాణం సజావుగా జరగలేదు.. కొన్నేళ్లు గుమాస్తాగా పనిచేసిన దేవానంద్ తర్వాత మిలిటరి సెన్సార్ ఆఫీసర్ గా పనిచేశాడు..అక్కడ ఇమడలేక సినిమాల వైపు వచ్చి తొలినాళ్లల్లో ఇబ్బందులు పడి ఈ స్థాయికి చేరుకున్నాడు.
Advertisement
ధర్మేంద్ర
“హి-మ్యాన్ ఆఫ్ ఇండియా” , యాక్షన్ కింగ్ కిరీటాలు ఊరికే రాలేదు ధర్మేంద్రకు.. సిని పరిశ్రమలో అడుగుపెట్టడానికి ముందు ప్లంబర్ గా పనిచేసేవాడు.. తగినంత ఆదాయం లేక ఖాళీ కడుపుతోనే పడుకున్న రోజులు ఎన్నో ధర్మేంద్ర జీవితంలో..కానీ పట్టుదలతో కృషిచేసాడు..విజయం సాధించాడు.. పద్మ భూషణ్ , అనేక నేషనల్ అవార్డ్స్, ఫిల్మ్ ఫేర్ అవార్డులు సొంతం చేసుకున్నాడు.
అక్షయ్ కుమార్
ఇప్పటి బాలీవుడ్ ఖిలాడి, ఇండియన్ జాకీ చాన్…ఒకప్పుడు వెయిటర్ , చెఫ్ ,ప్యూన్, సేల్స్ మాన్ గా పనిచేసాడు..మొదట్లో అసలు నువ్వు సినిమాలకే పనికిరావని తిరస్కరించారు అక్షయ్ కుమార్ ని..అలాంటి వాడు ఇప్పుడు నటనలో పద్మశ్రీతో పాటు ,ఇతర అవార్డులను దక్కించుకున్నాడు.
మిథున్ చక్రవర్తి
ఒక నక్సలైట్ సినిమా నటుడిగా మారి మన దేశంలోనే కాక,రష్యాలో కూడా అభిమానులను సొంతం చేసుకోగలగడని ఎవరైనా ఊహించగలరా.. కానీ అది సాధ్యమే అని నిరూపించారు మిథున్ చక్రవర్తి..మన డిస్కో డ్యాన్సర్.. తొలిసినిమాతోనే నేషనల్ అవార్డుని సొంతం చేసుకున్నారు మిధున్ .
నవాజుద్దీన్ సిద్దిఖీ
అసలు తన ముఖం చూస్తే దర్శక నిర్మాతలకే కాదు సామాన్య జనానికి కూడా వీడు నటుడేంట్రా అనిపిస్తుంది.కానీ ఒక్కసారి తన యాక్టింగ్ చూస్తే అప్పుడు అర్దమవుతుంది తన ప్రతిభ..అతడే నవాజుద్దీన్ సిద్దిఖీ.. నవాజుద్దీన్ ప్రయాణం బాలివుడ్ నటులకు నిజంగా ఆశ్చర్యకరంగా ఉంటుంది…అతి సామాన్య కుటుంబం నుండి వచ్చిన నవాజ్ జాతీయ అవార్డ్ గ్రహీత వరకు ఎదగడానికి ముందు జీవనోపాదికి వాచ్ మన్ గా పనిచేశాడు..జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించాడు.. కెమిస్ట్రీలో మంచి పట్టుంది.
బొమన్ ఇరానీ
నలభై ఏళ్ల తర్వాత నటనని ప్రారంభించిన నటుడు బొమన్ ఇరాని . ఒకప్పుడు మాట్లాడాలంటే భయపడే బొమన్ ఇప్పుడు బాలివుడ్ లో అందరూ ఎక్కువగా కోరుకునే నటుడు.. వీటన్నింటి కంటే ముందు అతనొక వెయిటర్, రూమ్ సర్వీస్ స్టాఫ్ గా పనిచేశాడు.. ఫోటోగ్రాఫర్ గా మారాడు..తన ఫ్యామిలికి చెందిన బేకరిలోనే పనిచేశాడు..ఇలా అన్ని పనుల తర్వాత 40ల్లో సినిమాల్లోకి వచ్చాడు..తర్వాత వెనక్కి తిరిగి చూస్కోలేదు..
Advertisements