Advertisement
సికింద్రాబాద్ నుండి 2వ వందేభారత్ రైలుకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 8న ప్రధానమంత్రి నరేంద్రమోడీ సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు. ఈ ట్రైన్ సికింద్రాబాద్ – నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, గూడూరుల మీదుగా తిరుపతికి చేరుకుంటుంది. ప్రస్తుతం 12 గంటలు పడుతున్న జర్నీ వందేభారత్ కారణంగా 9గంటలకు తగ్గనుంది.
తిరుపతికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వెళ్తారు కాబట్టి ఈనిర్ణయం తీసుకున్నారు.
Advertisement
Advertisements
ప్రస్తుతం సికింద్రబాద్ – వైజాగ్ కు నడపబడుతున్న వందేభారత్ సెమీ హైస్పీడ్ రైలు 100శాతం ఆక్యుపెన్సీతో నడుస్తోందని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ టు తిరుపతి వందేభారత్ రైల్ కోసం ప్రస్తుతం 110 కి.మీ గా ఉన్న బీబీనగర్- గుంటూర్ మార్గాన్ని 130 కి.మీ గా అప్ గ్రేడ్ చేయాల్సి ఉంటుంది.
Advertisements