Advertisement
చాలా మంది పర్యాటకులకు మన దేశంలోనే కాదు.. ఇతర దేశాల్లోనూ విహరించాలని ఉంటుంది. ఆయా దేశాల్లోని పచ్చని ప్రకృతిని, ఇతర ప్రదేశాలను చూడాలనిపిస్తుంది. అయితే విదేశాలకు వెళ్లాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అని భావిస్తారు. కానీ కింద తెలిపిన ప్రదేశాలకు వెళితే పెద్దగా ఏమీ ఖర్చు కాదు. చాలా తక్కువ బడ్జెట్‌తోనే ఈ దేశాల్లో విహరించి రావచ్చు. మరి ఆ దేశాలు ఏమిటంటే…
1. టర్కీ:
మన దేశంలోని ప్రముఖ విమానాశ్రయాల నుంచి టర్కీలోని ఇస్తాంబుల్‌కు విమానాలు నడుస్తాయి. అలాగే టిక్కెట్ల ధరలు కూడా చీప్‌గానే ఉంటాయి. టర్కీ ఆసియా, యూరప్‌ల మధ్య విస్తరించి ఉంది. ఇక్కడి బీచ్‌లు, మ్యూజియంలు, మసీదులు, ఇతర పర్యాటక ప్రదేశాలు అందరినీ ఆకట్టుకుంటాయి. అంకారా, ఇజ్‌మిర్, బొడ్రుమ్, అంటల్యా, కాస్, ట్రాబ్‌జాన్, రైజ్, ఎస్కిసెహిర్, బర్సా తదితర అనేక ప్రాంతాలు ఇక్కడ చూడదగినవి. అలాగే భారత్‌లోని రెస్టారెంట్లలో లభించే ఫుడ్‌కు ఉండే ఖరీదే ఇక్కడి రెస్టారెంట్లలోనూ ఉంటుంది.
Advertisements
2. ఇండోనేషియా:
చాలా తక్కువ బడ్జెట్‌లో విదేశాల్లో టూర్‌కు వెళ్లాలనుకునే వారు ఇండోనేషియాకు వెళ్లవచ్చు. మన దేశంలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్‌కతాల నుంచి ఇండోనేషియాకు విమానాలను నడుపుతారు. ఇక్కడ బాలి దీవులు ఎంతగానో ఆకట్టుకుంటాయి.
3. వియత్నాం:
వియత్నాంకు కూడా చాలా తక్కువ ఖర్చుతో వెళ్లి రావచ్చు. ఇక్కడి బీచ్‌లు ఎంతగానో ఆకట్టుకుంటాయి.
Advertisement
4. జెక్ రిపబ్లిక్:
ఈ దేశం యూరప్‌లో ఉన్నప్పటికీ మనం చాలా తక్కువ ఖర్చుతో ఇక్కడికి వెళ్లి రావచ్చు. ఇక్కడ అద్భుతమైన టౌన్‌లు కనిపిస్తాయి.
5. హంగేరి:
మధ్య యూరప్ లో ఈ దేశం ఉంటుంది. ఇక్కడికి కూడా బడ్జెట్ ధరలో వెళ్లవచ్చు.
6. రొమేనియా:
భారతీయులు ఈ దేశానికి ఎక్కువగా వెళ్తుంటారు. తక్కువ బడ్జెట్‌లోనే రొమేనియాలో విహరించవచ్చు. ఇక్కడి పర్వత శ్రేణులు ఎంతగానో ఆకట్టుకుంటాయి.
7. కజకిస్థాన్:
మధ్య ఆసియాలో ఈ దేశం ఉంటుంది. ఇక్కడి పర్యాటక ప్రదేశాలు ఎంతో ఆకట్టుకుంటాయి.
8. అజెర్‌బైజన్:
ఇది కూడా మధ్య ఆసియాలో ఉంటుంది. ఇక్కడి భవనాల నిర్మాణ శైలి ఆకట్టుకుంటుంది. పచ్చని ప్రకృతి దృశ్యాలు కనిపిస్తాయి.
Advertisements