Advertisement
అంగరంగ వైభవంగా పెళ్లి అయ్యింది., అప్పగింతలు కూడా అయిపోయాయి. ఇక అమ్మాయి అబ్బాయి ఇంటికి వెళ్లడమే తరువాయి… సరిగ్గా అదే సమయంలో ఒక హెలికాఫ్టర్ వచ్చి అక్కడ ఆగింది. వరుడు అమ్మాయి చేయి పట్టుకొని ఆ హెలికాఫ్టర్ లో కూర్చోబెట్టుకొని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ సంఘటన రాజస్థాన్ లో జరిగింది.
రాజస్థాన్ కు చెందిన తరుణ్ మేగ్వాల్ రాజస్థాన్ లోని బర్మర్ జిల్లాకు చెందిన దియా ను డిసెంబర్ 14 న పెళ్లి చేసుకున్నాడు. తరుణ్ తల్లికి ఒక కోరిక ఉంది….. పెళ్లి తర్వాత తన కోడల్ని హెలికాఫ్టర్ లో ఇంటికి తీసుకురావాలని తల్లి కోరికను మన్నించి తరుణ్ దియాను తీసుకెళ్లడానికి హెలికాఫ్టర్ ఏర్పాటు చేయించాడు. దీని కోసం ఒక లక్ష రూపాయల ఖర్చు అయ్యింది.
Advertisement
అమ్మాయి గ్రామంలో ముందుగానే ఏర్పాటు చేయించిన హెలిప్యాడ్ పై హెలికాప్టర్ ఆగింది. దీంతో ఒక్కసారిగా జనం హెలికాఫ్టర్ ను చూసేందుకు ఎగబడ్డారు. వారిని కంట్రోల్ చేయడం పైలెట్ కు ఇబ్బందిగా మారింది . పోలీసులకు సమాచారం ఇవ్వండంతో అక్కడికి చేరుకున్న పోలీసులు జనాల్ని కంట్రోల్ చేశారు. హెలికాఫ్టర్ లో అత్తింటికి వెళుతున్న నూతన వధువుకు బైబై చెప్పి పంపించారు.
Advertisements
Advertisements
Watch Video: