Advertisement
విద్యను వ్యాపారంగా చూడటం అనేది మనం గత పదేళ్లుగా వింటున్న అత్యంత దరిద్రమైన విషయం. విద్యలో క్వాలిటీ పడిపోవడానికి అదే ప్రధాన కారణం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విద్య విషయంలో తల్లి తండ్రులు డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తే మంచి విద్య దొరుకుతుంది అనే భావనలో ఉంటారు గాని అలా చదివి బయటకు వచ్చిన వాళ్లకు జీవితం గురించి గాని, సమాజంలో జరిగే వాటి గురించి గాని కనీస అవగాహన ఉండదు.
Also Read:తెలంగాణాలో వినాయక చవితికి ఉన్న మరో పేరు ఏంటీ…? వినాయకుడ్ని అలా కూడా పిలుస్తారా…?
వెనకటి చదువులకి ఇప్పటి చదువులకు చాలా తేడా ఉంది. ముఖ్యంగా అప్పటి ఉపాధ్యాయులు కర్తవ్యనిష్టతో, విద్యార్ధులకు మంచి భవిష్యత్తు ఉండాలని తపించే వారు. ఇప్పటి ఉపాధ్యాయుల్లో అది ఒక్క శాతం కూడా కనపడటం లేదు. ఇక విద్యార్ధులకు ఉపాధ్యాయులు అంటే భయం ఉండేది. తల్లి తండ్రుల కంటే ఉపాధ్యాయులకు భయపడే వారు అప్పట్లో. ఉపాధ్యాయులు కొట్టినా ఎదురు చెప్పే వారు కాదు.
Advertisement
ఇక విద్యార్ధుల్లో క్రమ శిక్షణ అనేది దాదాపుగా కనపడటం లేదు. విద్యార్ధులకు మంచి మార్కులు రావాలని… టీచర్ లు స్పెషల్ క్లాసులు పరిక్షల ముందు తీసుకునే వాళ్ళు. కాని ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎక్కడా కనపడటం లేదు. మార్కుల విషయానికి వస్తే ,పూర్వం ఎంత బాగా వ్రాసినా సరే ఏదోక కారణం తో మార్కులు తగ్గించే వారు. దీనితో విద్యార్ధుల్లో భయం పెరిగి నైపుణ్యం పెంచుకునే వారు.
Advertisements
ఒకప్పుడు 60 శాతం వస్తే చాలా గొప్ప. ఫస్ట్ క్లాసులో మా పిల్లలు పాస్ అయ్యారనే వారు. ఇప్పుడు వందకు వంద వస్తున్నాయి. కాని ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్లకు ఏం తెలియదు అనే విషయం అర్థమవుతుంది. చదువు అంటే మార్కులు గా చూస్తూ పిల్లలను ఇబ్బంది పెడుతున్నారు తల్లి తండ్రులు, టీచర్ లు. కాని అప్పుడు చదువు అంటే జ్ఞానం, నాలెడ్జ్ గానే చూసే వాళ్ళు. రైటింగ్ కి కూడా చాలా ప్రాధాన్యత ఉండేది. ఇప్పుడు డబ్బులున్న పిల్లలకు కొన్ని స్కూల్స్ లో ఎక్కువ మార్కులు వేస్తున్నారనే ఆరోపణ రావడం మరీ దారుణం.
Advertisements