Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

కార్ పై గుడ్డు ప‌డితే ఎట్టి ప‌రిస్థితుల్లో కార్ ఆపొద్దు.! ఈ విష‌యాన్ని గుర్తుపెట్టుకోండి.!

Advertisement

జాగ్ర‌త్త…..త‌స్మాత్ జాగ్ర‌త్త‌.! ముఖ్యంగా నైట్ టైమ్ జ‌ర్నీ చేసేవాళ్లు ఈ విష‌యాన్ని దృష్టిలో పెట్టుకోండి. ప్ర‌యాణంలో మీ కార్ అద్దం పై కోడి గుడ్డు ప‌డితే..ఎట్టి ప‌రిస్థితుల్లో కార్ ఆప‌డం కానీ, వైఫ‌ర్ ఆన్ చేయ‌డం కానీ చేయొద్దు.!

ఇటీవ‌ల కాలంలో… కొంత మంది నైట్ టైమ్ లో కార్ల‌ను టార్గెట్ చేసి….వాటిపై కోడి గుడ్ల‌ను కొడుతున్నార‌ట‌… ఏదో ప‌డింద‌ని కార్ ఆపి అద్దాన్ని క్లీన్ చేసుకునే గ్యాప్ లో వాళ్ళు దాడికి దిగి డ‌బ్బు , న‌గ‌లు దోచేస్తున్నార‌ట‌!

ఇక వైఫ‌ర్ ఆన్ చేస్తే…ఆ గుడ్డు కార్ అద్దం నిండా ప‌రుచుకుంటుంది….దీంతో త‌ప్ప‌క కార్ ను ఆపాల్సి వ‌స్తుంది. ఆ గ్యాప్ లో దుండ‌గులు అటాక్ చేస్తున్నార‌ట‌.! సో బీకేర్ ఫుల్.!

Advertisement

మరికొన్ని జాగ్రత్తలు:

Advertisements

  • నైట్ టైమ్ లో ప్ర‌యాణం చేసే వాళ్లు…అద్దాన్ని క్లోజ్ చేసి ఉంచాలి.
  • రాత్రి వేళలో ప్రయాణించేవారు…కాఫీ, టీ తాగాలనుకుంటే జనాలు ఉన్న ద‌గ్గ‌రే ఆపాలి.
  • ప్రయాణాల్లో ….ఎక్కువ మొత్తంలో బంగారం, డ‌బ్బు తీసుకెళ్ల‌క‌పోవ‌డ‌మే ఉత్త‌మం!
  • మిమ్మ‌ల్ని ఎవ్వ‌రైనా ఫాలో అయితున్న‌ట్టు అనిపిస్తే…వెంట‌నే 100 కు డ‌య‌ల్ చేయండి!

Advertisements