Advertisement
గంగా, బ్రహ్మపుత్ర నదులను ఇండియాకు రాకుండా…చైనా టిబెట్ లోనే దారిమళ్లించొచ్చు… అలాంటి సహజ అవకాశాలన్నీ టిబెట్ లో చైనాకు ఉన్నాయి. కానీ ఒక వేళ ఇండియా మీద కోపంతో చైనా అలా చేస్తే…అది ఆ దేశ ప్రజల ప్రాణాలకే ప్రమాదం! ఇలా గతంలో అల్రెడీ నీటిని దిగువకు వెళ్లకుండా ఆపే ప్రయత్నం చేశారు….దానికి భారీ మూల్యం కూడా చెల్లించుకున్నారు!
కింది ఫోటోలలో….గంగానదిపై టిబెట్ లో చైనా కట్టిన డ్యామ్స్ ను చూపించడం జరిగింది!
Advertisement
ప్రపంచంలోని అది పెద్ద డ్యామ్ గా గుర్తింపుపొందిన 3 గేజ్ డ్యామ్ ఎత్తకుండా., నీటిని కిందకు వదలకుండా అలాగే రిజర్వ్ చేసి పెట్టాలన్న చైనా కకృత్తి ఆలోచన కారణంగా …. చైనాను ఇటీవల భారీ వరదలు ముంచెత్తాయి.! ఒక్కసారిగా వదర నీరు చేరడంతో అప్పటికప్పుడు గేట్లను ఎత్తివేసి ఎంతో మంది ప్రజల ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు..ఆస్తి నష్టం కూడా భారీగా జరిగింది.!
Advertisements
ఎక్కువ ఎత్తు నుండి వస్తాయి కాబట్టి హిమాలయాలనుండి వచ్చే నీటి ప్రవాహానికి వేగం ఎక్కువ మరియు తక్కువ సమయంలో ఎక్కువ నీరు వచ్చి చేరుతుంటుంది. నీటి వేగాన్ని, నీటి పరిమాణాన్ని అంచనా వేయడం అసాధ్యం…కాబట్టి…డ్యామ్ ల ద్వారా ఆపే ప్రయత్నం చేయలేరు…ఒకవేళ ఆపినా ఎక్కువ కాలం ఆపలేరు.! ఇక నీటి ప్రవాహానికి వర్షాలు కూడా మొదలైతే అది చైనాకే నష్టాన్ని కలిగిస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు నీటిని దిగువ ప్రాంతానికి వదలడానికే చైనా మొగ్గుచూపాల్సి ఉంటుంది!
వరదల కారణంగా చైనా పరిస్థితి ( ఫోటోలు):
ప్రకృతికి ఎవరూ అతీతులు కారు…నీరు పల్లమెరుగుతుంది అది కాదని…వింత పోకడలకు పోతే కప్పెడుతుంది….అది చైనా అయినా, పాకిస్థాన్ అయినా…!?
Advertisements