Advertisement
1. VRO వ్యవస్థను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం. వీఆర్వో ఉద్యోగులను ఇతర విభాగాలలోకి విలీనం చేసి వారికి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ లు ఇవ్వబోతున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం
2. పరీక్షలు రాయకుండా ఎగ్జామ్ ఫీజులు కట్టిన ఇంటర్ సెకండియర్ విద్యార్థులను పాస్ చేయాలనే ఆలోచనలో తెలంగాణ సర్కార్.
3. వైసిపి విజయసాయిరెడ్డి అనర్హతా వేటు పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి.
4. మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు పాలు అందించాలని కేంద్రాన్ని సూచించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
Advertisements
Advertisement
5.హిమాచల్ ప్రదేశ్ నుంచి ముంబయికి ఈనెల 9న కంగనా ప్రయాణం చేయనున్న నేపథ్యంలో ఆమెకు వై కేటగిరీ భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర హోంశాఖ.
6. విదేశాలలో దుమ్ములేపుతున్న సుశాంత్ చివరి చిత్రం. స్క్రీన్ లు తక్కువగా కేటాయించినప్పటికీ న్యూజిల్యాండ్‌లో 48,436 డాలర్లు, ఫిజిలో 33,864 డాలర్లు వసూలు చేసిన చిత్రం
7. సూపర్ సానిక్ మిస్సైల్ క్లబ్ లో చేరిన భారత్. అమెరికా,చైనా,రష్యా తరువాత ఈ ఘనతను సాధించిన భారత్
8. అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన అయిదుగురు వేటగాళ్ల జాడ తమకు తెలియదని డ్రామాలు ఆడుతున్న చైనా.
9. అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ ఓడిపోతే 9/11 తరహా దాడులు జరిగే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యాలు చేసిన బిన్ లాడెన్ మేనకోడలు.
Advertisements
10. నెదర్లాండ్స్ పరిశోధకులు వినూత్నంగా తయారుచేసిన వి ఆకారం విమానం. ఫ్లయింగ్ వి విమానంగా నామకరణం.ఈ కొత్తతరం విమానాలు 20శాతం ఇంధనాన్ని అదా చేస్తుందని చెబుతున్న తయారీదారులు.