Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

ఈరోజు రాశి ఫలాలు (14-04-2021 )…. సింగిల్ లైన్ లో

Advertisement

మేషం:ఈ రోజు చాలా సంతోషంగా ఉంటారు. కొన్ని కారణాలతో ఈ రోజు పని ప్రదేశంలో హడావుడిగా ఉంటారు.

వృషభ: నిన్నటి మాదిరిగా అనుకూలత ఉండదు. చిన్న పనుల్లో విజయం సాధిస్తారు.

మిథునం: ఈ రోజు శరీర అలసత్వం కారణంగా మీరు ఎక్కువగా కష్టపడే అవకాశం లేదు.

కర్కాటకం: వ్యాపారంలో లాభం కోసం ఎక్కువ అవకాశాలు ఉంటాయి.

సింహం: లాభ నష్టాలు సమానంగా ఉంటాయి. డబ్బు కొంచెం ఆలస్యమవుతుంది.

Advertisements

Advertisement

కన్య: ఈ రోజు దిన చర్య తీరిక లేకుండా ఉంటుంది. పని భారం కూడా పెరుగుతుంది.

తుల: ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు వద్దు.

వృశ్చికం: మీ సహోద్యోగుల్లో ఆదరణ పెరిగే అవకాశం ఉంటుంది.

ధనుస్సు: ఈ రోజు ప్రశాంతంగా ఉంటుంది. కాని కొన్ని అవాంతరాలు మాత్రం ఉంటాయి.

మకరం: పూర్వీకుల ఆస్తి విషయానికి భంగం కలిగించవద్దు. లేదు అంటే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండవచ్చు.

కుంభం: ఈ రోజు మీకు కొంత ప్రయోజనం ఉంటుంది. సంతానం వైపు నుంచి శుభవార్త అందుకునే అవకాశం.

Advertisements

మీనం: ఈ రోజు ప్రారంభంలో పని స్లో గా ఉంటుంది. కొంత సమయం తర్వాత ట్రాక్ లోకి వస్తారు.

ఈరోజు రాశి ఫలాలు (13-04-2021 )…. సింగిల్ లైన్ లో

మేషం: కార్యాలయంలో మీ సహచరులు మీకు మద్దతుగా ఉంటారు.

వృషభం: ఈ రోజు మీరు పూర్తి ఉత్సాహంతో ఏ పని చేసినా సరే కచ్చితంగా విజయం అందుకుంటారు.

మిథునం: ఆర్ధిక రంగానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోండి. రాబోయే రెండు మూడు రోజులు మీ సమయం తక్కువ

కర్కాటకం: ఈ రోజు మీరు ఆధ్యాత్మికత వైపు ఆసక్తి పెంచుకుంటారు.

సింహం: జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు పొందుతారు.

కన్య: సృజనాత్మక పనులపై దృష్టి పెరుగుతుంది. మీ అభిరుచిపై దృష్టి పెడతారు.

తుల: ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు, కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుంది

వృశ్చికం: ఈ ఆలోచనలు అమలు చేయడానికి మీకు అవకాశం దొరుకుతుంది.

ధనుస్సు: మీ కార్యాలయంలో ఈ రోజు చాలా పని చేయాలి. ఏదైనా పనిలో కచ్చితమైన ప్రయోజనం లభిస్తుంది.

మకరం: ఈ రోజు ఎక్కువ భాగం ఇంట్లోనే గడుపుతారు.

కుంభం: ఈ రోజు ఏదైనా శుభవార్త కోసం చూస్తారు. సాయంత్రంలోపు రావొచ్చు.

మీనం: ఈ రోజు నెమ్మదిగా పని మొదలుపెడతారు. ఉదయం కాస్త ఆందోళన ఉన్నా మధ్యాహ్నం సంతోషంగా ఉంటారు.

ఈరోజు రాశి ఫలాలు (12-04-2021 )…. సింగిల్ లైన్ లో

మేషం: ఈ రాశి వారు ఇతరులకు ఆర్ధిక సహాయం చేస్తారు. బంధువుకు ఋణం ఇచ్చే అవకాశం ఉంది.

వృషభ: ఈ రాశి వారు ఈ రోజు ఉద్యోగాలకు సంబంధించి సమస్యలను పరిష్కరించుకుంటారు. పదోన్నతులకు సంబంధించి గుడ్ న్యూస్ వింటారు.

మిథునం: ఇతరుల గురించి భావోద్వేగానికి గురవుతారు. వాటి ప్రకారం నడుచుకుంటే మీకు ఆత్మ సంతృప్తి.

కర్కాటకం: ఈ రోజు మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి.

సింహ: ఈ రాశి వారికి ఈ రోజు ఆనందం పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని అందుకుంటారు.

కన్య: ఈ రోజు మీ నైపుణ్యం అందరు అభినందిస్తారు. ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు.

తుల: ఈ రోజు మీ పాత బకాయిలను చెల్లిస్తారు. పిల్లల కోసం ఎక్కువ ఖర్చులు ఉంటాయి.

వృశ్చికం: ఈ రోజు చాలా బిజీగా ఉంటారు. కొన్ని అత్యవసర ఫోన్ లు, సందేశాలకు సమాధానం ఇవ్వాలి.

ధనుస్సు: ఈ రోజు మీ కార్యాలయంలో నూతన అధికారాలు ఉంటాయి. పనిపై మీకు ఆసక్తి పెరుగుతుంది.

మకరం: ఈ రోజు మీకు చాలా శక్తిమంతంగా ఉంటుంది. ఇది మీ సామర్ధ్యాన్ని పెంచుతుంది.

కుంభం. ఈ రోజు మీకు దన లాభం వచ్చే అవకాశం ఉంది. కొన్ని సమస్యలు సంతానానికి సంబంధించి ఒత్తిడి ఉంటుంది.

మీనం: ఈ రోజు మీరు చ్చాలా కూల్ గా ఉంటారు. ప్రత్యర్ధుల విమర్శలను లైట్ తీసుకోండి.

ఈరోజు రాశి ఫలాలు (08-04-2021 )…. సింగిల్ లైన్ లో

మేష రాశి: ఈ రోజు గందరగోళ పరిస్థితి. మనస్సు ఒకేసారి రెండు పనులు చుట్టూ ఉంటుంది.

వృషభం: ఈ రోజు పనిలో అవరోధాలు వచ్చే అవకాశం, మధ్యహ్నం తర్వాత కాస్త కలిసి వచ్చే అవకాశం.

మిథునం: వివాదాల్లో చిక్కుకునే అవకాశం, ఆర్ధిక కొరత వల్ల ఆందోళన

కర్కాటకం: ఈ రోజు వీరికి అనుకూలంగా ఉంటుంది. పనిలో ఇతరుల కంటే మెరుగైన విజయం లభిస్తుంది.

సింహ: ఈ రాశి వారికి ఆనందం, మనశ్శాంతి పెరిగే అవకాశం

కన్య: మిశ్రమ ఫలితాలు వస్తాయి, పరిచయం ఉన్న వాళ్ళ నుంచి మంచి లాభాలు

తుల: ఈ రోజు మీ ఖర్చులు పెరిగే అవకాశం, కుటుంబంలో ఏదైనా చర్చ జరిగే అవకాశం.

వృశ్చికం: ఈ రోజు ప్రారంభంలోనే ప్రయోజనం పొందే అవకాశం

ధనుస్సు: మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.

మకరం: కుటుంబంలో ప్రేమ ఉత్సాహం వాతావరణం ఉంటుంది.

కుంభం: ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పని ప్రదేశంలో ఏదైనా సమయానికి పూర్తి చేయాలని అనుకుంటారు.

మీనం: చాలా కాలం తర్వాత మీకు ఉపశమనం, ఆరోగ్యం క్రమంగా మెరుగుపడే అవకాశం

ఈరోజు రాశి ఫలాలు (05-04-2021 )…. సింగిల్ లైన్ లో

మేషం: ఈ రాశి వారికి నేడు ఎంతో శక్తివంతం, అప్రమత్తంగా ఉండాలి

వృషభం: మీకు ఇష్టమైన వారికి శారీరక సమస్యలు రావొచ్చు, అనవసర విషయాల్లో తల దూర్చోద్దు

మిథునం: మీకు ఇష్టమైన వారితో విరుద్దంగా ఉంటుంది. సమయానికి అనుగుణంగా ఫలితం రాదు.

కర్కాటకం: ఈ ఈరోజు మీ గౌరవం పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు

సింహం: మీకు శుభకరమైన ఖర్చులు ఉంటాయి. మీ కీర్తిని పెంచే విధంగా ఉంటాయి.

కన్య: వ్యాపారంలో ప్రయోజనం ఉంటుంది. గొడవలకు దూరంగా ఉంటే మంచిది.

తుల: ఆర్ధిక లాభం పెద్ద మొత్తంలో ఉంటుంది. మీకు ఇష్టమైన వారితో సంతోషం

వృశ్చికం: మీ పిల్లల గురించి ఆందోళన ఉంటుంది. ఎక్కువ ప్రయాణాలు చేసే అవకాశం.

ధనుస్సు: శారీరక ఆర్ధిక బలం ఎక్కువ. ఉత్తమ మార్గాల్లో తగినంత ఆదాయం

మకరం: సోదరులతో విభేదాలు ఉంటాయి. వ్యాపారంలో కూడా గొడవలు.

కుంభం: వ్యాపారంలో స్థిరమైన లాభం ఉంటుంది.

మీనం: ఆర్ధిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది. మానసిక ఒత్తిడి తట్టుకోవడానికి సహనం అవసరం.

ఈ రోజు ( 03-04- 2021) వార్త‌ల్లోని ముఖ్యాంశాలు. LT టాప్ 10 న్యూస్

ఏపీలో పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ టీడీపీ నిర్ణయం, పోటీ చేయాలనుకునే వాళ్లకు భవిష్యత్తులో అవకాశం ఇస్తా అన్న బాబు

టీడీపీలో పరిషత్ ఎన్నికల చిచ్చు, చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ నిర్ణయాన్ని విభేదిస్తూ పదవికి జ్యోతుల నెహ్రూ రాజీనామా

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు జగన్ పరామర్శ… ఇటీవల చెన్నైలో సర్జరీలు చేయించుకున్న రోజా.

క్రూడాయిల్ ఉత్పత్తిని పెంచడానికి సిద్దమైన ఒపెక్ దేశాలు, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం

అడవుల్లో తెలంగాణా బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్, ఆత్మహత్య చేసుకున్న సునీల్ నాయక్ కుటుంబాన్ని పరామర్శకు వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు

కరోనా తీవ్రత పెరగడంతో ఆస్పత్రిలో చేరిన టీం ఇండియా మాజీ కెప్టెన్ సచిన్

విశాఖ ఉక్కు పోరుకు గద్దర్ మద్దతు, అన్నవరంలో గోవిందా అంటూ పాటలు

ధోనీ కొట్టిన సిక్సర్ తోనే వరల్డ్ కప్ గెలవలేదు, అలా గెలిస్తే చాలా కప్ లు గెలవాలి: గంభీర్

సారంగా దరియా పాటకు కేవలం 32 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్, లిరికల్ సాంగ్ కి ఈ రేంజ్ లో ఫాస్ట్ గా రావడం ఇదే తొలిసారి

‘‘మిస్టర్‌ మోదీ, నేను స్టాలిన్‌.. కరుణానిధి కుమారుడిని. తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తిని కాదు. ఐటీ, సీబీఐ దాడులు చూసి అన్నాడీఎంకే నేతలు భయపడవచ్చేమో: స్టాలిన్

ఈరోజు రాశి ఫలాలు (03-04-2021 )…. సింగిల్ లైన్ లో

మేషం: తీరిక లేకుండా గడుపుతారు, ఆర్ధిక ప్రయోజనం పొందే అవకాశం

వృషభం: ఉత్తమమైన ఆస్తి లభిస్తుంది. చాలా రోజులుగా ఆగిపోయిన చెల్లింపులు వచ్చే అవకాశం

మిథునం: వ్రుత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ప్రయోజనాలు

కర్కాటకం: ఉత్తమ ఫలితాలు, అద్రుష్టం కలిసి వస్తుంది. కొన్ని ఖర్చులు కూడా ఉంటాయి

సింహం: అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం, వ్యాపారంలో లాభం

కన్యా రాశి: ఈ రోజు మంచి రోజు, కుటుంబ లాభాలు పొందుతారు

తుల: బహుమతులు, గౌరవం పొందే అవకాశం ఉంటుంది

వృశ్చికం: ప్రతీ సందర్భంలో విజయం అందుకుంటారు. మీ పని తీరు మెరుగుపడుతుంది.

ధనుస్సు: పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశం

మకరం: బిజీగా ఉంటారు. వ్యాపారంపై దృష్టి పెడతారు.

కుంభం: సంపద పెరిగే అవకాశం, ప్రతీ విషయంలో విజయం

మీనం: సానుకూల ఫలితాలు, లాభాలు వచ్చే అవకాశం, గొడవలకు దూరంగా ఉండాలి

ఇంట్లోకి వచ్చి రేప్ చేయబోయాడని దిమ్మ తిరిగే పని చేసింది… నిజంగా ఆదర్శమే…!

ఈ మధ్య కాలంలో అత్యాచారాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో ఒక ఘటన జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళ చేసిన పని చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారు. అసలు ఎం జరిగిందో ఈ స్టోరీలో చూద్దాం. జాతీయ మీడియా నివేదిక ప్రకారం మధ్యప్రదేశ్ లోని సిధి జిల్లాలో తన ఇంట్లో చొరబడి అత్యాచారానికి ప్రయత్నించిన ఒక వ్యక్తిని మహిళ అడ్డుకునే ప్రయత్నం చేసింది.

అయినా సరే అతన్ని ఆమె అడ్డుకోవడంలో ఫెయిల్ అయింది. ఇక ధైర్యం చేసి ఒక పని చేయాలని నిర్ణయం తీసుకుంది. తనను రేప్ చేయడానికి ప్రయత్నించిన 45 ఏళ్ల మహిళ పురుషుడి జననాంగాలను నరికేసింది. ఈ విషయం పోలీసులు మీడియాకు వెల్లడించారు. జిల్లా ప్రధాన కార్యాలయం నుండి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉమారిహా గ్రామంలో గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది.

ఈ సంఘటన జరిగినప్పుడు మహిళ… తన భర్త బయటకు వెళ్ళాడు అని, అప్పుడు ఈ ఘటన జరిగింది అని పోలీసులకు వివరించింది. ఖడ్డీ పోలీసు అవుట్‌పోస్ట్ ఇన్‌ఛార్జి సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) ధర్మేంద్ర సింగ్ రాజ్‌పుత్ మాట్లాడుతూ, “నిందితుడు వారి ఇంట్లోకి ప్రవేశించి అత్యాచారం చేయబోయాడు అని… అపుడు ఆ మహిళ తన 13 ఏళ్ల కుమారుడితో కలిసి ఇంట్లో ఉంది అని చెప్పారు.

ఆమె కుమారుడు ఇంటి నుండి సహాయం కోసం బయటకు వచ్చాడని… అనంతరం నిందితుడు మహిళను కొట్టాడు అని తెలిపారు. ఆమెపై లైంగిక వేధింపులకు ప్రయత్నించాడు అని… ఆమె 20 నిమిషాల పాటు అతని ప్రయత్నాన్ని ప్రతిఘటించింది అని పోలీసులు వివరించారు. “తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో, ఆ మహిళ తన మంచం క్రింద ఉన్న కొడవలిని తీసుకొని పురుషుడి జననాంగాలను నరికివేసింది అని చెప్పారు. శుక్రవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో అతనిపై ఫిర్యాదు చేసింది అని రాజ్‌పుత్ చెప్పారు. అత్యాచారం చేసిన నిందితుడిపై ఐపిసి సెక్షన్ 354, 456 294 (అశ్లీల చర్యలు), 506 (క్రిమినల్ బెదిరింపు) కింద కేసు నమోదు చేసారు.

ఇండియాలో ఒకే ఒక్క సెక్స్ టాయ్ షాప్ కు షాక్ ఇచ్చిన గ్రామ సర్పంచ్

భారతదేశపు మొట్టమొదటి లీగల్ సెక్స్ టాయ్ అండ్ వెల్నెస్ ప్రొడక్ట్స్ షాప్ కామా గిజ్మోస్ ను వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. సరిగా ఒక నెల తరువాత అక్కడి గ్రామ పంచాయితీ దీనిపై నిషేధం విధించింది. దీన్ని తెరవడానికి వీలు లేదని స్పష్టం చేసింది. గోవాలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన కలాంగూట్‌లోని మార్కెట్‌ లో ఉన్న ఈ దుకాణాన్ని వ్యాపార లైసెన్స్ లేకపోవడంతో పంచాయతీ మూసివేసింది.

ఇటువంటి కార్యకలాపాలకు గ్రామ సర్పంచ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సెక్స్ బొమ్మల దుకాణంపై బుధవారం పంచాయతీ చర్యలు తీసుకుంది. అలాగే అక్కడ ఉన్న ప్రకటనలు కూడా తొలగించారు. వ్యాపార లైసెన్స్ లేకుండా దుకాణాన్ని నడపడానికి అనుమతించబోమని పంచాయతీ పేర్కొంది. అయితే, కామా గిజ్మోస్ భాగస్వామి ప్రవీణ గణేశన్ మాట్లాడుతూ స్థానిక అధికారులకు సమస్యలు ఉన్నాయని అందుకే అనుమతించడం లేదని అన్నారు.

దుకాణం గురించి మాకు చాలా మంది వద్ద నుంచి ఫిర్యాదులు వచ్చాయి అని… వారికి వాణిజ్య లైసెన్స్ లేదు అని సర్పంచ్ వివరించారు. కాబట్టి మేము దానిని మూసివేసామని కలాంగూట్ సర్పంచ్ దినేష్ సిమేపురుస్కర్ మీడియాకు వివరించారు. కామకార్ట్ మరియు గిజోమోస్వాలా అనే ఇద్దరు సెక్స్ ప్రొడక్ట్ రిటైలర్లు ఈ స్టోర్ ని ప్రారంభించారు. ఇది కాస్త అసభ్యంగా ఉందని అందుకే దీన్ని అనుమతించాలని తాము అనుకోవడం లేదని సర్పంచ్ వివరించారు.

వాట్సాప్ కు షాక్ ఇచ్చిన కేంద్రం… హైకోర్ట్ లో పిటీషన్, కోర్ట్ ఏమంటుంది…?

మే 15 నుంచి అమల్లోకి రానున్న వివాదాస్పద కొత్త ప్రైవసీ పాలసీని అమలు చేయకుండా వాట్సాప్‌ను నిరోధించాలని కేంద్రం శుక్రవారం ఢిల్లీ హైకోర్టును కోరింది. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఫేస్బుక్ యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ కు చెందిన కొత్త సర్వీస్ నిబంధనలు మరియు గోప్యతా విధానాన్ని అమలు చేయడాన్ని సవాలు చేస్తూ పిటిషన్‌ దాఖలు చేసారు.

సీమా సింగ్ మరియు మేఘన్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ లో నూతన పాలసీ వలన దేశంలో డేటా రక్షణ లేకుండా పోతుందని కేంద్రం వెల్లడించింది. వాట్సాప్ ను అడ్డుకోవాలని హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేయగా వచ్చే నెల 20 కి విచారణ వాయిదా వేసారు. ఒక సంస్థ తన వ్యాపార సమయంలో సేకరించిన డేటా భద్రతకు సంబంధించి ఐటి నిబంధనలు కొన్ని షరతులు విదిస్తాయని కేంద్రం పేర్కొంది.

వాట్సాప్ లో నూతన ప్రయావసీ పాలసీ విషయంలో అనేక విమర్శలు ఉన్నాయి. ఈ విషయంలో కేంద్రం వెనక్కు తగ్గడం లేదు. అయితే వాట్సాప్ మాత్రం అంగీకరిస్తేనే తాము దేశంలో తమ సేవలను కొనసాగిస్తామని చెప్తుంది. ఈ నేపధ్యంలో ఇతర యాప్స్ కూడా మన దేశంలో ఇప్పుడు ఎక్కువగా వాడుకలో ఉన్నాయి. అయితే ఈ విషయంలో వాట్సాప్ దాదాపుగా వెనక్కు తగ్గే అవకాశం ఉంది.

Next Page »