Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

ఇలాంటి సైనికుడి గురించి మీరు విని ఉండరు….. Proud To Be An INDIAN .

Advertisement

1962 … నవంబర్ 14 చైనా ఇండియా యుద్ధం…. అరుణాచల్ ప్రదేశ్ లోని సురనంగ్ ప్రాంతం నుండి చైనా సేన ఇండియా భూభాగంలోకి చొచ్చుకువస్తుంది. అక్కడ రెడీ గా ఉన్న ఇండియన్ ఆర్మీ వారిపై ఎదురుదాడికి దిగింది…కానీ సంఖ్య పరంగా ఎక్కువగా ఉన్న చైనా సేన దాడి ముందు నిలవలేకపోయింది..దానికి తోడు వారి దగ్గర ఆధునిక ఆయుధాలున్నాయ్.

విషయం పై అధికారులకు తెలియడంతో ….ఆ ప్రాంతాన్ని వొదిలి వెనుకకు వోచి ఇంకో ప్రాంతంలో ఉన్న ఆర్మీ తో జాయిన్ అవ్వండి ..ఆ ప్రాంతాన్ని వాళ్ళకొదిలేయండి అని చెప్పారు. భారత భూమిని చైనా వాళ్లకు వదలడం ఇష్టం లేని …ఓ సైనికుడు యుద్దానికి దిగాడు …ఒక్కడే ౩ రోజులు చైనా ఆర్మీ తో పోరాడి సుమారు ౩౦౦ మంది ప్రత్యర్థులను చంపాడు.

Advertisement

ఇండియన్ పోస్ట్ ప్రాంతంలో అక్కడక్కడా తుపాకులు అమర్చి…. 10 నిమిషాలకొకసారి ఒక్కో ప్రాంతంలోని ఒక్కో తుపాకీతో పేల్చేవాడు…దీంతో చైనా ఆర్మీ చాలా మంది సైనికులున్నారని అయోమయానికి గురయ్యారు…ఆలా ఒక్కడే ౩ రోజులు బోర్డర్ లో యుద్ధం చేసాడు. చివరకు చుట్టుముట్టిన ప్రత్యరులు ….నవంబర్ 17 న గొంతుకోసి ఆ సైనికుడిని చంపేశారు.

 

Advertisements

ఆ వీర సైనికుడి పేరు….జస్వంత్ సింగ్ రావత్.

విశేషాలు:

  • జశ్వంత్ తెగువ కారణంగా అరుణాచల్ ప్రదేశ్ లోని సురనంగ్ ప్రాంతం ఇండియా ఆధీనంలోనే ఉంది.
  • జశ్వంత్ వీరోచితంగా పోరాడిన ఆ ప్రాంత పేరును జస్వంత్ ఘాట్ గా మార్చారు.
  • జస్వంత్ 1962 లోనే చనిపోయిన …ఆర్మీ లో ఆయన ఉద్యోగాన్ని అలాగే ఉంచి ….సాధారణంగా డ్యూటీ చేస్తే లభించే అన్ని ప్రొమోషన్స్ ఇచ్చారు

Advertisements

ఈ వీరుడి మీద ఓ సినిమా కూడా తీశారు…..WATCH THE MOVIE : 72 Hours 

 

రికార్డు సృష్టించిన కోడి…తల లేకుండా 18 నెలలు బతికేసింది!?

18 నెల‌లు తల లేకుండా బ్ర‌తికి ఓ కోడి …తన పేరున సరికొత్త రికార్డు ను రాసుకుంది. “Mike The Headless Chicken” పేరిట ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపుపొందిన ఆ కోడి కథేందో..ఇప్పుడు తెలుసుకుందాం.

మ్యాటర్ 1945 ది. అమెరికాలోని లాయ్డ్ ఓస్లెన్ అనే రైతు ఇంటికి అత‌ని అత్త‌య్య వ‌చ్చింది. వచ్చిన గెస్ట్ కి మర్యాద చెయ్యాలి కాబట్టి ….నాటు కోడి కూర చేసి పెడదాం అని డిసైడ్ అయ్యాడు. అనుకున్నదే తడవుగా…తన ఇంట్లో ఉన్న కోళ్ల గంపను తీసి ఒకదాన్ని పట్టుకోవాలని చూసాడు.అత‌న్ని చూసి కోళ్ల‌న్నీ చెల్లాచెదురుగా పరిగెత్తాయి వాటిని పట్టుకోడానికి చాల ప్రయత్నించాడు..కానీ అవేవి ఒస్లెన్ కు దొరకలేదు..దీంతో కోపానికొచ్చిన ఒస్లెన్ క‌త్తి తీసుకొని కోళ్ళ మీద‌కు విసిరాడు…అలా విసిరిన క‌త్తి ఓ కోడి త‌ల‌కు త‌గిలింది.దాంతో దాని తల తెగి ప‌డింది. తెగిన మొండెంతోనే ఆ కోడి అక్కడి నుండి పారిపోయింది.!

గంట త‌ర్వాత కూడా అదే కోడి…కొక్కొరొకో అంటూ తెగిన మొండెంతో ఓస్లెన్ కు కనిపించింది! మొదట ఒస్లెన్ షాక్ అయ్యాడు ….తర్వాతర్వాత దాని మీద ప్రేమ పెంచుకొని …ఆ కోడికి మైక్ అని పేరుపెట్టి అల్లారుముద్దుగా చూడ‌డం స్టార్ట్ చేశాడు.మొండెం ద‌గ్గ‌ర ఉన్న రంద్రం నుండే దానికి కావాల్సిన నీటిని, దాణాను అందించ‌డం స్టార్ట్ చేశాడు. అలా ఆ కోడి ఒక్కసారిగా అమెరికా అంత‌టా ఫేమస్ అయిపొయింది ! చివరకు మైక్ మార్చ్ 17, 1947 న‌…….గొంతులో క‌ణితి కార‌ణంగా తిన‌డానికి క‌ష్ట‌త‌ర‌మై చనిపోయింది. 18 నెల‌ల పాటు త‌ల లేని కోడిగా జీవించి త‌న‌కంటూ ఓ చ‌రిత్ర‌ను సృష్టించుకుంది మైక్.

ఇండియా- పాకిస్తాన్ వేరు అవ్వడానికి అయన ‘పెన్ గీతలే’ కారణం.!

ఎన్నో పోరాటాల తర్వాత భారతదేశానికి స్వతంత్రం వొచ్చింది..కానీ అన్నదమ్ములుగా కలిసున్న దేశం రెండుగా విడిపోయింది. ఒకటి ఇండియా రెండు పాకిస్తాన్. ఇప్పుడే అసలు సమస్య వచ్చి పడింది కలిసున్న దేశాలను భౌగోళికంగా రెండుగా విడగొట్టాలి…? దీనికి ఎవరు కరెక్ట్ అని ఆలోచించిన …. మౌంట్ బాటెన్ బ్రిటన్ నుండి రాడ్ క్లిఫ్ ను పిలిపించాడు.

బ్రిటిష్‌ పార్లమెంటు 1947 జూలై 15న భారత్‌లో బ్రిటిష్‌ రాజ్యం 1947 ఆగస్టు 15న ముగుస్తుందని ప్రకటించింది. ఈ ప్రకటనకు ముందే జూలై 8 న రాడ్ క్లిఫ్ ఇండియా కు వొచ్చాడు…కేవలం 40 రోజుల్లోనే ఇండియా,పాకిస్థాన్ ల‌కు మ‌ద్య స‌రిహ‌ద్దు రేఖ‌ను గీశాడు.

దీంట్లో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటో తెలుసా…? దేశ విభజన చేయడానికి ముందు రాడ్‌క్లిఫ్‌ భారత్‌ను ఒక్కసారి కూడా సందర్శించలేదు. కొద్దిమంది ఇచ్చిన సమాచారం తో …తన టేబుల్ మీద కూర్చొని మ్యాప్ ను చూస్తూ …రెండు దేశాలను విభజిస్తూ ఓ రేఖను గీశాడు …అదే ఇండియా పాక్ ల మధ్య ప్రామాణిక సరిహద్దు రేఖగా మారిపోయింది… రాడ్‌క్లిఫ్‌ గీశాడు కాబట్టి ఆ రేఖను రాడ్‌క్లిఫ్‌ అనే పేరు పడిపోయింది .

ఈ విభజన రేఖ ఒకే ఇంట్లో కొన్ని గదుల్ని భారత్‌కు, మరికొన్ని గదుల్ని పాకిస్తాన్‌కు కూడా కేటాయిస్తూ సాగిన ఉదంతాలు కోకొల్లలుగా ఉన్నాయి! విభ‌జ‌న రేఖ‌ను గీసినందుకు రాడ్ క్లిఫ్ కు 1947 లోనే 3000 పౌండ్స్ ను తీసుకోవాల్సిందిగా ఆఫ‌ర్ చేశారు, అయిన‌ప్ప‌టికీ రాడ్ క్లిఫ్ ఆ ఆఫ‌ర్ ను తిర‌స్క‌రించారు.

బాహుబలి సినిమాలో దీన్ని చూసారు కదా.! ఇప్పుడు దీని చరిత్రను తెలుసుకుందాం!

అప్పటి వరకు ….కత్తులు కటార్లతోనే సాగుతున్న యుద్ధం వీటి రాకతో కొత్త టర్న్ తీసుకుందనే చెప్పాలి. ఈ యుద్ధ పరికరం సహాయంతోనే మగధ రాజైన అజాతశత్రు… లిచ్చావీ రాజ్యాన్ని సునాయాసంగా ఓడగొట్టాడు..అప్పటి వరకు పాశ్చాత దేశాలకే తెలిసిన ఈ కొత్త ఆయుధాన్ని మన దగ్గర ప్రవేశపెట్టాడు అజాతశత్రు.

పంగల కర్ర ( ఉండేలు) కాన్సెప్ట్ తో తయారు చేసిన ఈ పరికరంలో …మొదట తాడును,తర్వాత ఎలాస్టిక్ ను, తర్వాత స్ప్రింగ్స్ ను ఉపయోగించి …పెద్ద పెద్ద బండరాళ్లను శత్రువుల పైకి విసిరేవారు. దీంతో శత్రు మూక చెల్లాచెదురయ్యేది. తర్వాత రాళ్లకు బదులు పేలుడు పదార్థాలు వాడారు. ఫిరంగులు రాకతో వీటి ఉపయోగం తగ్గిపోయింది.

ఎంటర్టైన్మెంట్ కోసం కూడా దీని ఉపయోగించేవారు….దూరంగా వలను ఏర్పాటు చేసి ..ఇందులోనుండి మనిషిని వల లోకి విసిరేసేవారు. నీటి జలాశయాల్లోకి కూడా వీటిలో కూర్చున్న మనుషులను విసిరేసేవారు….. మొదట్లో దూరం అంచనా సరిగ్గా లేక 2 – 3 చనిపోయారు కూడా.!

ఏదిఏమైనా …చాలా రాజుల విజయాల్లో కీలకపాత్ర పోషించి ఈ పరికరం ..బాహుబలి సినిమా ద్వారా మరోసారి కనిపించింది .

ఎలుకపై చేసిన ఈ ప్రయోగం గురించి ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాలి. ఇందులో లైఫ్ ఉంది

1950 దశకంలో ….హార్వార్డ్ యూనివర్సిటీ కి చెందిన డాక్టర్ కర్ట్ రిక్టర్ ఎలుకలపై ఓ ప్రయోగాన్ని చేసాడు. మొదట ఆ ప్రయోగం చూద్దాం …తర్వాత మనుషులుగా దాని నుండి మనమేం నేర్చుకోవాలో లెక్కలేసుకుందాం.

రిక్టర్ ..ఓ జార్ లో సగానికి నీళ్లు పోసి…అందులో ఓ ఎలుకను వదిలేసాడు. కాసేపు బాగానే ఉన్న ఎలుక తర్వాతర్వాత శ్వాస తీసుకోడానికి ఇబ్బంది పడుతుంది. అయిన అలాగే వెయిట్ చేసాడు రిక్టర్ …ఫైనల్ గా 15 నిమిషాల తర్వాత ఎలుక నీటిలో పడిపోడాన్ని గమనించిన రిక్టర్ దాన్ని బయటకు తీసాడు. కాసేపు విశ్రాంతినిచ్చి….రెండో రౌండ్ మళ్ళీ నీటిలో ముంచాడు. ఈ సరి ఎలుక ఎన్ని నిముషాలు ఉండొచ్చని మీ అంచనా…?

5 నిముషాలు? 10 నిముషాలు? 15 నిముషాలు ?….కాదు, కాదు,కాదు ….ఏకంగా 60 గంటలు…. ఆశ్చర్యంగా ఉందా? డౌట్ ఏం అక్కర్లేదు..ఈ ఆర్టికల్ చివర ఆ ప్రయోగం రిజల్ట్ పేజీ లింక్ ఇస్తాను.

ఈ ప్రయోగం ద్వారా నిర్దారించిన విషయం ఏంటంటే..ఎలుకకు తెలుసు తను పడిపోయే సమయంలో ఎలాగైనా తనను బయటకు తీస్తారని…అందుకే తన ఓపికున్నంత సేపు నీటి పైనే ఉండాలని ట్రై చేసిందట.

ఇప్పుడు మనిషి విషయానికి వొద్దాం : ఆఫ్ట్రాల్ ఓ ఎలుకే …తన స్థాయికి మించి పోరాటం చేసినప్పుడు …మరి మనం? పని ప్రారంభించకముందే మనమీద మనకే డౌట్ చేయగలమా ? లేదా ? అని …. మన శక్తిపై కూడా మనకు నమ్మకముండదు.

హెన్స్…. పై ప్రయోగం ద్వారా మీలో ఏమైనా మార్పు వస్తే….ఆ రిక్టర్ గారికి థాంక్స్ చెప్పి…మీ లైఫ్ ను సక్సెఫుల్ గా కొనసాగించండి.

 

The Experiment :   http://citeseerx.ist.psu.edu/viewdoc/download?doi=10.1.1.536.1405&rep=rep1&type=pdf

నేడు పంచాయతీ రాజ్ డే … దీని ప్రత్యేకత ఏంటి? గ్రామ పంచాయితీలు చేయాల్సిన 29 పనులేవి?

నేడు అనగా …. ఏప్రిల్ 24 న పంచాయితీలకు రాజ్యాంగ ప్రతిపత్తి లభించింది. అందుకే ఈ రోజును పంచాయతీ రాజ్ డే గా జరుపుకుంటారు.దాదాపు 30 లక్షల మంది ప్రజా ప్రతినిధులతో నడుస్తున్న ‘పంచాయితీ రాజ్ వ్యవస్థ’ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. దేశ వ్యాప్తంగా 718 జిల్లా పంచాయితీలు,6,097 మండల పంచాయితీలు, 2,34,676 గ్రామ పంచాయితీలు పనిచేస్తున్నాయి. గణాలకు వెన్నెముకగా పనిచేస్తున్న వీరందరికి మనందరి తరపున పంచాయతీ రాజ్ డే శుభాకాంక్షలు.

చరిత్ర :
ప్రాచీనకాలంలో గ్రామ పాలనా వ్యవస్థ అప్పటి సాంఘిక పరిస్థితుల కనుగుణంగా ఐదు ప్రధాన వృత్తి వృత్తుల ప్రతినిధులతో పనిచేశేవి…. కులాల వారీగా పెత్తనం సాగేది. స్థానిక ప్రభుత్వం అనే కాన్సెప్ట్ కు బ్రిటిష్ గవర్నర్ జనరల్ రిప్పన్ బీజాలు వేసాడు. 1919, 1935 భారత ప్రభుత్వ చట్టాలు కొంతమేరకు వీటికి బలం చేకూర్చాయి.

 

చట్టబద్దత :
పంచాయితీలకు చట్టబద్దత కల్పించడం కోసం పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1991లో పార్లమెంట్‌లో 73వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఇది 1992లో ఆమోదం పొందింది. రాష్ట్ర జాబితాలోని అంశాలకు సంబంధించిన బిల్లు కనుక దీన్ని 50 శాతం కన్నా తక్కువ కాకుండా రాష్ట్ర శాసనసభలు ఆమోదించాలి. ఈ బిల్లుకు 17 రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి. నాటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌శర్మ ఈ బిల్లుపై 1993 ఏప్రిల్ 20న సంతకం చేశారు. ఇది 1993 ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది.

రాజ్యాంగం లోని IXవ భాగంలో 243, 243 ‘A’ నుంచి 243 ‘O’ వరకు పంచాయతీ నిర్మాణానికి సంబంధించిన వివరణను 11వ షెడ్యూల్‌లో పంచాయతీలు నిర్వర్తించాల్సిన 29 విధులను చేర్చారు.

Gram Panchayati- Algol

 

గ్రామ పంచాయతీలు చేయాల్సిన 29 పనులు:

1.వ్యవసాయం వ్యవసాయ విస్తరణ.

2.భూసంస్కరణలు పరిరక్షణ.

3.చిన్నతరహా సాగునీటి పథకాలు నీటి పరిరక్షణ

4.పశువుల సంరక్షణ పాల ఉత్పత్తులు కోళ్ల పరిశ్రమలు

5.చేపలు

6.సామాజిక అడవులు

7.చిన్నతరహా అటవీ ఉత్పత్తులు

8.చిన్న తరహా పరిశ్రమలు ఆహార ఉత్పత్తి పరిశ్రమలు

9.ఖాదీ నూలు పరిశ్రమలు

10.గ్రామీణ గృహ వసతి పథకాలు

11.తాగునీటి వసతి

12.రోడ్లు బ్రిడ్జీలు ఇతర సమాచార వ్యవస్థలు

13.ఇంధన ఉత్పత్తులు పశువుల మేత

14.గ్రామీణ విద్యుదీకరణ విద్యుత్ పంపిణీ

15.సాంప్రదాయ ఇంధన వనరుల అభివృద్ధి

16.పేదరిక నిర్మూలన పథకాలు

17.వైద్య పాథ్రమిక ఉన్నత స్థాయి విద్య

18.పారిశ్రామిక శిక్షణ వృత్తి శిక్షణ

19.వయోజన విద్య

20.గ్రంధాలయాలు

21.సాంస్కృతిక కార్యక్రమాలు

22.వ్యాపార, వ్యాపార ప్రదర్శనలు

23.ఆరోగ్యం పరిసరాలు పరిశుభ్రత

24.కుటుంబ పరిరక్షణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు

25.మహిళా శిశు సంక్షేమం

26.సామాజిక సంక్షేమం వికలాంగులకు చేయూత

27.బలహీన వర్గాల సంరక్షణ షెడ్యూల్ కులాల తెగల సంరక్షణ

28.ప్రజా పంపిణీ వ్యవస్థ

29.సామాజిక ఆస్తుల పరిరక్షణ

ఒక గంట (1Hr)… భారత దేశ చరిత్రనే మార్చేసింది! ఆ ఘటన జరిగింది నేడే ఏప్రిల్ 21.!

1526 వ సంవత్సరం, ఏప్రిల్ 21 …అప్పటి వరకు ఉత్తర భారతాన్ని పాలిస్తున్న ఇబ్రహీం లోడికి ….ఢిల్లీ పీఠం పై కన్నేసి యుద్దానికి దిగిన బాబర్ కి మధ్య పానిపట్ ( ప్రస్తుతం హర్యానాలో ఉంది) వద్ద యుద్ధం జరిగింది. దీనినే మొదటి పానిపట్ యుద్ధం అంటారు.

ఆ యుద్ధంలో గనక మరో గంట పాటు ఇబ్రహీం లోడి బతికి ఉండి ఉంటే ఢిల్లీ పీఠం మొఘలుల చేతుల్లోకి వెళ్ళేది కాదు… దేశమంతా ఒకరి చేతుల్లోకి వెళ్ళేది కాదు. ఔరంగజేబు లాంటి నిరంకుశ పాలనలోకి మన దేశం వెళ్ళేది కాదు. అప్పటి వరకు పటిష్టంగా ఉన్న స్థానిక రాజ్యాలు సైతం మొఘల్స్ ఆధీనంలోకి వెళ్లాయి.

ఈ యుద్ద విజయం క్రెడిట్ మొత్తం బాబర్ కు ఇవ్వాల్సిందే.. అప్పటి వరకు యుద్దాలంటే పాదాతిదళం, ఏనుగులు, గుర్రాలే… ఫస్ట్ టైం బాబర్ యుద్ద పిరంగులను రంగంలోకి దించాడు..అసాధ్యమని విజయాన్ని సుసాధ్యం చేసుకున్నాడు.

 

బాబర్ సైన్యం 15000 ..దాదాపు 25 ఫిరంగులు. అటు లోడి సైన్యం 40000 ..1000 యుద్ద ఏనుగులు. ఈ లెక్క చుస్తే విక్టరీ లోడికే దక్కాలి కానీ ఫిరంగులు సీన్ సీన్ నే చేంజ్ చేసి పడేశాయి…దేనికి తోడు బాబర్ స్టాటజీ వర్కౌట్ అయ్యింది…. బాబర్ తన సైన్యాన్ని తుళుగ్మ, అరబ అని విడగొట్టాడు…తుళుగ్మ ‘ముందు, వెనుక ,మధ్య’ అని మూడు భాగాలుగా….. వాటిలోనే ఇంకొన్ని
నిలువు గ్రూప్స్ విడగొట్టాడు ఆ నిలువు గ్రూప్స్ యే ‘అరబ’.

ఫిరంగులను మధ్యలో ఉంచి … అరబ గ్రూప్ సభ్యుల చేతికి తాడును అందించేవారు . ఫిరంగి పేల్చాలనుకునే టైములో ఆ తాడు గుంజేవారు …దీంతో ఆ లైన్ లో ఉన్న సైనికులంతా డౌన్ అయ్యేవారు …బాంబు వారి పైనుండి దూసుకుపోయి శత్రువులను చేరేది. ఈ భీకర శబ్దాలకు ఏనుగులు భయపడి యుద్ధరంగం నుండి పారిపోయేవి..ఇది కూడా లోడికి మైనస్.

దీనికి తోడు …బాబర్ సైనికులు బులెట్ ప్రూఫ్ లాంటి బట్టలు తొడుక్కోవడంతో… మరింతగా రెచ్చిపోయి యథేచ్ఛగా ఫిరంగులను పేల్చారు. ఆ యుద్ద భూమిలోనే లోడి చనిపోయాడు , దేంతో బాబర్ ఢిల్లీ కి రాజయ్యాడు. క్రమక్రమంగా…ఇక్కడితో సంతృప్తి చెందని బాబర్ మరిన్ని యుద్దాలు చేసాడు.. అతని తర్వాత వచ్చిన వారి వారసులు….అఖండ భారతాన్ని ( కొన్ని ప్రాంతాలు మినహా) తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.

ఆ యుద్ధంలో గనక లోడి మరో గంట పాటు పోరాడి ఉంటే తప్పక విజయం సాధించేవాడు. ఎందుకంటే అప్పటికే బాబర్ మందుగుండు సామాగ్రి అయిపోయింది. కేవలం పదాతి దళమే మిగిలింది. సంఖ్యాపరంగా ఎక్కువున్న లోడి సైన్యం వారి పనిని పట్టేది. కానీ రాజే మరణించడంతో సైన్యం సరెండర్ అయిపోయింది.

16 ఏళ్లకు అరెస్ట్, 31 ఏళ్లకు విడుదల…..స్వతంత్ర సంగ్రామంలో మనకు తెలియని యోధురాలు.

భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో ఎందరో వీరులు తమ ప్రాణాలకు తెగించి మరీ బ్రిటిష్ వారితో పోరాడారు. అయినప్పటికీ మనం ఎక్కువ నెహ్రూ, గాంధీ, పటేల్, బోస్, భగత్ సింగ్ ..ఇలాంటి కొన్ని పేర్లే వింటూ ఉంటాం. ఇప్పుడు మనం ఇప్పటి వరకు పెద్దగా పరిచయం లేని ఓ మహిళా గురించి, దేశ విముక్తి కోసం తన యవ్వనం అంతా జైలు లోనే గడిపిన యోధురాలి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.!

గైడిన్ లియో …. సాంప్రదాయ నాగా వంశానికి చెందినామె. తమ తెగకు రాణి. అప్పటికే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని నిరంకుశంగా పాలిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలపైనా వారి ఆదిపత్యం స్టార్ట్ అయ్యింది. దీంతో తమ తెగను రక్షించే ప్రయత్నంలో గైడిన్ కజిన్ అయిన హైపో జెడోనాగ్ హెరాక అనే ఉద్యమాన్ని స్టార్ట్ చేసాడు…దీని లక్ష్యం నాగాల సాంప్రదాయాన్ని కాపాడుకోవడంతో పాటు స్వపరిపాలన.

ఈ ఉద్యమం గురించి తెలిసి…బ్రిటిష్ వాళ్ళు 1931 లో జెడోనాగ్ ను అరెస్ట్ చేసి ఉరి తీశారు. దీంతో ఉద్యమాన్ని నడపాల్సిన బాధ్యత గైడిన్ లియో తీసుకుంది. తమ ప్రాంతం నుండి ఎటువంటి శిస్తు కట్టొద్దు అంటూ తీర్మానం చేసింది. ప్రజలు పెద్ద సంఖ్యలో ఆమెతో నడిచారు. స్వచ్చందంగా విరాళాలు ఇచ్చి మరీ ఈ ఉద్యమంలో భాగం అయ్యారు.

గైడిన్ లియో ..గురించి తెలుసుకున్న బ్రిటిష్ ప్రభుత్వం 1933 లో అనేక అక్రమ కేసులు బనాయించి ఆమెను అరెస్ట్ చేసారు… అప్పుడు ఆమె వయసు 16 సంవత్సరాలు మాత్రమే.! 10 నెలల జైలు శిక్షను యావజ్జీవంగా మార్చేశారు. ఇలా ఆమె యవ్వనమంతా అస్సాం జైళ్లలో చీకటి గదుల్లోనే గడిచిపోయింది. చివరకు మనకు స్వాతంత్రం వచ్చాక 1947 ఆమెను విడుదల చేసారు…అంటే ఆమె 14 సంవత్సరాలు జైల్లో గడిపారు…(16 – 30 Age).

1937 లో నెహ్రూ…. గైడిన్ లియో గురించి ” భారతదేశం ఆమెని జ్ఞప్తి తెచ్చుకునే రోజు ,మనసులో పదిలంగా దాచుకునే రోజు వస్తుంది” అని అన్నారు.

జలియన్ వాలా బాగ్ ..విషాద దృశ్యాలు.

భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన. జలియన్ వాలాబాగ్ ఉదంతం. 1919 లో రౌలత్ చట్టానికి( తిరుగుబాటు దారులను అణిచే సర్వ హక్కులు వైస్రాయ్ కి ఇవ్వడం) వ్యతిరేకంగా…సత్యపాల్, సైఫుద్దీన్ కీచ్లు లు ప్రజాసభలు నిర్వహిస్తూ ప్రజలను హింస వైపు ప్రేరేపిస్తున్నారని బ్రిటిష్ ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసింది .. వారి అరెస్ట్ ను నిరసిస్తూ సిక్కుల ఆధ్యాత్మిక నూతన సంవత్సరం ( మనకు ఉగాది లాగ ) అయినా బైసాకి పండుగ రోజు పంజాబ్ లోని అమృత్ సర్ దగ్గర్లోని జలియన్ వాలా బాగ్ లో స్థానిక ప్రజలు నిరసన తెలియజేస్తున్నారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న జనరల్ డయ్యర్ 90 మంది సైనికులతో….ఆ ప్రాంతానికి చేరుకొని కాల్పులు ప్రారంభించాడు. ఈ కాల్పుల్లో సుమారు 1000 మంది చనిపోయారు.

       1.కాల్పులు తొక్కిసలాట తర్వాత పార్క్ ప్రాంతం 

 

    2. పార్క్ కు ఉన్న ఒకే ఒక ద్వారం

 

    3. కాల్పుల సమయంలో ప్రాణాలు రక్షించుకోడానికి ….ఈ బావిలోకి దూకారు. సుమారు 120 మృత దేహాలను         ఇందులోనుండి వెలికి తీశారు.

 

 

4. గోడలపై బుల్లెట్ల గుర్తులు

 

5. హింసకు గుర్తుగా స్తూపం.

 

 

5. కాల్పులు జరుపుతున్న దృశ్యం

జలియన్ వాలా బాగ్ లో ..కాల్పుల బాధ్యుడు ఆ ఘటన తర్వాత చెప్పిన మాటలు

భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన. జలియన్ వాలాబాగ్ ఉదంతం. 1919 లో రౌలత్ చట్టానికి( తిరుగుబాటు దారులను అణిచే సర్వ హక్కులు వైస్రాయ్ కి ఇవ్వడం) వ్యతిరేకంగా…సత్యపాల్, సైఫుద్దీన్ కీచ్లు లు ప్రజాసభలు నిర్వహిస్తూ ప్రజలను హింస వైపు ప్రేరేపిస్తున్నారని బ్రిటిష్ ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసింది .. వారి అరెస్ట్ ను నిరసిస్తూ సిక్కుల ఆధ్యాత్మిక నూతన సంవత్సరం ( మనకు ఉగాది లాగ ) అయినా బైసాకి పండుగ రోజు పంజాబ్ లోని అమృత్ సర్ దగ్గర్లోని జలియన్ వాలా బాగ్ లో స్థానిక ప్రజలు నిరసన తెలియజేస్తున్నారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న జనరల్ డయ్యర్ 90 మంది సైనికులతో….ఆ ప్రాంతానికి చేరుకొని కాల్పులు ప్రారంభించాడు. ఈ కాల్పుల్లో సుమారు 1000 మంది చనిపోయారు.

genral dyer jaliyanwala bagh

ఈ ఘటనపై విచారణ చేపట్టిన హంటర్ కమిషన్ ముందు కాల్పులకు ఆదేశాలిచ్చిన డయ్యర్ మాట్లాడిన మాటలు….

” నాకు ఆ మీటింగ్ గురించి 12:40కి తెలిసింది, అక్కడ సమావేశమైన గుంపు కనిపిస్తే కాల్పులు జరపాలనే ఉద్దేశంతోనే అక్కడికి వెళ్ళాను.

కాల్పులు జరుపకుండా గుంపును చెదరగొట్టొచ్చు…. కానీ వాళ్ళంతా మళ్ళీ తిరిగివచ్చి నన్ను అవహేళన చేస్తే… నేను చేతగానివాడినయ్యుండేవాడిని.

jaliyanwala bagh place

ఆ పార్క్ లోకి వాహనాలు వెళ్ళగలిగితే మెషిన్ గన్లతో కాల్పులు జరిపించి ఉండేవాడినని, కాని ఇరుకైన సందులలోకి మా సాయుధ వాహనాలు వెళ్ళడం కుదరక తుపాకీ కాల్పులు జరిపాము.

జనం అంతా వెళ్ళిపోయేదాకా కాల్పులు జరపడం నా బాధ్యత గా ఫీల్ అయ్యాను. గాయపడినవారిని ఆసుపత్రులకు తరలించడం నా బాధ్యత కాదు కాబట్టి అలాంటి ప్రయత్నమేమీ చేయలేదు”

« Previous Page