Advertisement
రోహిత్ శర్మ తప్పిదాల వల్లే సూర్య 3 సార్లు గోల్డెన్ డక్ అయ్యాడని పాకిస్తాన్ ఆటగాడు డానిష్ కనేరియా అభిప్రాయపడ్డాడు. అస్ట్రేలియా తో జరిగిన బోర్డర్ గవాస్కర్ టోర్నీలో సూర్య వరుసగా మూడు మ్యాచ్ లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మొదటి రెండు మ్యాచ్ లు మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో LBW అయిన సూర్య, డిసైడర్ మ్యాచ్ లో జస్టిన్ అగర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇది టీమ్ ఇండియా సీరిస్ ఓటమిపై తీవ్ర ప్రభావం చూపింది. సూర్య ఫామ్ లో లేక ఇబ్బంది పడుతున్న సందర్భంలో రోహిత్ కెప్టెన్ గా సూర్యకు మద్దతుగా నిలవాల్సింది పోయి.. మూడవ మ్యాచ్ లో అతడిని 7వ బ్యాట్స్ మెన్ గా దించాడు. అసలే ఆత్మవిశ్వాసం కోల్పోయి కాస్త ఇబ్బందిగా ఉన్న సూర్యను రోహిత్ నిర్ణయం మరింతగా కాన్ఫిడెన్స్ ను కోల్పోయేలా చేసింది.
Advertisement

Advertisements
కోహ్లీకూడా ఫామ్ కోల్పోయినప్పుడు టీమ్ అంతా అతనికి సపోర్ట్ గా ఉన్నారు. అనేక అవకాశాలు ఇచ్చారు. కానీ అతని బ్యాటింగ్ ఆర్డర్ ను మాత్రం మార్చలేదు. సూర్య విషయంలో కూడా అదే చేసి ఉండాల్సిందని డానిష్ కనేరియా అన్నాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం నెం.1 స్థానంలో ఉన్నాడు. వన్డేలో మాత్రం ఇప్పటివరకు 433 పరుగులు మాత్రమే చేశాడు.
Advertisements