Advertisement
పాఠ్య పరిచయం: 1977 నవంబరు 19న కృష్ణాడెల్టా ప్రాంతమైన దివిసీమలో భయంకర తుఫాను సంభవించింది. దీనినే దివిసీమ ఉప్పెన అంటారు. ఈ తుఫాను కారణంగా 50,000 వేలకు పైగా ప్రాణనష్టం జరిగిందని అంచనా. కరవు జిల్లాగా పిలువబడే మహబూబ్‌నగర్ ( పాలమూర్ ) నుండి 1977 సం||లో తీవ్రమైన కరువుకు పాలమూర్ ప్రజలు దేశం నలుమూలలా వెళ్లిపోయారు. జాలర్లు కోస్తాకు వలస వెళ్లారు. కానీ నవంబర్ 19, 1977న ఉవ్వెత్తున ఎగిసిపడిన ఉప్పెనలో జాలర్లు జాడ తెలియకుండా గల్లంతయినారు. ఈ హృదయవిదారక సంఘటనతో స్పందించిన ముకురాల వారిపై కన్నీటి గేయాన్ని వ్రాశారు.

దివిసీమ ఉప్పెన బాధితులను ఆదుకోవడానికి విరాళాలు సేకరిస్తున్న NTR,ANR

దివిసీమ ఉప్పెన తర్వాత ఆకలికేకలు
కవి పరిచయం : డా. ముకురాల రామారెడ్డి నాగర్ కర్నూల్ జిల్లాలోని ముకురాల అనే గ్రామంలో జన్మించారు. మేఘదూత ( అనువాద కవిత్వం), దేవరకొండ దుర్గం, నవ్వేకత్తులు, హృదయశైలి, తెలుగు సాహిత్య నిఘంటువు మొదలగు రచనలు చేశారు. ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావపరిణామం అనే అంశంపై Ph.D చేసి డాక్టరేట్ ను పొందారు. ఆకాశవాణి ఢిల్లీవారు ముకురాల గారిని 1976లో జాతీయకవిగా గుర్తింపునిచ్చారు.
Advertisement
పాఠ్యాంశం:
Advertisements
వలసకూలీ పాఠం- గేయ రూపంలో
Advertisements