Advertisement
ఒక రైతు ప్రతిరోజూ అరకిలో వెన్నను తీసుకొచ్చి దగ్గర్లోని బేకరీలో అమ్మేవాడు. దానికి బదులుగా ఆ బేకరీ అతను కూడా అరకిలో బ్రెడ్ ను అతనికి ఇచ్చేవాడు. ఇలా ఎన్నో రోజులుగా జరుగుతుండడంతో వీరిద్దరి మద్య మంచి స్నేహం కుదిరింది. ఆ స్నేహం అలాగే కొనసాగుతున్న సమయంలో……
బేకరీ షాప్ వాడికి అనుమానం వచ్చింది. ఈ రైతు తనకు సరిగ్గా అరకిలో వెన్న ఇస్తున్నాడా? అనే అనుమానమొచ్చింది. అలా అనుమానం రాగానే అతను తెచ్చిన వెన్నెను త్రాసులో వేసి తూకం చూశాడు వెన్న అరకిలో కంటే తక్కువగా ఉంది. దీంతో కోపోద్రిక్తుడైన ఆ వ్యాపారి అతడిని రాజు దగ్గరకు తీసుకెళ్లాడు.
Advertisement
విషయం తెల్సుకున్న రాజు రైతును పిలిపించి. వెన్న తూచడానికి నువ్వు ఏదైనా ఉపయోగిస్తావా? అని అడిగాడు దానికి రైతు లేదండీ ప్రత్యేకమైన కొలతలేమీ లేవని అంటాడు… చూశారా? చూశారా? ఇన్ని రోజులు నుండి ఈ రైతు నన్ను మోసం చేశాడని ఆ వ్యాపారి మరింత కోపంగా రాజుకు చెబుతాడు.
Advertisements
మరి కొలవకుండా ఎలా ఇస్తున్నావ్ అని రాజు అడిగిన ప్రశ్నకు…. ఏ రోజైతే మా ఇద్దరి మద్య ఒప్పందం కుదిరిందో ఆ రోజు నుండి అతడు ఇచ్చిన బ్రెడ్ ను త్రాసులో పెట్టి త్రాసుకు మరోవైపు వెన్న పెట్టి తూచి ఇచ్చాను. ఇందులో నా తప్పేమీ లేదన్నాడు. విషయం తెల్సుకున్న రాజు తప్పు చేసిన వ్యాపారికి ఫైన్ వేసి నిజాయితీగా వ్యవహరించిన రైతుకు ఇచ్చాడు.
Advertisements