Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

అంత్యక్రియల్లో కుండల్లో నీళ్లు పోసి పగలకొడ్తారు ఎందుకు..!!

Advertisement

“జాతస్య హి ధ్రువో మృత్యు:” అని భగవద్గీతలో ఉంటుంది..పుట్టినవాడు గిట్టక తప్పదు అని దానర్దం..సాధారణంగా మనిషి జీవితకాలం 120 సంవత్సరాలు..కానీ ప్రస్తుతం మనం తీసుకునే ఆహారం మూలంగా 100 సంవత్సరాల లోపు కి పడిపోయింది.. రకరకాల రోగాలు, యాక్సిడెంట్లు,కాలుష్యం ఇతరత్రా కారణాలతో అనేకమంది 60లోపే మరణిస్తున్నారు..మనిషి మరణించిన తర్వాత అంత్యక్రియల్ని రకరకాల సంప్రదాయాల ప్రకారం రకరకాలుగా చేస్కుంటారు..

హిందూ సంప్రదాయం ప్రకారం చేసే అంత్యక్రియల్లో శరీరాన్ని చితి మీద పెట్టాక కుండలో నీరు పోసి దానికి రంధ్రాలు చేసి చుట్టూ తిరుగుతారు..అసలు ఇలా ఎందుకు చేస్తారు అంటే సమాధానం ఎవరి దగ్గర ఉండదు..మన పూర్వీకులు చేస్తున్నారు..మనం ఫాలో అవుతున్నాం అంతే..కానీ గీతాసారం ప్రకారం ఈ సంప్రదాయం వెనుక ఒక అర్దం ఉంది.

Advertisement

కుండ నీ శరీరం లాంటిది, అందులో  ఉన్న నీరు నీ ఆత్మ లాంటిది. కుండకు పెట్టిన రంధ్రం నుండి నీరు ఎలాగైతే వెళ్లి పోయిందో. నీ శరీరం నుండి నీ ఆత్మ బయటికి పోయింది అనడానికి సూచనే అది.ఆ తర్వాత కుండను కింద పడేసి పగలగొడతారు. ఇప్పుడు  శరీరాన్ని కాల్చేస్తారు. ఇంకా నీకు ఈ శరీరం ఉండదు. నువ్వు వెళ్లిపో.. అని ఆత్మకు మనమిచ్చే సంకేతంగా చివరికి ఆ కుండను కింద పడేసి పగలగొడతారు..

 

Also Read: మీలో ఎంత‌మంది మెచ్చుకుంటారో..ఎంత‌మంది తిట్టుకుంటారో తెలియ‌దు..కానీ ఇదే నా జీవితం..!

Advertisements

Also Read:  క్వారంటైన్ పేరుతో మన వాళ్ళను కాల్చి చంపిన బ్రిటీష‌ర్స్ – చరిత్ర చెప్పని ఈ నిజం గురించి మీకు తెలుసా?

Advertisements

Also Read: “నేను డెలివ‌రీ అయిన రోజు” – అంటూ ఓ త‌ల్లి త‌న ‘ప్ర‌స‌వ వేద‌న’ గురించి చెప్పిన మాట‌లు.!