Advertisement
మూర్ఖులు
పాఠం ఉద్దేశం : అనవసరమైన ఆలోచనలతో , పనులతో సమయాన్ని వృథా చేసుకోవొద్దు అని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం.
I) ప్రశ్న- జవాబులు :
1Q) మూర్ఖులు అని ఎవరిని అంటారు?
A: కనీస ఆలోచన శక్తి, విచక్షణా జ్ఞానం లేని వాళ్లను మూర్ఖులు అంటారు. వీరు అనవసరమైన ఆలోచనలు, పనులతో తమ సమయాన్ని వృథా చేసుకుంటుంటారు.
2Q) సమయం వృథా ఎందుకు చేయకూడదు?
Advertisements
A: కోట్లు పెట్టినా కొనలేని విలువైన వస్తువు సమయం.! గడిచిన కాలం ఎప్పటికీ తిరిగిరాదు. అందుకే సమయం దొరికినప్పుడల్లా మనకు, సమాజానికి పనికి వచ్చే పనులు చేయాలి. విలువైన సమయాన్ని వృథా చేసుకొని తర్వాత బాధపడితే ఏమీ రాదు. అందుకే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
3Q) మూర్ఖులు అనే కథలో మంత్రి చేసిన పని సరైనదేనా? ఎందుకు?
A: మూర్ఖులు అనే కథలో మంత్రి చేసిన పని సరైనదే. ఎందుకంటే రాజుకు రాజ్య పాలన ముఖ్యం. తన రాజ్యంలోని ప్రజల బాగోగులు చూడడం ముఖ్యం. అవన్నీ వదిలేసి తన రాజ్యంలోని మూర్ఖులను తీసుకు రమ్మని మంత్రికి చెప్పడం అనవసర పని. ఇక్కడ రాజు తన విలువైన సమయాన్ని అనవసర పనికోసం కేటాయించి తప్పు చేశాడు. అవసరం లేని పని చెప్పిన రాజును మూర్ఖుడిగా చూపించి మంత్రి ఆ తప్పును ఎత్తిచూపి మంచి పనిచేశాడు.
4Q) మూర్ఖులు కథను సొంత మాటల్లో రాయండి.
A: ఒక రాజుకు తన రాజ్యంలోని మూర్ఖుల వివరాల గురించి తెల్సుకోవాలనిపించి ఆ పనిని మంత్రికి అప్పజెప్పాడు. చాలా రోజుల తర్వాత మంత్రి రాజు దగ్గరికి వచ్చి అయిదుగురు (5) మూర్ఖులు దొరికారని ఒక్కొక్కరి గురించి వివరించే ప్రయత్నం చేశాడు.
Advertisement
తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్న వ్యక్తిని 1వ మూర్ఖుడిగా, గుర్రంపై వెళుతూ గడ్డిమోపును మోస్తున్న వ్యక్తిని 2వ మూర్ఖుడిగా ,చీకట్లో పోయిన ఉంగరాన్ని వెలుతురున్న వేరే ప్రదేశంలో వెతుకుతున్న వ్యక్తిని 3వ మూర్ఖుడిగా పరిచయం చేసి ఏమాత్రం ప్రయోజనంలేని ఈ పనిని చెప్పిన రాజును 4వ మూర్ఖుడిగా, రాజు చెప్పిన ఆ పని కోసం 6 నెలల కాలాన్ని వృథా చేసిన తనను 5వ మూర్ఖుడిగా చెప్పి….. రాజు చేసిన తప్పును రాజే తెలుసుకునేలా చేశాడు.
II)
1) గడ్డిమోపును ఎవరు మోస్తున్నారు?- ( గడ్డిమోపును రెండవ వాడు మోస్తున్నాడు )
2) గుర్రం ఎట్లా ఉంది? – ( గుర్రం బక్కచిక్కి ఉంది )
3) గుర్రం ఎవరెవరిని మోస్తుంది?- ( గుర్రం రెండవ వాడిని, గడ్డిమోపును మోస్తుంది)
4) పేరాలో రాజు పలికిన మాటలు రాయండి- ( నువ్వు?)
5) మంత్రి రెండో మూర్ఖుడితో పలికిన మాటలు రాయండి- మంత్రి రెండో మూర్ఖుడితో ….. (“గడ్డిమోపును గుర్రంపై పెట్టవచ్చు కదా” అన్నాడు.)
III ) అర్థాలు:
- సంతోషం = ఆనందం
- గద్దించడం = మందలించడం, బెదిరించడం
- వృథా = దుబారా , వ్యర్థం
- నిర్భయం = భయం లేకపోవడం
Advertisements
IV) సొంత వాక్యాలు :
- సమయం : సమయం చాలా విలువైనది
- మూర్ఖులు : మూర్ఖులు మొండిగా వాదిస్తుంటారు.
- బక్కచిక్కిన : గడ్డిలేక మా ఆవు బక్కచిక్కింది.
- సలహాలు : ఏదైనా పని ప్రారంభించినప్పుడు పెద్దల సలహాలు తీసుకోవాలి.