Advertisement
ప్రపంచ సైక్లింగ్ దినోత్సవం నాడే మన దేశంలోనే అతిపెద్ద సైకిల్ కంపెనీ అట్లాస్ మూతపడడం శోచనీయం..ఇప్పుడు జనమంతా కొత్త కొత్త మోడల్ బైక్స్ , కార్స్ వెంట పడుతున్నారు కానీ….. ఒకప్పుడు అందరికి సైకిలే ఆధారం! అదే స్టేటస్ సింబల్ కూడానూ..! అటువంటి సైకిల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు..
సైకిల్ చరిత్ర:
- 1813లో బేడన్ డ్రే అనే వ్యక్తి కొయ్యతో తయారు చేసిన చక్రాల బండిని తయారు చేశాడు..కానీ దీనిని కాళ్లు నేలకు ఆనించి ముందుకు వెనుకకు ఈడ్చుకుంటూ వెళ్లాల్సి వచ్చేది.
- తర్వాత 20ఏళ్లకు మాక్మిలన్ అనే వ్యక్తి నిర్మించిన సైకిల్ రూపు కొంత మార్చాడు..వెనుక చక్రానికి కాంక్ లను ఏర్పరచి, వాటిని రెండు పొడుగాటి తూలదండాలకి కలిపాడు..వాటిని కాళ్లతో కదిపితే సైకిల్ ముందుకు పోయేది.
- మాక్మిలన్ నిర్మించిన దానిని పునరుద్దరించాడు ఫిలిప్ హెన్రిక్..సైకిల్ కి రెండు వైపులా పెడల్స్ ని ఏర్పాటు చేశాడు.
- 1890 నాటికి పెడల్ సైకిల్ అందుబాటులోకి వచ్చింది ..పెడల్ కి వెనుక చక్రం ఇరుసుకి ఒక గొలుసు(చెయిన్)ని అమర్చింది హాన్స్ రెనాల్డ్.
Advertisement
- టైర్లను తయారు చేసింది పశువైధ్యుడు జాన్ బాయిడ్ డన్ లప్..ఇతడు మొక్కలకు నీరు పెట్టే పైపును రెండు బాగాలు చేసి వాటి మొదళ్లను అతికించి, గాలితో నింపి సైకిల్ కి టైర్లుగా అమర్చాడు..అంతకు ముందు మందపాటి రబ్బరుచక్రాలను వినియోగించేవారు.
Advertisements
Advertisements
- చివరికి 19వ శతాబ్దం ప్రారంభం నాటికి పూర్తి స్థాయి సైకిల్ నిర్మాణం జరిగింది..ఐరోపా రోడ్లపై వేగవంతమైన సైకిల్ దూసుకువెళ్లేవి..
కొసమెరుపు:
- నోబుల్ బహుమతి గ్రహీత, ఆర్థికవేత్త అమర్త్యసేన్ తనకు నోబుల్ తెచ్చిపెట్టిన ఆర్థిక సూత్రీకరణ కోసం గ్రౌండ్ లెవల్లో అధ్యయనం కోసం సైకిల్ మీదనే తిరిగేవారు. ఆయన ఉపయోగించిన సైకిల్ ప్రస్తుతం స్వీడన్‌లోని స్టాక్ హోమ్‌లో గల నోబుల్ మ్యూజియంలో ఉంది.

అమర్త్యసేన్ సైకిల్
- పార్లమెంట్ కి సైకిల్ పై వెళ్లిన అతి సామాన్య ఎంపీ ,వామపక్ష నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య. పార్లమెంట్ లో చప్రాసీల సైకిళ్లతోపాటు ఇతని సైకిలు కూడా స్టాండులో ఉండేది. అసెంబ్లీకి కూడా అదే సైకిల్ పై వెళ్లేవారు సుందరయ్య..ప్రస్తుతం ఆ సైకిల్ హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ణాన కేంద్రంలో ఉంది..

పుచ్చలపల్లి సుందరయ్య సైకిల్
- కొన్ని దేశాల్లో సైకిల్ నడపాలంటే కూడా లైసెన్స్ తప్పనిసరి
- ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న ప్రపంచ సైకిల్ దినోత్సవం నిర్వహిస్తారు.