Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

స్త్రీ తదనంతర బంగారం కూతురికా కోడలికా…?

Advertisement

మన భారతదేశంలో సాంప్రదాయాలను ఏ విధంగా గౌరవిస్తూ ఉంటారో… వాళ్లకు రావాల్సిన ఆస్తుల విషయంలో నగల విషయంలో అదే విధంగా వ్యవహరిస్తూ ఉంటారు. తల్లి, తండ్రి ఆస్తి బయటి వారికి పోనీయకుండా, కనీసం తోడబుట్టిన వాళ్ళు తీసుకున్నా సరే ఓర్వలేని పరిస్థితి ఉంటుందనే మాట వాస్తవం.

ఇక తల్లి బంగారం విషయంలో కొడుకులకు కూతుళ్లకు మధ్య పెద్ద యుద్దాలే జరుగుతాయి. తల్లి పెట్టుకున్న పోగుల నుంచి, ముక్కు పుడక నుంచి ప్రతీ ఒక్క దాని మీద పట్టుదలగా ఉంటారు. తల్లి బంగారం కోసం… తల్లిని బంగారంలా చూసుకునే బిడ్డలు కూడా ఉన్న సమాజం మాస్టారూ ఇది. సరే తల్లి బంగారం ఎవరికి దక్కాలో ఒక్కసారి చూద్దాం.

Advertisement

 

Advertisements

ఆడపిల్లలకు మాములుగా జరిపించే వివాహాలు స్త్రీధనం ఇచ్చి జరిపించాల్సి ఉంటుంది. ఇది మన ధర్మం, శాస్త్రం, సాంప్రదాయం లాంటివి చెప్పే మాట. కొంత ఆస్తి తన వృద్ధాప్యం కోసం దాచుకుని మిగిలినది ఇవ్వాల్సి ఉంటుంది. మగ పిల్లలకు తదనంతరం మిగిలిన ఆస్తి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పంపకాలన్నీ కూడా పక్షపాత లేకుండా జరిగితే మంచిది. ఇంతకు మీకు అర్థమైందా…? పెళ్లి చేసేటప్పుడు ఇచ్చే బంగారమే కూతురికి.

Advertisements

ఎవ‌రు పేద‌వారు? ఆ డాక్ట‌రా? ఈ కొబ్బ‌రి బోండాల షాప్ అత‌నా? నా అనుభ‌వం.

లాక్ డౌన్ త‌ర్వాత హాస్పిట‌ల్ లో చూయించుకోడానికి వెళ్లాను. ఆ డాక్టర్ చాలా ఫేమ‌స్ , ఆయ‌న‌కు చాలా హాస్పిట‌ల్స్ ఉన్నాయి. పేరు మోసిన పొలిటీషియ‌న్స్, సినిమా యాక్ట‌ర్లు అంద‌రూ ఈ హాస్పిట‌ల్ లోనే చూపించుకుంటారు. నేను వెళ్లి చూపించుకున్నాను బిల్ 1000 అయ్యింది. అందులో డాక్ట‌ర్ ఫీజు 700 , అడ్మిన్ ఛార్జ్ 300 అని ఉంది. నాక‌ర్థం కాలేదు…ఈ ఆడ్మిన్ ఛార్జ్ ఏంటో..!

క్యాషియ‌ర్ ను అడిగాను ఇదేంట‌ని…దానికి ఆయ‌న లాక్ డౌన్ సార్., మేము అంద‌రి బిల్ మీద దీన్ని యాడ్ చేస్తున్నాం అని చెప్పాడు. చేసేదేం లేక బిల్ పే చేసి…ఇంటికి రిటర్న్ బ‌య‌లుదేరాను .

ఎండ బాగా ఉండ‌డంతో … కొబ్బ‌రి బోండాలాయ‌న ద‌గ్గ‌ర ఆపి మూడు కొబ్బ‌రి కాయ‌లు కొట్టించుకొని తాగాను..ఒక్కొక్క‌టి 40 అంటే మొత్తం 120 కానీ అత‌ను 100 యే తీసుకున్నాడు. నేను ఇంకో 20 తీసుకో అని అడిగాను. దానికి అత‌ను ఈ క‌ష్ట‌కాలంలో డ‌బ్బులు సంపాధించ‌డం చాలా క‌ష్టం సార్.. మీతో ఉండ‌నివ్వండి. మూడు తీసుకున్నందుకు ఆఫ‌ర్ అనుకోండి అన్నాడు.

ఆప‌త్కాలంలో దోచుకోవాలని చూస్తున్న‌ ఆ కార్పోరేట్ దవాఖానాలు ఎక్క‌డా….? మ‌న గురించి కూడా ఆలోచించే ఈ చిన్న వ్యాపారులెక్క‌డ‌.!

—-క‌న్న‌న్ – త‌మిళ‌నాడు

కోకాకోలా ను డోర్ టు డోర్ తిరిగి అమ్మిన వ్య‌క్తి….ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌న‌వంతుడిలా ఎలా మారాడు? ప్ర‌తి ఒక్క‌రూ స్పూర్తి పొందాల్సిన స‌క్సెస్ స్టోరి!

ప్ర‌పంచంలోని అత్యంత సంప‌న్నుల్లో వారెన్ బ‌ఫెట్ కూడా ఒక‌ర‌న్న సంగ‌తి తెలిసిందే. 2020 ఫోర్బ్స్ వివ‌రాల ప్ర‌కారం ఆయ‌న ఆస్తి విలువ సుమారుగా 8,840 కోట్ల డాల‌ర్లు ఉంటుంద‌ని అంచ‌నా. బ‌ర్క్ షైర్ హాత్‌వే అనే కంపెనీకి చైర్మ‌న్‌, సీఈవోగా ఈయ‌న ఉన్నారు. ఈయ‌న గొప్ప వ్యాపార‌వేత్త మాత్రమే కాదు, దాన గుణంలోనూ మేటి. ఇక ప్ర‌పంచంలోని సంప‌న్నుల జాబితాలో ఈయన 7వ స్థానంలో కొన‌సాగుతున్నారు.

వారెన్ బ‌ఫెట్ ఇప్పుడు అంత గొప్ప వ్య‌క్తిగా ఉన్నారు. కానీ ఆయ‌న చిన్న‌త‌నంలోనూ అనేక ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. చిన్న‌ప్పుడు ఆయ‌న ఒక‌సారి స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్‌ను దొంగిలించారు. అలాగే స్కూల్‌లో గ్రేడ్లు కూడా అంత మంచిగా వ‌చ్చేవి కాదు. ఇక ఒక‌సారి ఇంట్లో నుంచి పారిపోయారు. అయితే త‌న తండ్రి ఆయ‌న‌కు జీవిత పాఠాలు నేర్పించారు. ఇక‌నైనా స‌రైన న‌డ‌వ‌డిక అల‌వర్చుకోకపోతే జాగ్ర‌త్త అని భ‌య‌పెట్టారు. దీంతో బ‌ఫెట్ అప్ప‌టి నుంచి స‌రైన మార్గంలో న‌డిచారు.

వారెన్ బ‌ఫెట్ యుక్త వ‌యస్సులో ఉన్న‌ప్పుడు ఆయ‌నను ఒక పుస్త‌కం అమితంగా ఆక‌ట్టుకుంది. దాన్ని ఆయ‌న లైబ్ర‌రీ నుంచి అద్దెకు తెచ్చుకున్నాడు. వ‌న్ థౌజండ్ వేస్ టు మేక్ 1000 డాల‌ర్స్ అనే పుస్త‌కం అది. దాన్ని చ‌ద‌వ‌డం వ‌ల్ల‌నో ఏమో ఆయ‌న డబ్బు విలువ తెలుసుకున్నాడు. యుక్త వ‌య‌స్సు నుంచే ప‌నిచేయ‌డం మొద‌లు పెట్టాడు. త‌న బామ్మ కిరాణా స్టోర్‌లో ప‌నిచేసేవాడు. కోలా కోలా, గోల్ఫ్ బాల్స్‌, స్టాంప్‌లు, మ్యాగ‌జైన్ల‌ను డోర్ టు డోర్ తిరిగి అమ్మాడు.

మ‌నం ఇత‌రుల క‌న్నా స్మార్ట్‌గా ఉండాల్సిన ప‌నిలేదు, ఇత‌రుల క‌న్నా డిసిప్లిన్‌గా ఉంటే చాలు.. అని బ‌ఫెట్ అంటారు. న్యూయార్క్‌కు ఒక‌సారి ఆయ‌న త‌న 10వ ఏట వెళ్లిన‌ప్పుడు అక్క‌డి స్టాక్ ఎక్స్చేంజ్‌ను చూశారు. త‌న‌కు, త‌న సోదనికి చెరొక 3 స్టాక్స్ చొప్పున కొన్నారు. ఇక ఆయ‌న త‌న 15వ ఏట నెల‌కు 2వేల డాల‌ర్ల‌ను సంపాదించ‌డం మొద‌లు పెట్టారు. న్యూస్ పేప‌ర్ల‌ను డెలివ‌రీ చేయ‌డం ద్వారా ఆయ‌న సంపాదించేవారు. అప్ప‌ట్లోనే ఆయ‌న 40 ఎక‌రాల వ్య‌వ‌సాయ క్షేత్రాన్ని కొన్నారు.

బ‌ఫెట్ త‌న హైస్కూల్ విద్య పూర్తి అయ్యే స‌రికి 50వేల డాల‌ర్ల‌ను పొదుపు చేశారు. ఆయ‌న వ్యాపారం చేయాల‌ని అనుకునే వారు. కానీ హార్వార్డ్ బిజినెస్ స్కూల్ వారు ఆయ‌న‌కు సీటు ఇవ్వ‌లేదు. ఇక వ్యాపారం ప్రారంభించాలంటే ముందుగా మ‌న‌కు మ‌న‌మే పెట్టుబ‌డిగా మారాల‌ని ఆయ‌న అంటుంటారు. అలాగే బఫెట్‌కు ప్ర‌జా వేదిక‌పై మాట్లాడాలంటే భ‌యంగా ఉండేది. దీంతో ఆ స‌మ‌స్య‌ను అధిగ‌మించేందుకు ఆయ‌న ఓ కోర్సు చేశారు.

ఇక బ‌ఫెట్ త‌న క‌న్నా వ‌య‌స్సు రెండింత‌లు ఎక్కువ‌గా ఉన్న‌వారికి వ్యాపారంలో పెట్టుబ‌డి పాఠాలు చెప్పేవారు. బ‌ఫెట్ మొద‌ట్లో ఒక గ్యాస్ స్టేష‌న్‌ను ప్రారంభించారు. కానీ న‌ష్టం వ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ వ్యాపారం చేయాల‌నే త‌న ప‌ట్టుద‌ల‌ను మాత్రం వ‌ద‌ల‌లేదు. అవ‌కాశాలు అనేవి త‌ర‌చూ రావు, ఎప్పుడో ఒక‌సారి వ‌స్తాయి, అవి వ‌చ్చిన‌ప్పుడు ఆకాశం నుంచి బంగారం కురిస్తే బ‌కెట్ పెట్టాలి కానీ.. చిన్న గ్లాస్ కాదు.. అనే సూత్రాన్ని బ‌ఫెట్ బ‌లంగా నమ్ముతారు. అందుక‌నే ఆయ‌న ప్ర‌పంచంలోనే అత్యంత విజ‌య‌వంత‌మైన స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట‌ర్‌గా మారారు.

కాగా బ‌ఫెట్ కు ప్ర‌స్తుతం ఉన్న సంప‌ద‌లో 99 శాతం సంప‌ద‌ను ఆయ‌న త‌న‌కు 50 ఏళ్లు వ‌చ్చిన త‌రువాతే సంపాదించ‌డం విశేషం. బ‌ఫెట్ ఆన్‌లైన్‌లో బ్రిడ్జి గేమ్ ఆడుతారు. టి-బోన్ యూజ‌ర్‌నేమ్ పేరిట ఆయ‌న ఆ గేమ్‌ను ఆడుతారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌, బ‌ఫెట్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్‌. బ‌ఫెట్ పెద్ద ఫుట్‌బాల్ ఫ్యాన్‌. బ‌ర్గ‌ర్‌, చెర్రీ కోలా అంటే ఆయ‌న‌కు చాలా ఇష్టం. చారిటీల‌కు ఆయ‌న 25 బిలియ‌న్ డాల‌ర్ల‌కు పైగా విరాళాలు ఇచ్చారు. త‌న ఆస్తిలో కేవ‌లం 1 శాతాన్ని మాత్ర‌మే త‌న వార‌సుల‌కు ఇస్తాన‌ని, 99 శాతం మొత్తాన్ని దానం చేస్తాన‌ని బ‌ఫెట్ గ‌తంలోనే ప్ర‌క‌టించారు.

2017 వ‌ర‌కు బ‌ఫెట్‌కు వ‌చ్చే రోజు వారీ ఆదాయం విలువ 220 మిలియ‌న్ డాల‌ర్లు ఉంటుంద‌ని అంచ‌నా. అది ఇప్పుడు ఇంకా పెరిగి ఉంటుంద‌ని భావిస్తున్నారు. బ‌ఫెట్ ప్ర‌స్తుత ఆస్తి విలువ 80 బిలియ‌న్ డాల‌ర్లు ఉంటుంద‌ని అంచ‌నా. కానీ ఆయ‌న ఇప్ప‌టికీ 1957లో 31,500 డాల‌ర్లతో కొనుగోలు చేసిన ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. అంకిత‌భావం, ప‌ట్టుద‌ల, శ్ర‌మ ఉంటే ఎవ‌రైనా దేన్న‌యినా సాధించ‌వచ్చ‌ని బ‌ఫెట్ చెబుతారు. జీవితంలో అత్యంత విజ‌య‌వంతం అయిన వారు తాము ప్రేమించే ప‌నినే చేస్తార‌ని అంటారు.

ప్రేమించ‌డం తప్పు కాదు. స‌రైన వారిని ప్రేమించ‌క‌పోవ‌డమే త‌ప్పు.! ఇదే త‌ప్పు చేసిన ఓ యువ‌తి రియ‌ల్ స్టోరి.

నా చిన్న‌నాటి స్నేహితుడ‌త‌ను…. తెల్లారడంతోనే మొద‌ల‌య్యేవి మా ఆట‌లు, క‌లిసి ప‌తంగులెగురేయ‌డం, మామిడి తోట‌లో దొంగ‌త‌నాలు చేయ‌డం, మా ఊరి చెరువులో ఈత‌కొట్ట‌డం..త‌నెక్క‌డుంటే నేన‌క్క‌డ ఉండాల్సిందే.. అలా ఉండేది మా స్నేహం.! కాలంతో పాటు మా స్నేహం కూడా పెరిగి ప్రేమ‌గా మారింది. అది కాస్త ఇంట్లో తెలిసి…మా నాన్న‌, అన్న‌య్య ఇద్ద‌రూ క‌లిసి న‌న్ను కొట్టారు… ఆ దెబ్బ‌ల‌కు నా బొక్క‌లు విరిగాయి, నోట్లోంచి రక్తం ప‌డింది. అయినా అత‌నిపై నా ప్రేమ ఇంకా పెరిగింది. ఇద్ద‌రం క‌లిసి ఊరొదిలి పారిపోయాము.

ఇద్ద‌రం క‌లిసి …ఓ పెద్ద టౌన్ లో చిన్న రూమ్ ను అద్దెకు తీసుకొని మా కొత్త జీవితాన్ని ప్రారంభించాము. అత‌ను టెక్స్ టైల్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. నేను మా ఇంటి ఏరియాలో ఉండే ఇండ్ల‌లో పాచిప‌ని చేసేదానిని. చిన్న ఉద్యోగాలు, చిన్న ఇళ్ళు…కానీ మ‌న‌సుల నిండా బోలెడంత ప్రేమ‌.! ఒక్కోసారి ఆయ‌న నైట్ డ్యూటీ కూడా చేసేవారు…ఆయ‌న కోసం తెల్లారేవ‌ర‌కు ఎదురుచూసిన రోజులు అనేకం…అయినా ఆ ఎద‌రుచూపుల్లో భ‌లే ఆనందముండేది.!

ఓ రోజు….సాయంత్రం నేను ఇంట్లో ఉన్న స‌మ‌యాన‌..మా ఆయ‌న‌తో పాటు అదే టెక్స్ టైల్స్ కంపెనీలో ప‌నిచేసే మ‌రో వ్య‌క్తి నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడు. “మీ ఆయ‌న మా కంపెనీలో ప‌నిచేసే ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, కంపెనీ ద‌గ్గ‌రే ఓ ఇళ్లు రెంట్ కు తీసుకొని వాళ్లిద్ద‌రూ ఉంటున్నార‌”ని చెప్పాడు. అత‌ని మాట‌ల్లో నిజం లేద‌ని నాక‌నిపించింది…ఎందుకంటే మా ప్రేమ అంత స్వ‌చ్ఛ‌మైన‌ది.! కానీ అత‌ను నిజం నిజం నే చెప్పేది నిజం అంటుంటే….అత‌ని మాట‌ల‌ను అబద్దమ‌ని నిరూపించ‌డానికి అత‌నితో క‌లిసి బ‌య‌లు దేరాను.

దూరంగా ఓ ఇంటిని చూపించాడు…ఇదే మీ ఆయ‌న ఉంటున్న ఇళ్ల‌ని చెప్పాడ‌త‌ను… కొద్దిసేప‌టికే మా ఆయ‌న మ‌రో అమ్మాయితో క‌లిసి న‌వ్వుకంటూ ఆ ఇంట్లోకి ఓ సంచితో వెళ్ళ‌డం చూశాను. త‌ట్టుకోలేక‌పోయాను. నా కాళ్లు అక్క‌డ నిల‌బ‌డ‌లేక‌పోయాయి..ఇంటికెళా వ‌చ్చానో కూడా తెలియ‌దు.

నా మ‌న‌స్సును రాయి చేసుకున్నాను… మా ఆయ‌న‌కు ఇష్ట‌మైన చేప‌ల కూర వండాను, నాకు తెలుసు ఇదే నేను మా ఆయ‌న‌కు వ‌డ్డించే చివ‌రి భోజ‌మ‌ని.! ఆయ‌నొచ్చాడు…ఎప్ప‌టిలాగే స్నానం చేసి, తిన‌డానికి కూర్చున్నారు. నేను కూడా నాకేం తెలియ‌ద‌న్న‌ట్టు వండిన అన్నం, కూర వ‌డ్డించాను, “బాగుంది , చాలా బాగుందం”టూ తిన్నాడు. ఆ క్ష‌ణం ఆయ‌న క‌ళ్ళ‌ల్లోకి చూసి….”మీరు న‌న్ను నిజంగానే ప్రేమిస్తున్నారా?” అని అడిగాను. ఆయ‌న‌క‌ర్థ‌మ‌య్యింది…ఏడ్వ‌డం స్టార్ట్ చేశాడు..అప్ప‌టికే ఏడ్చి ఏడ్చి నా క‌న్నీరంతా ఇంకిపోయింది. ఒంటిమీద ఉన్న ఓకే ఒక చీర‌తో ఆ ఇంటినుండి బ‌య‌లు దేరాను. బ్ర‌తిమాలాడాడు. కానీ ప్ర‌పంచంలో అత్యంత క‌ఠినమైన విష‌యం ఏంటంటే….సెకండ్ ఛాన్స్ ఇవ్వ‌డం…అది నేను ఇవ్వ‌ద‌ల్చుకోలేదు. నా దారి నే వెతుక్కున్నాను.

అలా వ‌చ్చేసి ఇప్ప‌టికీ 15 సంవ‌త్స‌రాలు…. నా బ‌తుకేదో నే బ‌తుకుతున్న‌… నా గ‌తం ఎవ్వ‌రికీ చెప్పుకోకుండా…నా వాళ్ళెవ్వ‌రూ లేరు, నేనో అనాథ‌ను అని నన్ను నేను ప‌రిచ‌యం చేసుకొని నా జీవ‌నం సాగిస్తున్న‌.!

ఆమె ట్రైన్ లో బ‌య‌లుదేరింది..ఇక్క‌డ ఇత‌నికి టెన్ష‌న్ స్టార్ట్ అయ్యింది….నిజ‌మైన ప్రేమంటే ఇదేనేమో.!

ఇత‌ని పేరు వినోద్ …త‌మిళ‌నాడులోని మధురైలో జాబ్ చేస్తుంటాడు. పుట్టింటికి వెళ్లిన త‌న భార్య రిట‌ర్న్ జ‌ర్నీ కోసం ట్రైన్ టికెట్ బుక్ చేశాడు … RAC కింద టికెట్ బుక్ అయ్యింది . RAC అంటే (Reservation against cancellation) ఎవ‌రైన త‌మ రిజ‌ర్వేష‌న్ కాన్స‌ల్ చేసుకుంటే ఆ బెర్త్ ఇస్తార‌న్న‌మాట‌.!

స‌మ‌యం – SEP – 22, 2018 ; రాత్రి 10.45:

హోసూర్ రైల్వే స్టేష‌న్…ట్రైన్ వ‌చ్చింది…..గ‌ర్భావ‌తి అయిన వినోద్ భార్య ట్రైన్ ఎక్కింది. కానీ సీట్ దొర‌క‌లేదు. “TTE ని రిక్వెస్ట్ చెయి…ఏదో ఒక బెర్త్ అడ్జెస్ట్ చేస్తాడ‌”ని ఫోన్ లో చెప్పాడు వినోద్.. స‌రే అనింది అత‌ని భార్య‌.

స‌మ‌యం : రాత్రి 11:00 :

“నాకు బెర్త్ దొరికింది” అని వినోద్ కు మెసేజ్ చేసింది భార్య‌…ఎగిరి గంతేసినంత ప‌నిచేశాడు వినోద్ … ఓకే ఉద‌యం 8 గంట‌ల‌కు మ‌ధురై స్టేష‌న్ ద‌గ్గ‌ర రెడీగా ఉంటాన‌ని…హ్యాపీగా ప‌డుకున్నాడు.

మ‌రునాడు ఉద‌యం 6 గంట‌ల‌కు లేచి…త్వ‌ర‌త్వ‌ర‌గా రెడీ అవుతున్నాడు వినోద్ …ఎందుకో ఓసారి ఫోన్ చూసుకున్నాడు. భార్య నుండి రెండు మెసేజ్ లున్నాయి. అవి కూడా 23 వ తేదీ ఉద‌యం 4.45 కు వ‌చ్చిన మెసేజులు ..అందులో “నాకు బెర్త్ దొరికింది ” అని ఉంది. వినోద్ కు అర్థం కాలేదు…అదేంటీ… రాత్రి 11:00 గంట‌ల‌కు ,ఉద‌యం 4.45 సేమ్ మెసేజెస్ ఎందుకు పంపింద‌ని ఆలోచ‌న‌లో ప‌డ్డాడు.

వెంట‌నే భార్య‌కు కాల్ చేశాడు…మొద‌టి సారి లిఫ్ట్ చెయ్య‌లేదు, మ‌ళ్లీ చేశాడు…రెండో సారి ఫోన్ లిఫ్ట్ చేసిన భార్య‌తో …”నిజం చెప్పు నీకు బెర్త్ ఎప్పుడు దొరికిందో” అన్నాడు…ఉద‌యం 4.45 అని చెప్పింది..మ‌రి నాతో ఎందుకు అబ‌ద్దం చెప్పావు అని అడ‌గ‌గా… “అలా చెప్ప‌క‌పోతే మీరు రాత్రంతా నిద్ర‌పోకుండా నా గురించి ఆలోచిస్తార‌ని” చెప్పింది. “అయినా ప‌ర్లేదు స్టేష‌న్ కు వ‌చ్చేయండి మ‌రో 30 నిమిషాల్లో దిగుతాను” అంది.

స‌మ‌యం – SEP – 23, 2018 ; ఉద‌యం 8 గంట‌లు:
మ‌ధురై స్టేష‌న్ ద‌గ్గ‌ర ట్రైన్ ఆగింది.. వినోద్ భార్య ట్రైన్ దిగింది. ప‌రిగెత్తుకుంటూ వెళ్లి త‌న‌ను కౌగిలించుకున్నాడు వినోద్ .

భార‌త క‌రెన్సీ నోట్ల మీద ఉండే బొమ్మ‌లు…. వాటి విశిష్ట‌త‌.!

ప్ర‌పంచంలోని ప్ర‌తి ఒక్క దేశం సొంతంగా క‌రెన్సీని క‌లిగి ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగానే ప్ర‌తి ఒక్క దేశం త‌మ ఆచార వ్యవ‌హారాలు, సాంప్ర‌దాయాలు, జీవ‌న‌శైలి, జీవ‌వైవిధ్యం త‌దిత‌ర అంశాలకు అనుగుణంగా త‌మ క‌రెన్సీ నోట్ల‌పై ప‌లు ర‌కాల చిత్రాల‌ను ముద్రిస్తుంటాయి. ఇక భార‌త్ కూడా క‌రెన్సీ నోట్ల‌పై ప‌లు బొమ్మ‌ల‌ను ముద్రిస్తూ వ‌స్తోంది. అందుక‌నే మ‌న‌కు ఒక్కో కరెన్సీ నోటు వెనుక భాగంలో ఒక్కో ర‌క‌మైన చిత్రం క‌నిపిస్తుంది. అయితే ఆ చిత్రాలు ఏమిటో.. అవి ఏయే వివ‌రాల‌ను మ‌న‌కు తెలియ‌జేస్తాయో.. ఇప్పుడు తెలుసుకుందామా..!

రూ.1 నోటు :

మొద‌టి ప్ర‌పంచ యుద్ధం స‌మయంలో మ‌న దేశంలో మొద‌ట‌గా రూ.1 నోటును ముద్రించారు. అంత‌కు ముందు రూ.1 కి గాను వెండి నాణేలు ఉండేవి. వాటిపై జార్జ్ V చిత్రం ఉండేది. అయితే మొద‌టి ప్ర‌పంచ యుద్ధం వ‌ల్ల వెండికి కొర‌త ఏర్ప‌డింది. దీంతో 1917 నవంబ‌ర్ 30వ తేదీన రూ.1 నోటును అప్ప‌టి ప్ర‌భుత్వం ముద్రించింది. అయితే రూ.1 నోటును ఆర్‌బీఐ కాదు, కేంద్ర ఆర్థిక శాఖ ముద్రిస్తుంది. ఇక ఈ నోటు ముందు భాగంలో రూ.1 అనే సింబ‌ల్‌, వెనుక వైపు స‌ముద్రంలో ఆయిల్ వెలికితీసే రిగ్‌ ఉంటాయి. అప్ప‌ట్లో దేశంలో పారిశ్రామిక రంగంలో చోటు చేసుకున్న అభివృద్ధికి గుర్తుగా రూ.1 నోటుపై ఆ బొమ్మ‌ను ముద్రించారు.

రూ.2 నోటు…

రూ.1తోపాటు రూ.2 నోటును కూడా ఇప్పుడు చాలా మంది వాడడం లేదు. ఇక ఈ నోటుపై వెనుక భాగంలో ఆర్య‌భ‌ట్ట శాటిలైట్ చిత్రం ఉంటుంది. భార‌త్.. సైన్స్‌, టెక్నాల‌జీ రంగాల్లో సాధిస్తున్న ప్ర‌గ‌తికి చిహ్నంగా ఈ బొమ్మ‌ను రూ.2 నోటుపై ముద్రించారు. అయితే ఆర్‌బీఐ రూ.2 నోట్ల‌ను ముద్రించ‌డం మానేసింది. ప్రింటింగ్ ఖ‌ర్చు ఎక్కువ‌వుతుంద‌ని ఈ నోటును ముద్రించం మానేశారు. అయిన‌ప్ప‌టికీ పాత నోట్ల‌ను ఇప్ప‌టికీ తీసుకుంటారు. ఇక ఈ నోటుకు ముందు భాగంలో అశోకుడి చిహ్నం ఉంటుంది.

రూ.5 నోటు…

రూ.5 క‌రెన్సీ నోటు వెనుక భాగంలో ఒక వ్య‌క్తి పొలం దున్నుతున్న చిత్రం ఉంటుంది. దేశంలో వ్య‌వ‌సాయ రంగంలో చోటు చేసుకుంటున్న విప్ల‌వాత్మ‌క‌మైన మార్పుల‌కు గుర్తుగా ఆ బొమ్మ‌ను ఆ నోటుపై ముద్రించారు. కాగా ఖ‌ర్చు ఎక్కువ‌వుతుంద‌ని చెప్పి ఆర్‌బీఐ ఈ నోటును కూడా ముద్రించ‌డం మానేసింది. అయిన‌ప్ప‌టికీ దాదాపుగా 85వేల మిలియ‌న్ల రూ.5 నోట్లు ఇప్ప‌టికీ చెలామ‌ణీలో ఉన్నాయి. ఈ నోటు ముందు భాగంలో మ‌హాత్మాగాంధీ బొమ్మ ఉంటుంది.

రూ.10 నోటు…

ఒడిశాలోని కొనార్క్‌లో సూర్య‌దేవాల‌యం ఉంది. ఇదే దేవాల‌య చిత్రాన్ని రూ.10 క‌రెన్సీ నోటు వెనుక భాగంలో ముద్రించారు. కాగా ఈ నోటును ముద్రించేందుకు ఆర్‌బీఐకి 96 పైస‌లు ఖ‌ర్చ‌వుతోంది. ఈ నోటు ముందు భాగంలో గాంధీ బొమ్మ‌, అశోకుడి చిహ్నాలు ఉంటాయి.

రూ.20 నోటు…

రూ.20 నోటు వెనుక భాగంలో.. అండ‌మాన్ నికోబార్ దీవుల రాజ‌ధాని పోర్ట్ బ్లెయిర్‌లో ఉన్న మౌంట్ హారియ‌ట్ లైట్‌హౌజ్ బొమ్మ ముద్రించ‌బ‌డి ఉంటుంది. కొబ్బ‌రి చెట్లు, స‌ముద్రాన్ని ఈ చిత్రంలో చూడ‌వ‌చ్చు. కాగా రూ.20 నోటును ముద్రించేందుకు కూడా ఆర్‌బీఐకి 96 పైస‌లు ఖ‌ర్చ‌వుతుంది. దేశంలో 5000 మిలియ‌న్ల వ‌ర‌కు రూ.20 నోట్లు చెలామ‌ణీలో ఉన్నాయి.

రూ.50 నోటు…

భార‌త్ ముద్రించిన కొత్త రూ.50 నోటుపై వెనుక భాగంలో.. హంపిలోని ర‌థం బొమ్మ ముద్రించ‌బ‌డి ఉంటుంది. ఇక రూ.50 నోటు ముద్ర‌ణ‌కు రూ.1.81 ఖ‌ర్చ‌వుతుంది. దాదాపుగా 4000 మిలియ‌న్ల రూ.50 నోట్లు చెలామ‌ణీలో ఉన్నాయి. వెనుక భాగంలో స్వ‌చ్ఛ భార‌త్ లోగో కూడా చూడ‌వ‌చ్చు.

రూ.100 నోటు…
రూ.100 నోటుపై వెనుక భాగంలో భార‌త‌దేశంలోనే అత్యంత ఎత్త‌యిన కాంచ‌న‌గంగ ప‌ర్వ‌తం బొమ్మ ముద్రించ‌బ‌డి ఉంటుంది. ఈ నోటుకు రూ.1.20 ఖ‌ర్చ‌వుతుంది. 16వేల మిలియ‌న్ల రూ.100 నోట్లు ప్ర‌స్తుతం చెలామ‌ణీలో ఉన్నాయి.

 

రూ.200 నోటు…

భార‌త్ కొత్త‌గా ముద్రించిన రూ.200 నోటు వెనుక భాగంలో సాంచీ స్థూపం బొమ్మ ముద్రించ‌బ‌డి ఉంటుంది. ఇక‌ ఈ నోటు ముద్ర‌ణ‌కు రూ.2.93 ఖ‌ర్చ‌వుతుంది.

రూ.500 నోటు…

ఢిల్లీలోని ఎర్ర‌కోట చిత్రం రూ.500 నోటు వెనుక వైపు ముద్రించ‌బ‌డి ఉంటుంది. అలాగే స్వ‌చ్ఛ‌భార‌త్ లోగోను కూడా చూడ‌వ‌చ్చు. నోట్ల ర‌ద్దును చేశాక 2016లో ఈ నోటును ప్ర‌వేశ‌పెట్టారు. ఈ నోటు ముద్ర‌ణ‌కు ఆర్‌బీఐ రూ.2.94 ఖ‌ర్చు చేస్తోంది.

 

రూ.1000 నోటు…

కేంద్రం గ‌తంలో ర‌ద్దు చేసిన రూ.1000 నోటు వెనుక భాగంలో భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన చిత్రం ముద్రించ‌బ‌డి ఉంటుంది.

రూ.2వేల నోటు…

భార‌త్ గ‌తంలో చేప‌ట్టిన ఓ అంత‌రిక్ష మిష‌న్‌కు సంబంధించిన మంగ‌ళ‌యాన్ అనే శాటిలైట్ చిత్రాన్ని రూ.2వేల నోటు వెనుక భాగంలో ముద్రించారు. దేశంలో రూ.500, రూ.1000 పాత నోట్ల‌ను ర‌ద్దు చేశాక ఈ నోటును ప్ర‌వేశపెట్టారు. దీని ముద్ర‌ణ‌కు రూ.3.54 ఖ‌ర్చ‌వుతోంది.

నా పేరు పుతుల్ …. నవ్వుతూ క‌నిపించే ఈ ఫోటో వెనుకున్న నా జీవితమిది.! .

నా పేరు పుతుల్…ఫోటోలో న‌వ్వుతూ క‌నిపిస్తున్న‌ది నేనే! నిజానికి ఆ న‌వ్వు కేవలం ఫోటోకే ప‌రిమితం నా జీవితం మాత్రం దుఖ‌మ‌యం. సింపుల్ గా చెప్పాలంటే పూల పాన్పులు నిద్ర‌లేని రాత్రులు.! ఇదే నా జీవితం…ఎందుకంటే నేనో వేశ్య‌ను .! మా అమ్మ న‌న్ను ఇక్క‌డ అమ్మేసి నేనిటి 10 సంవ‌త్స‌రాలు!

క‌రెంట్ లేని మా ఇంట్లో నేను అమ్మ చెల్లి ఉండే వాళ్లాం… నా చెల్లికి చీక‌టంటే భ‌యం..అందుకే దైర్యం కోసం రాత్రులు నా జుట్టును ప‌ట్టుకొని ప‌డుకునేది….ఇప్పుడు ఆ భ‌యం పోయి ఉంటుంది ! నా త‌మ్ముడు మా ఇంటికి క‌రెంట్ క‌నెక్ష‌న్ ఇప్పించుంటాడు. న‌న్ను ఇక్క‌డ వ‌చ్చిన డ‌బ్బుల‌తో.. వాళ్లంతా హ్యాపీగా ఉండి ఉంటారు.!

అప్పుడ‌ప్పుడు మ‌ట్టివాస‌న వ‌చ్చే మా ఇల్లు నాకు గుర్తొస్తుంటుంది. రాత్రులు సుగంధాల‌ను వెద‌జ‌ల్లిన మా ఇంటి ముంద‌టి బొండుమ‌ల్లె చెట్టు గుర్తుకొస్తుంటుంది. కానీ …నా ద‌గ్గ‌ర‌కొచ్చే వాళ్లు కొట్టుకొచ్చే ఖ‌రీదైన ఫ‌ర్ ఫ్యూమ్ వాస‌న‌ల‌కు ….ఆ వాస‌న‌లు దూరంగా వెళ్లిపోతుంటాయి.! రెండు ఒక చోట ఇమ‌డ‌లేవు క‌దా.! ఇప్పుడు నా జీవితం అంతా హోట‌ల్స్ నుండి పార్సిల్లు…..పూల పాన్పులు… క‌రెన్సీ నోట్ల బేరాల చుట్టే తిరుగుతుంది !

వ‌ల‌స కూలీ…త‌న ఇంటికి వెళ్ల‌డానికి సైకిల్ దొంగ‌లించి…ఆ ఓన‌ర్ కు ఇలా లెట‌ర్ రాశాడు.!

“న‌మ‌స్తే సార్, న‌న్ను మ‌న్నించండి. నేనో మోస‌గాడిని, కానీ కూలీని , నిస్స‌హాయ‌త‌లో ఉన్న‌వాడిని…నేను మీ సైకిల్ తీసుకెళుతున్నాను, బ‌రేలీ వ‌ర‌కు వెళ్లాలి ..నా ద‌గ్గ‌ర ఎటువంటి వాహ‌నం లేదు దీనికి తోడు నా కుమారుడు విక‌లాంగుడు.”

ఇది… ఉత్త‌ర్ ప్ర‌దేశ్ రాజ‌స్థాన్ స‌రిహ‌ద్ద ప్రాంత‌మైన …. రార‌హ్ లో కూలీ కోసం వ‌చ్చిన ఇక్బాల్ అనే ఓ వ‌ల‌స కూలీ సైకిల్ ఓన‌ర్ కు రాసిన లెట‌ర్ … దేశ‌వ్యాప్తంగా లాక్ డౌన్ కార‌ణంగా వ‌ల‌స కూలీలు కాలిన‌డ‌క‌నే త‌మ ఇంటి బాట ప‌ట్టారు. ఇక్బాల్ కూడా మొద‌ట కాలిన‌డ‌క‌నే ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని త‌న ఇంటికి వెళ్లాల‌నుకున్నాడు … 250 కిలోమీట‌ర్లు త‌ను న‌డ‌వ‌గ‌ల‌డు.. కానీ త‌న విక‌లాంగ కొడుకు న‌డ‌వ‌లేడ‌ని త‌ల‌చి… ఓ ఇంటి నుండి సైకిల్ ను తీసుకొని ఓన‌ర్ కు ఈ లెట‌ర్ రాశాడు.

ఇదే విష‌యంపై సైకిల్ ఓన‌ర్ స్పందిస్తూ…. “నా సైకిల్ పుణ్యం చేసుకుంది. ఓ కుటుంబాన్ని త‌మ గ‌మ్యానికి చేర్చింది. కానీ నా సాటి మ‌నిషికి ఇలాంటి స్థితి రావ‌డం బాధాక‌రం” అన్నాడు.

నా పెళ్లి రోజు ఈ పెన్ తో సంతకం పెడుతుంటే ….ఒక విషయం గుర్తొచ్చి మీతో పంచుకుంటున్నాను.

నా  10th బర్త్డే నాడు నాకు చాల గిఫ్ట్స్ వొచ్చాయ్…అందులో ఒక కాస్ట్లీ పెన్ కూడా ఉంది.! అప్పట్లోనే దాని రేట్ 2000 అంట.! దాని బాక్స్ చూస్తేనే అర్థం అవుతుంది దాని లెవెల్ ! నాకు చిన్నప్పటి నుండి  ఇష్టమైన వాటిని ఒక పెట్టెలో దాచిపెట్టే అలవాటుంది. అలా ఆ పెన్ ను కూడా ఆ బాక్స్ లో దాచేసా .!

రోజూ స్కూల్ నుండి రావడం …ఆ బాక్స్ తెరవడం ఆ పెన్ ను చూసుకోవడం …మళ్ళీ అందులోనే దాచేయడం.! ఇలా ఒక వారం గడిచింది. తరవాత వారానికోసారి…..ఆ తర్వాత నెలకోసారి పెన్ ను చూసుకునేదానిని…తర్వాత గుర్తొచ్చినప్పుడు చూసుకునేదానిని ! నేను ఇంటర్ కు వచ్చేసాను …ప్రాజెక్ట్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి…. ఈ ప్రాజెక్ట్ వర్క్ ను నాకిష్టమైన పెన్ తో రాయాలని అనుకున్నాను….

పెట్టెను తెరిచి ….నా పెన్ బాక్స్ ను సీల్ తీసి ..1 …2 ….3 …. స్టార్ట్ ….పెన్ పడడం లేదు. జనరల్ గా మనందరికీ తెలిసిన విద్యే …పెన్ పడకపోతే షేక్ చేయడం …చేసాను…నో యూస్…అయినా పడట్లేదు.. ..అసహనం పెరిగిపోతుంది ..కోపం వొస్తుంది…బాధయితుంది ….చివరకు పెన్ తీసి పడేయాల్సివొచ్చింది.

నిజమే కదా! మనదగ్గర యెంత విలువైంది ఉన్నప్పటికీ…దాన్ని ఎప్పుడు వాడాలో అప్పుడే వాడాలి.. లేకుంటే ఇలా వేస్ట్ అయిపోతుంది. మన లోని సామర్థ్యాలు కూడా అంతే.! లేదంటే నా పెన్ లాగే అయిపోతుంది.!

ఇది ఫోటో ..నా పెళ్లి రోజుది ..పెళ్లి సంతకం చేయడానికి నేను 10 రూపాయల పెన్ ను వాడాను 🙂

ఇది మా ప్రేమ‌క‌థ‌.! ఒక్క న‌వ్వు న‌న్ను ప‌డేసింది.!

ఓ చిన్ని న‌వ్వే న‌వ్వి యుద్దాలెన్నో ఆపొచ్చో లేదో నాకు తెలియ‌దు కానీ, అత‌ని చిరున‌వ్వు మాత్రం నాలో ఓ అల‌జ‌డిని రేపింది. అది కాస్త ఇదిగో ఇలా ఈ ఫోటోలో ఆనందంగా క‌నిపించే ఫ్యామిలీగా మారింది.! స‌రిగ్గా రెండేళ్ల క్రితం…నేను ఓ టెక్ట్స్ టైల్ ఫ్యాక్ట‌రీలో ప‌నిచేసేదాన్ని, మా ఫ్యాక‌ర్టీలోనే ఏవేవో క‌ట్ట‌డాలు నిర్మిస్తుండేవారు. భ‌వ‌న నిర్మాణానికి వ‌చ్చే చాలా మంది తాపీ మేస్త్రీల్లో అతడొకడు…అదేంటో తెలియ‌దు కానీ….అత‌ను న‌న్ను చూసి న‌వ్వేవాడు, నేను అత‌నిని చూసి అప్ర‌య‌త్నంగానే న‌వ్వేదాన్ని. రోజూ మేం లంచ్ చేసే ప్ర‌దేశానికి కాస్త దూరంలో నావంకే చూస్తూ కూర్చునేవాడు అత‌ను .అలా చాలా రోజులు క‌ళ్ళ‌తోనే మాట‌లు కొన‌సాగాయి.

అత‌డికి ఇక్క‌డ వ‌ర్క్ అయిపోయింది.అయినా…నాకోసం నా లంచ్ టైమ్ లో అదే ప్లేస్ లో కూర్చొని క‌నిపించేవాడు. మ‌ళ్ళీ అదే న‌వ్వు, అవే క‌న్నుల బాస‌లు.!! ఆ రోజు నేను అత‌ని ద‌గ్గరికి వెళ్ళాను..న‌న్ను చూసిన అత‌ను. రోడ్డు మీద కాదు, కాస్త ప్ర‌శాంతంగా అలా వెళ్లి మాట్లాడుకుందామ‌ని అన్నాడు. నేను కూడా స‌రేన‌ని అత‌నితో పాటు వెళ్లాను. మాకు ద‌గ్గ‌ర్లోని ఓ మ్యూజియం కు వెళ్లాము. అక్క‌డ రాజుల ఆయుధాలు, వ‌స్తువుల‌ను చూసి నేను ఆశ్చ‌ర్య‌పోతుంటే…నా రాణివి అవుతావా? అంటూ అడిగాడత‌డు…నేనింకా రెట్టింపు ఆశ్చ‌ర్యంలో ఉన్న‌… ఎప్పుడు ? అని నా ప్ర‌శ్న‌. నువ్వు ఎప్పుడంటే అప్పుడే అంటూ అత‌ని స‌మాధానం.! అయితే ఈ రోజే అని నేన‌డంతో…అక్క‌డే దండ‌లు మార్చుకొని మా కొత్త జీవితాన్ని ప్రారంభించాము.

నాకు రోజంతా అత‌నితోనే ఉండాల‌ని ఆశ . కానీ మా జీవ‌నం కోసం అత‌ను పనిచేయ‌క త‌ప్ప‌దు, కానీ వ‌ర్షాకాల స‌మ‌యంలో ఆయ‌న‌కు ప‌ని స‌రిగ్గా దొర‌కదు…ఆ టైమ్ లో నేను అనుకున్న‌ట్టు రోజంతా నాతోనే ఉంటారు. ఆయ‌న‌కు టీ తాగ‌డం చాలా ఇష్టం…అలా ఇంటి ద‌గ్గ‌ర ఉన్న‌ప్పుడు అత‌నికి టీ ఇస్తూ…అత‌నిని చూసుకుంటూ మురిసిపోతుంటాను.!! కోరుకున్న జీవితం కోరుకున్న‌ట్లు జీవిస్తుంటే ఇంకా పేద‌రికం ఏముంటుంది చెప్పండి. !

Next Page »