Advertisement
రెండు కుటుంబాలు ఘనంగా చేసుకునే వేడుక “వివాహం”.. అటువంటి వేడుకకి సర్వం సిద్దంగా ఉంది.. ఆడపెళ్లింట సందడిసందడిగా ఉంది..మగపెళ్లి వారు అప్పుడే విడిదింటికి చేరుకున్నారు..పెళ్లికి ముందు జరగాల్సిన సంప్రదాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి.. ఇల్లంతా పెళ్లి సంబరంలో ఉంది..మరికొన్ని గంటలైతే పెళ్లి పూర్తయ్యి రెండు కుటుంబాలు సంతోషంగా ఉండేవే..కానీ..
ఉత్తరప్రదేశ్ లోని భగతపూర్వకి చెందిన వినితకి సంజయ్ తో పెళ్లి నిశ్చయమైంది..జూన్ 27న పెళ్లి అనగా,ముందు రోజు రాత్రి పెళ్లికి ముందు చేయాల్సిన ఆచారవ్యవహారాలు జరిపిస్తున్నారు..సంజయ్ వాళ్లు కూడా ఆడపెళ్లింటికి చేరుకున్నారు..అందరూ పెళ్లిసంబరంలో ఉండగా వినిత ఆకస్మాత్తుగా స్పృహతప్పిపడిపోయింది… మొదట పెళ్లి పనుల్లో సరిగా తినకపోవడం వల్ల కళ్లు తిరిగిపడిపోయింది అనుకున్నారు..
Advertisement
ఎంత సేపటికి వినిత స్పృహలోకి రాకపోవడంతో వెంటనే దగ్గరలోని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు..కరోనా భయంతో హాస్పిటల్లో చేర్చుకోవడానికి నిరాకరించి..ముందుగా కరోనా టెస్ట్ చేయించి హాస్పిటల్ కి తీసుకురావాలని షరతు పెట్టారు సదరు హాస్పిటల్ వాళ్లు.. దీంతో ఏం చేయాలో అర్థం కాక వెంటనే వినితను తీసుకుని కాన్పూర్ కి ప్రయాణమయ్యారు. కానీ అప్పటికే వినిత పరిస్థితి విషమించి మధ్యలోనే ప్రాణాలు వదిలింది.హస్పిటల్ వారి తీరుపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కుటుంబ సభ్యులు..
పెళ్లి చేసి అత్తవారింటికి పంపాల్సిన కూతురిని అంత్యక్రియలు చేసి శ్మశానికి తీసుకెళ్లారు..ఈ మొత్తం వ్యవహారంలో పెళ్లి కొడుకు సంజయ్ వినితతో పాటే ఉన్నాడు..పెళ్లి చేసుకుని వినితను తన జీవితంలోకి ఆహ్వానించి సంతోషంగా బతకాలనుకున్నాడు..కానీ మధ్యలోనే ఇలా జరగడంతో కుటుంబసభ్యులతో ఒంటరిగా బయల్దేరాడు…మనం అనుకోనివి జరగడమే విధి.!
Advertisements
Advertisements