Advertisement
అది 2004 సంవత్సరం….. ఆర్య షూటింగ్ లాస్ట్ డే , 50 షాట్స్ తీయాలి. అందరూ టెన్షన్ పడుతుంటే సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్న భాస్కర్ అనే కుర్రాడు దిల్ రాజు దగ్గరికి వచ్చి టెన్షన్ పడకండి మొత్తం అయిపోతుంది అని చెప్పి సుకుమార్ తో కలిసి ప్లాన్ చేసి మొత్తం షాట్స్ తీసేసారు .
సుకుమార్ , భాస్కర్ ఇద్దరు ఒక సంస్థలో అసిస్టెంట్ డైరెక్టర్స్ గా పనిచేసేవారు. అందుకే ఇద్దరు ఫ్రెండ్స్ లా ఉండేవారు . దిల్ రాజు కి భాస్కర్ పనితనం నచ్చి డైరెక్టర్ గా అవకాశం ఇస్తాను ఒక స్టోరీ రెడీ చేసుకో అన్నాడు . భద్ర సినిమా తర్వాత భాస్కర్ దిల్ రాజు కి ఒక స్టోరీ చెప్పాడు . దిల్ రాజుకి కథ విపరీతంగా నచ్చింది , ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమన్నాడు . అదే బొమ్మరిల్లు.!
ఈ సినిమాకి హీరో గా మొదట ఎన్టీఆర్ ని తర్వాత అల్లు అర్జున్ ని అడిగితే వారిద్దరూ ఒప్పుకోలేదు. తర్వాత సిద్దార్థని అడగగానే ఒప్పేసుకున్నాడు. హీరోయిన్ గా చాలామందిని అనుకున్నారు కానీ డైరెక్టర్ భాస్కర్ హ్యాపీ షూటింగ్ జరిగేటప్పుడు జెనిలియా కళ్ళు చూసి ఈ అమ్మాయే నా సినిమా హీరోయిన్ అని ఫిక్స్ అయిపోయాడు . తల్లి పాత్ర కోసం జయసుధని, హీరోయిన్ తండ్రిగా కోటా శ్రీనివాస్ రావును , హీరో తండ్రిగా ప్రకాష్ రాజ్ లని ఫిక్స్ చేశారు.
టైటిల్ :
Advertisements
ఇక టైటిల్ ఏం పెట్టాలా అని ఆలోచిస్తున్న టైమ్ లో…. వైవియస్ చౌదరి కొత్తగా ఒక బ్యానర్ ఓపెన్ చేసాడు . దాని ఇన్విటేషన్ కార్డ్ ను దిల్ రాజు ఆఫీస్ లో ఇచ్చాడు. ఆ బ్యానర్ పేరే బొమ్మరిల్లు….. ఈ టైటిల్ తన కథకి యాప్ట్ అవుతుందని అదే పేరును ఫిక్స్ చేశాడు దిల్ రాజు.
Advertisement
షూటింగ్ :
ఈ సినిమా బడ్జెట్ 20 కోట్లతో 120 వర్కింగ్ డేస్ అని ప్లాన్ చేశారు . అలా బొమ్మరిల్లు షూటింగ్ స్టార్ట్ చేశారు . 120 రోజులు అనుకుంటే భాస్కర్ మాత్రం 105 రోజుల్లోనే ముగించాడు . ప్రకాష్ రాజ్ ఉండే ఇల్లు నానక్ రామ్ గూడ రామానాయుడు స్టూడియోలో సెట్ వేశారు . ఇప్పటి స్టార్ కమిడియన్ సప్తగిరి , డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్స్ గా పనిచేశారు! ఈ సినిమాకి ప్రాణమైన నాలుగున్నర నిమిషాల క్లైమాక్స్ సింగిల్ టెక్ లోనే చేశారు.!
రిలీజ్ :
బొమ్మరిల్లు సినిమా ఆగస్టు 9 , 2006 లో 72 ప్రింట్లతో రిలీజ్ అయ్యింది . దిల్, ఆర్య , భద్రలతో వరుసగా మూడు సూపర్ హిట్ లు కొట్టిన దిల్ రాజు . నువ్వొస్తానంటే నేనొద్దవంటానాతో స్టార్ డమ్ తెచ్చుకున్న సిద్ధార్థ్ కాంబినేషన్ అప్పటికే ఆడియో సూపర్ హిట్…. సినిమా రిలీజ్ అయిన వారం వరకు టికెట్లే దొరకలేదు
సినిమా ప్రేక్షకులందరిని కట్టిపడేసింది . హీరోయిన్ క్యారెక్టర్ ఈ సినిమాకి ప్రాణం. అందుకే జెనిలియాకి ఈ సినిమా తర్వాత ఫ్యాన్ బేస్ విపరీతంగా పెరిగింది.
బాక్స్ ఆఫీసు :
మొదట్లో 72 ప్రింట్లతో మొదలైన ఈ సినిమా వారంలో 100 ప్రింట్లకు చేరుకుంది . అప్పటికే సంచలనం సృష్టిస్తున్న మహేష్ బాబు పోకిరి సినిమా ఉన్నా…. బొమ్మరిల్లు సినిమా కూడా అంతే ఇంపాక్ట్ క్రియేట్ చేసింది . 25 కోట్ల షేర్స్ కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమా 7 నంది అవార్డ్స్ , మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకుంది .
Advertisements
ఎప్పటికైనా బొమ్మరిల్లు సీక్వెల్ తీయాలనేది దిల్ రాజు కోరిక …. అది తొందర్లోనే నెరవేరాలని తెలుగు ప్రేక్షకులు వెయిటింగ్!