Advertisement
ఈ మధ్య కాలంలో పోలీసుల జరిమానాలు ఎక్కువ కావడంతో బళ్ల మీద కార్ల మీద చాలా మంది పోలీస్, ప్రెస్ అని రాసుకుంటున్నారు. మరికొందరు ఆర్మీ అని కూడా రాసుకోవడం కూడా ప్యాషన్ అయిపోయింది. అలా ఉంటే పోలీసులు ఆపే అవకాశం ఉండదని రాసుకుంటున్నారు. దీనితో ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉందనే ఆలోచన కూడా చాలా మందికి లేదు.
Also Read:ఆ టాబ్లెట్స్ వేసుకుంటే పొట్ట వస్తుందా…?
Advertisement
కొందరు తమ బండి మీద ‘ ప్రెస్, ఆర్మీ, పోలిస్, అని రాసుకుంటారు, కాని ఇలా రాయడం చట్టరీత్య సరియైనదేనా ? అనే అనుమానం చాలా మందికి ఉంది. వాస్తవంగా మాట్లాడితే… ఆర్టీఏ చట్టం ప్రకారం చూస్తే… తప్పు, అలా రాస్తే కచ్చితంగా జరిమానా విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ పోలీస్ కాకుండా పోలీస్ అని రాసినా లేదా ప్రెస్ కాకుండా ప్రెస్ అని రాసినా కచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉంది.
దానికి క్రిమినల్ శిక్షలు విధించే అవకాశాలు ఉన్నాయి. ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు కూడా ప్రెస్ అని , వాచమన్, సెక్యూరిటీ వాళ్ళు కూడా పోలీస్ అని రాసుకోవడం చాలా తప్పు. అయితే ఈ విషయంలో పోలీసులు చాలా వరకు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. పార్టీల పేర్లు, దేవుళ్ళ ఫోటోలు, స్లోగన్ లు రాసిన శిక్షకు అర్హులనే చెప్పాలి.
Advertisements
Advertisements
Also Read:మనసు అనే పార్ట్ ఉందా…? మనసు భారం అంతా దేని మీద ఉంటుంది…?