Advertisement
అనకొండలో మనుషులను అమాంతం మింగేసే సీన్లు సినిమాల్లో చాలానే చూశాం కదా! కానీ నిజజీవితంలో అనకొండలు మనుషులను మింగినట్టు ఎక్కడా ధృవీకరించడబడలేదు! కాకపోతే చిన్నచిన్న పక్షులను జంతువులను మింగగలవు.!
రెండు రకాల పాములు మాత్రం ….చిన్నపాటి మనుషులను అంటే చిన్న పిల్లలను మింగే సామర్థ్యం కలిగి ఉన్నాయి ! అవి ఒకటి గ్రీన్ అనకొండ. మరొకటి రెటిక్యులేటెడ్ పైథాన్. ఈ రెండు పాములను అడవుల్లో గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే అవి ప్రకృతిలో కలిసిపోయిన రంగుతో ఉంటాయి. ఈ పాములు కనిపించడం కూడా చాలా అరుదుగా జరుగుతుంటుంది..!
Advertisement
అనకొండలు …ఇతరు జీవుల్ని చంపడానికి డిఫరెంట్ స్ట్రాటజీని ప్లే చేస్తాయి.! చంపాలనుకునే టార్గెట్ ను ఫిక్స్ చేసుకొని….అమాంతం వాటి శరీరం చుట్టూ చుట్టేసుకొని టైట్ చేస్తాయి….దీని కారణంగా సదరు జంతువుల శరీరంలోని ఎముకలన్నీ విరిగిపోతాయి…దీంతో ఆ జంతువు కదలలేని స్థితిలోకి వెళ్లిపోతుంది. అప్పుడు మొల్లిగా మింగేసే ప్రయత్నం చేస్తాయి!
Advertisements
Advertisements
అప్పుడప్పుడు ఇలాంటి చిత్రాలతో ప్రచారం జరిగినా…ఇది గ్రాఫిక్స్ గానో, సినిమాల్లోని ఇమేజ్ గానో భావించండి..అంతేకానీ నిజమని నమ్మి ఫార్వర్డ్ చేయకండి!