Advertisement
బిగ్ బాస్ 5 విజేతగా విజే సన్నీ గెలిచాడు!? గట్టిపోటీ ఇచ్చిన షన్ను సెకెండ్ ప్లేస్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జనాలకు అంతగా పరిచయం లేని సన్నీ బిగ్ బాస్ విజేతగా నిలవడానికి 5 స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయ్ అవేంటో ఇప్పుడు చూద్దాం.
1) ప్రియా టార్గెట్ చేయడం :
వాస్తవానికి సన్నీ హైలెట్ అయ్యింది ప్రియాతో గొడవ పడ్డాకే! టాస్క్ లో భాగంగా వీరిద్దరి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి వెళ్లింది. ప్రియ చెంప పగులగొడతానని వార్నింగ్ ఇవ్వడం అంత కోపాన్ని కూడా సన్నీ దిగమింగుకొని కామ్ గా ఉండడం జనాలకు బాగా నచ్చింది.
2) ఎంటర్టైన్మెంట్ :
సన్నీ హౌజ్ లోకి ఎంటర్ అయినప్పటి నుండి ఏదోరకంగా ఎంటర్టైన్ చేస్తూ కనిపించాడు. బిగ్ బాస్ ను ఏంది సార్ ఇదీ అంటూ , అప్నా టైమ్ ఆయేగా అంటూ తనదైన కామెడీ టైమింగ్ తో ఫన్ క్రియేట్ చేస్తూ బిగ్ బాస్ పట్ల ఒక ఇంట్రస్ట్ ను క్రియేట్ చేశాడు.
Advertisements
Advertisement
3) సన్నీవాళ్ల అమ్మ కళావతి ఇంట్లోకి రావడం :
కంటెస్టెంట్స్ అందర్లో కంటే సన్నీ వాళ్ల అమ్మ హౌస్ లోకి రావడం సన్నీకి మంచి ఫ్లస్ అయ్యింది. అమ్మకోసం గెలవాని అని సన్నీ అనుకుంటే ఓటర్లు సైతం ఈ సెంటిమెంట్ కు కనెక్ట్ అయ్యారు.
4) టాస్క్ లు :
బిగ్ బాస్ 5 అన్నీ టాస్క్ లలో దిబెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది 100శాతం సన్నీయే…గెలిచినా ఓడినా టాస్క్ ల విషయానికి వస్తే చాలా గట్టిగా ఆడాడు. ఈ సమయంలో జరిగిన గొడవలన్నీ కూడా చాలా బాగా హ్యాండిల్ చేశాడు
5) బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ సపోర్ట్ :
బిగ్ బాస్ సీజన్ 5 నుండి ఎలిమినేట్ అయిన చాలా మంది కంటెస్టెంట్స్ సన్నీకి సపోర్ట్ గా నిలవడం. ఈ విషయంలో కాజల్ ఒక ఆర్మీనే సృష్టించి సన్నీ గెలుపులో కీలక పాత్ర పోషించింది. సెట్ శ్వేత, నటరాజ్ మాస్టర్ , ఉమాదేవి వీళ్లంతా సన్నీకే సపోర్ట్ చేయడం అతనికి కలిసొచ్చింది.
Advertisements
మానస్ తో ఫ్రెండ్షిప్ , పక్కింటి అబ్బాయిలా ఉండడం సన్నీకి ప్లస్ అయ్యాయి.