Advertisement
మాతా హరి అసలు పేరు మార్గరెటా జెల్లె. ఆమెకు మాతా హరి అనే పేరు వచ్చింది. ఆమె ఒక స్టేజ్ డ్యాన్స్. స్ట్రిప్పర్. గూఢ చారి కూడా. ఆమె స్టేజిలపై ప్రదర్శనలు ఇచ్చేది. మాతా హరి అనేది ఆమె స్టేజి పేరు. అయితే ఆమె నెదర్లాండ్స్‌కు చెందిన యువతి. కానీ మొదటి ప్రపంచ యుద్ధం ముందు ఆమె జర్మనీ వారి కోసం గూఢచారిగా పనిచేసేది.
మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ఆమె అప్పట్లో అత్యంత ధనికులు, శక్తివంతులు అయిన మగవారితో గడిపేది. 1918లో ఫ్రెంచ్ వారు ఆమెపై గూఢచర్యం ఆరోపణలు చేశారు. ఆమె మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ కోసం పనిచేస్తుందని చెప్పారు. ఈ క్రమంలోనే ఆమె నేరం చేసినట్లు నిరూపించారు కూడా. దీంతో ఆమెకు మరణశిక్షను విధించి అమలు చేశారు.
Advertisement
మాతా హరి నిజానికి ఒక కిండర్ గార్టెన్ టీచర్. 1895లో ఆమెకు 19 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఆమె కెప్టెన్ రుడాల్ఫ్ మెక్‌లియాడ్‌ను వివాహం చేసుకుంది. 1905లో ప్యారిస్‌లో రాత్రికి రాత్రే ఎగ్జాటిక్ డ్యాన్సర్‌గా మారింది. ఆమె తన డ్యాన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసేది. అయితే 1906లో భర్తకు విడాకులు ఇచ్చింది.
Advertisements
Advertisements
1914 నుంచి 1918 మధ్య కాలంలో ఆమె అనేక యూరప్ దేశాల్లో పర్యటించింది. ఆమె చర్యలు అనుమానాస్పదంగా అనిపించాయి. ఒక దశలో ఆమె ఫ్రెంచ్ గూఢచారి కావచ్చునని అనుమానించారు. తరువాత 1917లో ఆమె జర్మనీ గూఢచారి అని తేలింది. ఆమెకు జర్మనీ సైన్యంలో హెచ్-21 అనే కోడ్ నేమ్ కూడా ఇచ్చారు. తరువాత ఆమెను అరెస్టు చేసి సెయింట్ లజారె జైలులో ఉంచారు. అనంతరం ఆమె చేసిన నేరాలు నిర్దారణ కావడంతో ఆమెకు మరణశిక్ష విధించి అమలు పరిచారు. ఆమె మరణానంతరం ఆమె మృతదేహాన్ని మెడికల్ రీసెర్చికి వాడారు.