Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

ఫోన్ ల రాజ్యాన్ని ఏలిన నోకియా (NOKIA) …ఎందుకు ప‌డిపోయింది.? మంచి విశ్లేష‌ణ‌.!

Advertisement

1998 లో ప్రపంచం మొత్తం లో బెస్ట్ సెల్లింగ్ మొబైల్ నోకియా. 1995 నుంచి 1999 వరకు 400 రెట్లు నోకియా లాభాలు పెరగటం ప్రపంచ వ్యాపార రంగం లో సువర్ణాక్షరాలతో రాయదగిన కథ. 2003 వరకు ప్రపంచం మొత్తం లో అత్యధికం గా అమ్ముడుపోయిన మొబైల్ “నోకియా 1100″‌. 2007 ప్రారంభం లో ప్రపంచ మొబైల్ మార్కెట్ లో నోకియాది 50% షేర్. 2007 లో ఐ-ఫోన్ రావటం తో ప్రపంచ మార్కెట్ లో నోకియా 50% నుంచి 5% వరకు పడిపోయింది. 2011 లో మార్కెట్ విలువ కూడా 90% పడిపోయింది.

నిజానికి స్మార్ట్ ఫోన్ మొదట తెచ్చింది నోకియా నే. సింబియాన్ ఆపరేటింగ్ సిస్టం తో టచ్ స్క్రీన్ తెచ్చింది నోకియా నే. కానీ సింబియాన్ ఆపరేటింగ్ సిస్టం టచ్ స్క్రీన్ కాని వాటిల్లో మాత్రమే బాగా పనిచేస్తుంది, 2008 లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం వైపు వెళ్ళాలని చెప్పినా నా కంటే ఎక్కువ తెలుసా..? అని పై స్థాయి మేనేజ్ మెంట్ & CEO పట్టించుకోలేదు. 2010 లో ఒల్లి పెక్కా ని CEO గా తీసి స్టెఫన్ ఎలాఫ్ ని CEO గా చేసారు. అతను 2011 లో నోకియా లో ఆపరేటింగ్ సిస్టం గా మైక్రోసాఫ్ట్ విండోస్ ని నోకియా ల్యుమియా ఫోన్స్ లో వాడారు. ఆ తర్వాత మొత్తం క్షీణ దశకి చేరుకున్నప్పుడు మైక్రోసాఫ్ట్ 2013 లో నోకియా ని అక్వైర్ చేసింది, ఇది ఇంకో పెద్ద మిస్టేక్.

Advertisement

ప్రపంచం లోని బిజినెస్ స్కూల్స్ నోకియా పతనాన్ని స్టడీ చేసినట్లు గా నాకు తెలిసి దేన్నీ స్టడీ చేయలేదు. పతనానికి కారణాలు గా వాళ్ళు ఫైనలైజ్ చేసింది ఏంటి అంటే “మితిమీరిన అహంకారం”; “అన్నీ నాకే తెలుసు” అన్న మనస్తత్వం. క్రింది స్థాయి వాళ్ళకి తెలుసు క్షీణిస్తుంది అని, కానీ హైయర్ మేనేజ్ మెంట్ కి & CEO కి చెప్పాలంటే భయం. చుట్టు పక్కల వ్యక్తులు ఎవరూ CEO కి వాస్తవ పరిస్థితి వివరించలేదు, అతనూ మూర్ఖత్వం తో వాస్తవాలని తెలుసుకోలేదు. చివరికి సర్వ నాశనమై ప్రపంచ మొబైల్ మార్కెట్ లో 1-3% ఉంది ఇప్పుడు.

Advertisements

Advertisements

ఈ విషయాన్ని గ్రహించే 2013-2014 లో మైక్రోసాఫ్ట్ CEO గా తాను వైదొలగి సత్య నాదెళ్ళ ని CEO గా చేశాడు బిల్ గేట్స్. మన దేశం లో టాటా, బిర్లా లని తీసుకున్నా బిర్లాలు పడిపోయారు కానీ టాటా ఎప్పుడూ ఒకో మెట్టు పైకి ఎదుగుతూ వస్తున్నారు. కారణం తమ కాంపౌండ్ లోని వ్యక్తి ని కాకుండా బయటి వ్యక్తి ని CEO గా కూడా చేసింది టాటా. ఏది ఏమైనా కాలం తో పాటు అప్ డేట్ అయిన వ్యక్తులు, సంస్థలు మనగలుగుతున్నాయి. మితిమీరిన అహంకారం ఉన్న వ్యక్తులు, సంస్థలు సర్వనాశనమవుతున్నై/అవుతాయి.

థామ‌స్ అల్వా ఎడిష‌న్ కుట్ర‌లకు త‌న ప్ర‌యోగాలతోనే స‌మాధానాలు…చెప్పిన శాస్త్ర‌జ్ఞుడు.! ఈ రోజు అభివృద్దికి కార‌ణం అత‌డే.!

ప్రపంచం అంతా ఒక మనిషి జయంతి ని గుర్తు పెట్టుకోవాలంటే అది ఖచ్చితం గా “నికోలస్ టెస్లా” దే అవుతుంది అని నా నమ్మకం. ఈ రోజు (జూలై 10) నికోలస్ టెస్లా 164 వ జయంతి. ఐన్ స్టీన్ ని ఒకసారి మీరు ఈ ప్రపంచం లో అత్యంత మేధావి కదా, ఎలా ఫీల్ అవుతున్నారు అని అడిగితే ఈ ప్రశ్న మీరు నికోలస్ టెస్లా ని అడగండి, నన్ను కాదు అంటాడు.

నికోలస్ టెస్లా యూరప్ లోని క్రొయేషియా దేశం లో చిన్న పల్లెటూరు లో పుట్టాడు. తండ్రి సెర్బియన్ చర్చ్ ఫాదర్, తల్లి గృహిణి, ముగ్గురు అక్కా చెల్లెళ్ళు, ఒక అన్నయ్య. బయటి వాళ్ళ తో కలిసేవాడు కాదు, ఎప్పుడూ తమ సిబ్లింగ్స్ తోనే గడిపేవాడు. తల్లి పెద్దగా చదువుకోపోయినా తమ అవసరాలకి కావాల్సిన చిన్న చిన్న పనిముట్లని తనే తయారు చేస్తుండేది. టెస్లా మీద తల్లి ప్రభావం చాలా ఎక్కువ. ఇంకా టెస్లా చదువులో బాగా చురుకు. సామాన్య ప్రభుత్వ పాఠశాలలోనే చదివాడు, ఆ తర్వాత పాలిటెక్నిక్ చేశాడు. టెస్లా ని కూడా చర్చ్ ఫాథర్ చేయలనేది తండ్రి కోరిక. కానీ చిన్న ఎలక్ట్రిక్ కంపనీ లో ఉద్యోగానికి జాయిన్ అవుతాడు.

tesla

డైరక్ట్ కరెంట్(DC) వలన చాలా ఎలక్ట్రాన్స్ వేస్ట్ అవుతున్నై మరియూ ప్రమాదం దీనికి ఆల్టర్నేటివ్ కరెంట్(AC) కనిపెట్టాలని అంటుండేవాడు. ఆ తర్వాత ఒక మ్యానేజర్ అమెరికా లో థామస్ ఆల్వా ఎడిషన్ నాకు తెలుసు అని ఒక ఉత్తరం రాచి ఇచ్చి వెళ్ళి అతన్ని కలువు అంటాడు. టెస్లా అమెరికా వెళ్ళి ఎడిషన్ కంపనీ లో జాయిన్ అయ్యి ఎడిషన్ తో కూడా ఆల్టర్ నేటివ్ కరెంట్ గురించి, వైర్ లెస్ కమ్యూనికేషన్స్ గురించి చర్చించేవాడు. ఇతన్ని ప్రోత్సహిస్తే అతని ఉనికి, వ్యాపారానికే ప్రమాదం అని గ్రహించిన ఎడిషన్ ముందు డైరక్ట్ కరెంట్ జనరేటర్స్, DC లోని లోపాలు నీవు సరిచేయగలిగితే 50,000 డాలర్లు ఇస్తా అంటాడు. ఎడిషన్ కి, ఇంకెవరికీ చేతకాని డైరక్ట్ కరెంట్ లోని లోపాలు అన్నీ సరి చేస్తాడు టెస్లా. కానీ థామస్ ఆల్వా ఎడిషన్ నేను జోక్ చేశా డబ్బులు ఇస్తాను అనేసరికి టెస్లా ఆ కంపనీ ని విడిచి పెట్టి సొంతం గా చిన్న ల్యాబ్ పెట్టుకొని ప్రయోగాలు చేస్తుండేవాడు. ఒకరోజు అది అగ్ని ప్రమాదానికి గురి అయ్యిందో థామస్ ఆల్వా ఎడిషన్ తగలపెట్టించాడో తెలియదు, పూర్తిగా బూడిద అయ్యింది ( DC కరెంట్ మీద వ్యాపారం అంతా ఎడిషన్ దే; టెస్లా AC కరెంట్ దానికి పోటీ అవుతుంది అని)

tesla

టెస్లా చేసేది ఏమీ లేక ఎలక్ట్రిక్ కేబుల్స్ కి కాలువలు త్రవ్వే పనిలో జాయిన్ అయ్యి రోజులు గడిపేవాడు. ఇతని AC జనరేటర్స్ ప్రయోగాల గురించి తెలిసిన ఒక పెద్ద మనిషి టెస్లాని ప్రొత్సహిస్తాడు. AC జనరేటర్స్ పవర్ సిస్టంస్ ని అభివృద్ది చేశాడు. ఆ తర్వాత 5 సంవత్సరాలలో AC మోటర్స్, ట్రాన్స్ ఫార్మర్స్, జనరేటర్స్ మొదలగునవి 30 వాటి మీద పెటెంట్స్ తీసుకున్నారు. ఏ విధం గా చూసినా DC కంటే AC కరెంట్ అన్ని విధాలుగా ప్రయోజన కరం గా ఉండడం తో అందరూ AC కరెంట్ ని వాడటం స్టార్ట్ చేశారు.

థామస్ ఆల్వా ఎడిషన్ జనరేటర్స్ వ్యాపారం దెబ్బ తిని AC కరెంట్ ప్రమాదం అని, AC కరెంట్ తో చేసిన తీగలతో కుక్కలని చంపి అది ఎంత ప్రమాదమో జనాలకి చూపించేవాడు. ఇంకా జైలు ఖైదీలకి AC కరెంట్ తో చేసిన తీగలు పెట్టి క్రూరం గా చంపి AC కరెంట్ ప్రమాదమని ప్రపంచానికి నమ్మ చూపాడు ఎడిషన్.

 

టెస్లా దీనికి విరుగుడు గా టెస్లా కాయిల్స్ తయారు చేసి లక్షల వోట్ల AC కరెంట్ ప్రయోగం తన మీదే ప్రవహింప చేసుకొని ప్రపంచానికి చూపించి అత్యంత సురక్షితం అని నిరూపించాడు. ఆ తర్వాత నయాగరా వాటర్ ఫాల్స్ కి టర్బైన్ ని అమర్చి జనరేటర్స్ ద్వారా కరెంట్ ఉత్పత్తి చేసి దాన్ని న్యూయార్క్ నగరానికి పంపి ప్రపంచం అంతా అబ్బుర పడేలా చేశాడు.

తనకి వచ్చిన డబ్బు అంతా ప్రయోగాలకే ఉపయోగించేవాడు. రోజుకి 20 గంటలు ప్రయోగాలే ఆయన జీవితం. ఒక్ బోటు ని వైర్ లెస్ కమ్యూనికేషన్స్ తో నడిపించిన వ్యక్తి టెస్లా నే. ఇండక్షన్ మోటార్,టెస్లా కాయిల్స్, వాటర్ టర్బైన్స్, ఎక్స్ రేస్, వైర్ లెస్ టెక్నాలజీ, వైర్ లెస్ కమ్యూనికేషన్స్, రిమోట్ సెన్సారింగ్..ఎలా దాదాపు 250+ కి పైగా పేటెంట్స్ టెస్లా పేరు మీదనే ఉన్నాయి. రేడియో ని కనిపెట్టి మార్కోని నోబెల్ బహుమతి సాధించాడూ కానీ అంతకముందే టెస్లా వైర్ లెస్ కనిపెట్టి వైర్ లెస్స్ కమ్యూనికేషన్స్ మీద పేటెంట్ ఉంది. నిజానికి ఆ క్రెడిట్ టెస్లాది. ఇంకా ట్రాన్సఫర్మేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కి టెస్లా కి థామస్ ఆల్వా ఎడిషన్ తో కలిపి నోబెల్ బహుమతి ఇద్ధాం అనుకున్నారు, దానికి టెస్లా నిరాకరించారు.

tesla

ఈనాటి కంప్యూటర్స్, ఆర్టిఫీషియల్ ఇంటెల్లిజెన్స్, రాకెట్ సైన్స్ లోని చాలా వరకు వైర్ ఎఫెక్టివ్ వైర్ లెస్ కమ్యూనికేషన్స్ కి, ఎలక్ట్రిక్ కార్ల తయారీకి టెస్లా ఆవిష్కరణలే కారణం. ప్రస్తుత ప్రపంచ స్థితి గతులని మార్చే/ మార్చుతున్న ప్రతి టెక్నాలజీ కి ఏదో ఒక రకం గా టెస్లా ఆవిష్కరణలు/ పేటెంట్ లే కారణం.మానవ సమాజానికి ఎక్కువ ప్రయోజనకరమైనవి కనుగున్నది టెస్లా నే.

జీవితం అంతా, సంపాదించిన దనం అంతా ప్రయోగాకే కేటాయించాడు టెస్లా. పెండ్లి చేసుకోలేదు. ఇంకా చివరిదశలో స్వామి వివేకానంద బోధనలకి ప్రభావితం అయ్యాడు. టెస్లా కి ఈ ప్రపంచం లో ఎవ్వరికీ లేని అధిక ఫోటో గ్రాఫిక్ మెమోరీ/ శక్తి ఉండేది. ఏదైనా కనిపెట్టకముందే అది తన కలలోకి రూపం వచ్చేది లేదా తనే రూపం ఇచ్చేవాడు.

ప్రస్తుత టెస్లా మోటార్స్ కూడా ఎలాన్ మస్క్ ది కాదు. టెస్లా మీద గౌరవం తో ఇద్ధరు ఔత్సాహికులు టెస్లా మోటార్స్ స్థాపిస్తే ఆ తర్వాత కొన్ని యేండ్లకి ఎక్కువ షేర్స్ తీసుకొని వాళ్ళని బయటికి పంపించి ఎలాన్ మస్క్ తన అధీనం లోకి తీసుకున్నాడు.

ఏది ఏమైనా జీవితం అంతా ప్రయోగాలకే కేటాయించి 250+ పేటెంట్స్ పొంది, ఎన్నో ఆవిష్కరణలు చేసి, మరెన్నో ఆవిష్కరణలకి కారణభూతుడు, ప్రస్తుత ప్రపంచ దిశ, దశ లని మార్చే ప్రతి టెక్నాలజీ వెనక ఉంది టెస్లా ఆవిష్కరణే లే. ప్రపంచ చరిత్ర లో 21 వ శతాబ్ధం వరకు నాకు తెలిసి అత్యున్నతమైన వ్యక్తి, శాస్త్రజ్ఞుడు, మేధావి నికోలస్ టెస్లా నే.

“దేనిలోనైనా విజయం సాధించాలంటే మనిషి లోతుగా ఆలోచించే బదులు క్లియర్ గా ఆలోచించాలి” అనేవాడు నికోలస్ టెస్లా.

Article By : JAGAN RAO