Advertisement
ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో మంచు పర్వతాల్లో బ్రహ్మ కమలాలు విరబూశాయి. ఆ పువ్వులు విరబూస్తున్న సమయంలో తీసిన టైమ్ ల్యాప్స్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్రహ్మ కమలాలు కేవలం సూర్యాస్తమయం తరువాతనే విరబూస్తాయి!
లోకాన్ని సృష్టించిన బ్రహ్మదేవుడి పేరు మీదుగా ఆ పుష్పానికి బ్రహ్మ కమలం అని పేరు పెట్టారు. ఈ పువ్వు పూర్తిగా విరబూసేందుకు 2 గంటల వరకు సమయం పడుతుంది. ఏడాదికి కేవలం ఒకసారి మాత్రమే ఈ పుష్పం వికసిస్తుంది. సుమారుగా 8 ఇంచుల వ్యాసాన్ని ఈ పుష్పం కలిగి ఉంటుంది. ఇక ఒకసారి ఈ పువ్వు విరబూశాక కేవలం కొన్ని గంటల పాటు మాత్రమే అది అలా పూసి ఉంటుంది. తరువాత రాలిపోతుంది.
Advertisement
ఈ పుష్పాలతో దైవాన్ని పూజిస్తే అదృష్టం కలసి వస్తుందని, ఆయరారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతారు.ఇక సైంటిఫిక్‌గా బ్రహ్మ కమలాన్ని Saussurea Obvallata అనే పేరుతో పిలుస్తారు. దీన్ని కేదార్‌నాథ్, బద్రీనాథ్, తుంగనాథ్ వంటి క్షేత్రాల్లో పూజల కోసం వాడుతారు. బ్రహ్మ కమలాన్ని కింగ్ ఆఫ్ హిమాలయన్ ఫ్లవర్స్ అంటారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర పుష్పంగా ఇది ఉంది.
టిబెట్‌లో సాంప్రదాయ ఔషధాలు, ఆయుర్వేద మందుల తయారీలో ఈ పుష్పాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. గాయాలు, పుండ్లను మాన్చే అద్భుతమైన ఔషధ గుణాలు ఈ పుష్పాల్లో ఉంటాయి. అయితే పర్యావరణ కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ వంటి అనేక కారణాల వల్ల ప్రస్తుతం ఈ పువ్వులు అంతరించిపోతున్న మొక్కల జాతుల్లో చేరాయి. కానీ అక్కడి ప్రభుత్వం వీటి కోసం ప్రత్యేకంగా చమోలి జిల్లాలో నర్సరీలను ఏర్పాటు చేసి సంరక్షిస్తోంది.
Watch Video:
Advertisements
Advertisements