Advertisement
మార్పుకు భయపడుతున్నారా? మారాలంటే భయపడుతున్నారా? మార్పు చెందడం వల్ల మీ కంఫర్ట్ లు మీకు దూరమౌతాయనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా మీరు గద్ద లైఫ్ స్టోరీ గురించి తెల్సుకోవాల్సిందే.
గద్దల జీవిత కాలం 70 సంవత్సరాలు….కానీ 40 ఏళ్ల తర్వాత దానికో సంకటపరిస్థితి వస్తుంది. 150 రోజుల సంధి కాలంలో అది తనను తాను మార్చుకుంటేనే మిగితా 30 ఏళ్లు బతకగలదు. కాదు కూడదు నొప్పిని భరించలేను అనుకుంటే దాని జీవిత కాలం 40 ఏళ్లకే పరిమితమౌతుంది.
గద్దకు 40 ఏళ్లు వచ్చేసరికి , దాని కాళ్లపై పొలుసులు ఎక్కువగా రావడంతో నడవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అదే సమయంలో దాని ముక్కు పెరిగి ముందు వైపుకు వంగి పోతుంది. దీని వల్ల దానికి తినడం కూడా ఇబ్బందిగా మారుతుంది. ఇక 40 ఏళ్లు వచ్చేసరికి దాని రెక్కలు కూడా పెద్దగా గుబురుగా అయిపోతాయి. దీని వల్ల అది ఎగరడానికి కూడా కష్టపడుతుంది.
ఈ సంమయంలో గద్దకు రెండే ఆప్షన్లు ….1) అలాగే ఉండి ఆకలితో చచ్చిపోవడం 2) ఈ పరిస్థితుల నుండి బయటపడడానికి సాహసం చేయడం, నొప్పిని భరించడం.
Advertisement
గద్ద రెండో మార్గాన్ని ఎంచుకుంటుంది. దాని కోసం ముందుగా ఒక కొండప్రాంతానికి చేరుకుంటుంది. అక్కడి ఒక బండరాయిని తన ముక్కుతో అదేపనిగా పొడుస్తుంది. ఎంత నొప్పి వస్తున్నా అలాగే పొడుస్తుంది. ఈక్రమంలో గద్ద ముక్కు విరిగిపోతుంది. కొన్ని రోజుల వెయిట్ చేశాక విరిగిన ముక్కు ప్లేస్ లో కొత్త ముక్కు వస్తుంది. అలా వచ్చిన ముక్కుతో గద్ద మొదట తన కాళ్లకు వచ్చిన చర్మాన్ని పొడిచి పొడిచి తొలగించుకుంటుంది . దీంతో దానికి నడవడం కూడా ఈజీ అయిపోతుంది. ఆ తర్వాత తన పదనైన ముక్కు తో తన రెక్కలను కూడా తెంచి పడేస్తుంది. కొన్ని రోజులకు కొత్త రెక్కలు వస్తాయి. ఈ టోటల్ పెయిన్ ఫుల్ ప్రాసెస్ కు 150 రోజులు పడుతుంది. ఆ తర్వాత గద్ద మునుపటి వలె హాయిగా 30 ఏళ్లు జీవిస్తుంది. పెయిన్ వద్దు అనుకుంటే ఆ 30 సంవత్సరాల గెయిన్ ఉండదు.
Advertisements
Advertisements
మరో విషయం…. వర్షం వచ్చినప్పుడు పక్షులన్నీ ఏదో ఒక ఆసరా కోసం వెతుక్కుంటాయి. గద్ద మాత్రమే మేఘాలను దాటి వర్షాన్ని తప్పించుకుంటుంది. అందుకే కఠినమైన మార్పుకు సిద్దంకండి! లైఫ్ ను మార్చుకోండి