Advertisement
బెంటా వ్యాధి” ఈ పేరు ఎప్పుడైనా విన్నారా…? మనకు తెలియని అసలు ఏ మాత్రం పరిచయం లేని వ్యాధి అది. అలాంటి వ్యాధులు ప్రపంచంలో చాలానే ఉన్నా సరే ఈ వ్యాధి మాత్రం కచ్చితంగా ప్రత్యేకమే. ఈ వ్యాధితో బాధపడేది కేవలం 14 మంది పిల్లలు మాత్రమే. అందులో బెంగళూరుకు చెందిన ఏడు నెలల పాప కూడా ఉండటం ఇప్పుడు ఇండియాలో షాకింగ్ న్యూస్. నిజానికి ఈ వ్యాధి చాలా అరుదైనది. ప్రాధమిక రోగనిరోధక శక్తి లోపంతో మాత్రమే ఈ వ్యాధి వస్తుంది.
ఆ చిన్నారి పేరు విజయద్ర. వయసు, తీవ్రత పరంగా ప్రాథమిక దశలోనే ఈ వ్యాధిని గుర్తించారు వైద్యులు. బ్లడ్ స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ ద్వారానే పసిబిడ్డ విజయద్ర ప్రాణాలను కాపాడగలమని DKMS BMST ఫౌండేషన్ ఇండియా తన ప్రకటనలో తెలిపింది. బెంగళూరుకు చెందిన బ్లడ్ స్టెమ్ సెల్ రిజిస్ట్రీ బిడ్డకు సరిపోయే దాత కోసం వెతుకుతుంది.ఇండియాలో కేవలం 0.04 శాతం మంది మాత్రమే ఆమెకు అవసరమైన బ్లడ్ దానం చేసేందుకు నమోదు చేయించారు.
Advertisement
ముఖ్యంగా రక్తపు మూలకణ దానం గురించి ప్రజలకు అవగాహన చాలా తక్కువ. బెంటా అనే తీవ్రమైన మరియు అరుదైన వ్యాధి NF-κB మరియు T-సెల్ ఎనర్జీతో B-కణ విస్తరణను సూచిస్తుందని వైద్యులు పేర్కొన్నారు. B-సెల్ అనేది ఎముక మజ్జ నుండి వచ్చే ఒక రకమైన రోగనిరోధక కణం. ఈ వ్యాధి సమయంలో సంఖ్య సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. NF-κB అనేది జన్యు వ్యక్తీకరణలో పాల్గొన్న ప్రోటీన్ కాంప్లెక్స్ లేదా నిర్దిష్ట జన్యువులు ఆన్ లేదా ఆఫ్ చేయబడే స్థాయిగా వైద్యులు వివరించారు.
Advertisements
Advertisements
T-సెల్ అనేది థైమస్‌లో పరిపక్వం చెందే ఒక రకమైన రోగనిరోధక కణమట. రొమ్ము ఎముక కింద ఛాతీ ఎగువ భాగంలో ఉన్న ఒక చిన్న అవయవం. బెంటా అనే వ్యాధి బాల్యంలో ప్రారంభమయ్యే కొన్ని రోగనిరోధక కణాల అధిక స్థాయిల ఆధారంగా గుర్తిస్తారు. ఇందులో విస్తరించిన ప్లీహము, విస్తారిత శోషరస కణుపులు, ఇమ్యునో డిఫిషియెన్సీ మరియు లింఫోమా తో ఒక రకమైన క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా. ప్రధాన లక్షణాలు చూస్తే… ప్లీహము పెరుగుదల (స్ప్లెనోమెగాలియా) అలాగే చిన్న వయసులో తరచుగా చెవి, సైనస్ మరియు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు రావడం వంటివి జరుగుతాయి. దీనితో ఇప్పుడు ఆ చిన్నారికి చికిత్స చేయడం సవాల్ గా మారింది.