Advertisement
తాచు పాములు ఎంత ప్రమాదకరమైన జీవులో అందరికీ తెలిసిందే. అవి విషాన్ని చిమ్మగలవు. అవి కాటు వేస్తే వాటి విషానికి చాలా త్వరగా చనిపోతారు. ఒక పెద్దదైన తాచుపాము సుమారుగా 18 అడుగుల వరకు పొడవు పెరుగుతుంది. దాని కాటుతో భారీ ఏనుగును కూడా చంపగలదు. అందుకు సుమారుగా 3 గంటల వరకు సమయం పడుతుంది. అందువల్ల తాచుపాము పిల్ల కూడా మనుషులను చంపేంత విషాన్ని కలిగి ఉంటుంది. అప్పుడే పుట్టిన పిల్ల అయినా సరే మనిషిని చంపేయగలదు. తాచు పాము పిల్ల కాటు వేస్తే కేవలం 1 గంటలోనే మనిషి చనిపోతాడు.
పెద్ద తాచుపాములు మాత్రమే విషాన్ని కలిగి ఉంటాయని, తాచు పాము పిల్లలు ఏమీ చేయలేవని అనుకోవద్దు. ఎందుకంటే పిల్ల పాముల్లోనూ ఒక్క మనిషిని చంపేంత విషం ఉంటుంది. అందువల్ల వాటి జోలికి కూడా వెళ్లవద్దు. అవి విషాన్ని చిమ్మితే మన కళ్లలో అది పడితే మనకు కళ్లు పోయే అవకాశం ఉంటుంది. పక్షవాతం కూడా రావచ్చు. చివరకు చనిపోవచ్చు. అందువల్ల తాచు పాము కాటు వేసినా, విషాన్ని చిమ్మినా వెంటనే స్పందించాల్సి ఉంటుంది. ఆలస్యం చేస్తే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది.
Advertisement

snake
పెద్ద తాచుపాములు సుమారుగా 8 అడుగుల వరకు విషాన్ని చిమ్మగలవు. అదే పిల్ల పాములు అయితే సుమారుగా 2 నుంచి 4 అడుగుల వరకు విషాన్ని చిమ్ముతాయి. విషం కళ్లలో పడితే వెంటనే కళ్లను రన్నింగ్ వాటర్ కింద శుభ్రం చేయాలి. నలపవద్దు. వెంటనే వైద్య సహాయం పొందాలి. తాచుపాముల విషం కళ్లలో పడితే కళ్లు ఎరుపు రంగులోకి మారి వాపులకు లోనవుతాయి. తీవ్రమైన తలనొప్పి, వికారం, వాంతులు కావడం, కడుపు నొప్పి, డయేరియా, తలతిరగడం, స్పృహ తప్పి కోల్పోవడం జరుగుతుంది.
కొన్నిసార్లు వెంటనే చూపు కోల్పోవచ్చు. కానీ కొన్ని సార్లు పోయిన చూపు తిరిగి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే విషం పడ్డ వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లాలి. లేదంటే అది రక్తంలోకి ప్రవహించి గుండెకు చేరుకుంటుంది. దీంతో మరణం సంభవిస్తుంది. ఇక తాచు పాములు సహజంగానే తాము స్టోర్ చేసుకునే విషాన్ని ఒకేసారి వదలవు. కానీ వాటి పిల్లలు మాత్రం భయపడితే ఒకేసారి విషం మొత్తాన్ని బయటకు వదులుతాయి. కనుక తాచుపాములతో మాత్రమే కాదు, వాటి పిల్లలతోనూ జాగ్రత్తగా ఉండాల్సిందే. పాము పిల్లలే కదా.. అని లైట్ తీసుకోకూడదు.
Advertisements
Advertisements