Advertisement
“Necessity is the mother of invention”.. అవసరం ఆవిష్కరణలకు పునాది అని.. తను ఎదుర్కొన్న సమస్యల నుండి ఆ సమస్యకు పరిష్కారం ఆలోచించింది ఆ అమ్మాయి..రోజూ చదువుకోవడానికి వెళ్లి వచ్చే దారిలో అడ్డంకులను ఎదుర్కోవడానికి కేవలం తనకోసం మాత్రమే కాదు అమ్మాయిలందరికి భరోసానిస్తూ..తన ఆవిష్కరణను ప్రపంచానికి పరిచయం చేసింది..ఇంతకీ ఎవరా అమ్మాయి..అమ్మాయిలకోసం ఏం చేసింది.
ఉత్తరప్రదేశ్లోని ఫరూకాబాద్ కి చెందిన నాగాసాలాడల్ గ్రామానికి చెందిన అమ్మాయి సీనూ కుమారి..వయసు 20ఏళ్లు..ప్రైమరీ స్కూల్ చదువు ఊర్లో కంప్లీట్ చేసింది..హైస్కూల్ విద్య,కాలేజ్ కి వెళ్లాలంటే 50కిమి దూరం వెళ్లాల్సిందే.. వెళ్లొచ్చే దారిలో ఎన్నో అడ్డంకులు..అబ్బాయిలు ఎలా అయినా వెళ్లి రావొచ్చు.కానీ అమ్మాయిలు వెళ్లాలంటే మగతోడు తప్పనిసరి..అయినా అమ్మాయి చదువుకోసం అంతదూరం వెళ్లాలా..చదవకపోతే ఏంటి అనే చుట్టపక్కల వాళ్ల మాటలు..
సీనూ తండ్రి అందరిలా ఆలోచించలేదు.. తన కూతురిని పై చదువులు చదివించాలని నిర్ణయించుకున్నాడు.. మొదట్లో అంత దూరం వెళ్లి రావడం కష్టంగా ఉండేది..కాలేజివిద్యకు వచ్చాక అక్కడే ఒక రూం తీసుకుని కూతురిని ఉంచాడు.. ఇక్కడే అసలు కథ మొదలైంది.ఆడపిల్ల సేఫ్టీ గురించి అనుక్షణం కాపలా కాయాల్సిన అవసరం..తల్లిదండ్రులకు ఆ పరిస్థితిలేదు..దాంతో తనను తానే రక్షించుకోవాలని నిర్ణయించుకుని రేప్-ప్రూఫ్ అండర్వేర్ ని సృష్టించింది సీనూ కుమారి.
Advertisements
తను తయారు చేయాలనుకున్న ప్రొడక్ట్ గురించి కాలేజ్లో టీచర్స్ కి ఫ్రెండ్స్ కి చెప్తే ఎవరూ అంత సీరియస్ గా తీసుకోలేదు.. అది సాధ్యం కాదులే లైట్ లే అనే మాటలు చెప్పారు..కానీ సీనూ కుమారి లైట్ తీస్కోవాలనుకోలేదు..తనకు కావాలసిన వస్తువులను తెచ్చుకోవడానికి 200కిమి ప్రయాణించి నోయిడా వరకు వెళ్లి , చేతిలో ఉన్న డబ్బులు సరిపోకపోతే అన్ని తక్కువ ధరకు వచ్చే వస్తువులను తీసుకుని చివరికి రేప్ ప్రూఫ్ అండర్వేర్ ని తయారుచేసింది..అందరూ ఆశ్చర్యపోయారు.
Advertisement
రేపిస్ట్ ని పట్టుకోవడానికి దోహదం చేసే ఈ డివైస్లో కెమెరా,జిపిఎస్ ,స్మార్ట్ లాక్ తదితర ఫెసిలిటిస్ ని ఏర్పాటు చేసింది..స్మార్ట్ లాక్ కి పాస్ వర్డ్ ఏర్పాటు చేసుకునే ఫెసిలిటి ఉంది..కెమెరాలో రేపిస్ట్ ఫోటోస్ క్లిక్ అవ్వడమే కాకుండా..ఒక వేళ అమ్మాయి ప్రమాదంలో ఉందనగానే జిపిఎస్ ద్వారా లొకేషన్ మరియు మెసేజెస్ వాళ్ల రిలేటివ్స్ కి,,పోలీసులకు వెళ్లేలా ఏర్పాటు చేసింది..ఈ ప్రొడక్ట్ ని ముందుగా తన చుట్టాలు,ఊర్లో వారికే చూపించింది..పిన్నిలు,వదినలు అందరికి నచ్చింది..
ఇది బుల్లెట్ ప్రూప్ క్లాత్ తో తయారు చేసినది..దాని వల ఎలాంటి దద్దుర్లు లాంటిివి రావని చెప్పోంది సీనూ , అది తయారుచేయడానికి 5000రూ ఖర్చైందని మరింత మెరుగ్గా తయారుచేసి దీన్ని మార్కెట్లోకి తీసుకురావాలనుకుంటుంది.ఒకవేళ అమ్మాయిలు తను తయారు చేసిన ప్రొడక్ట్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే..ఈ వేధింపులు తగ్గుతాయి..కొద్దిమందైనా అమ్మాయిలపై చేయ్ వేయడానికి భయపడతారు..అని భరోసాగా చెప్తోంది.
Advertisements
యత్రనార్యంతు రమంతే..తత్ర దేవతా.. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని అర్దం..మన దేశంలో ప్రతిరోజు స్త్రీలు పూజింపబడతారో లేదో కానీ, ప్రతి పావుగంటకి ఒక అమ్మాయి రే_ప్ కి గురవుతున్నారనేది ఒక నిజం అయితే..అందులో ఎక్కువ శాతం ఇంట్లో వాళ్లు,తెలిసిన వాళ్లే రేప్ చేస్తున్నారనేది మరో పచ్చి నిజం.. అమ్మాయిలను రక్షించడానికి తనవంతుగా కృషి చేసింది సీనూ కుమారి…ఈ డివైస్ అందరికి ఉపయోగపడాలని ఆశిద్దాం..!