Advertisement
మన టాలీవుడ్ సినిమా హీరోయిన్స్ తమ అందం , అభినయంతో ప్రేక్షకులను అలరించి వారి క్రేజ్ ని , స్టార్ డమ్ ని బట్టి ఒక్కో సినిమాకి 1 కోటి నుంచి 10 కోట్ల వరకు కూడా తీసుకునేవారు ఉన్నారు… అయితే ప్రస్తుతం మన టీవీ సీరియల్స్ హీరోయిన్స్ కి కూడా ప్రేక్షకుల్లో మాములు క్రేజ్ లేదు. అందుకే వారు కూడా రెమ్యునరేషన్ విషయంలో సినిమా హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గడం లేదు . ప్రస్తుతం కరోనా కారణంగా సినిమాలు ఆగిపోవడంతో టీవీ సీరియల్స్ కి రేటింగ్ బాగా పెరిగిపోయింది . సీరియల్ నటులకు రెమ్యునరేషన్ అనేది రోజువారీ ఉంటుంది . అయితే మన తెలుగు సీరియల్ యాక్టర్స్ ఒక్కో సీరియల్ కి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు తెలుసుకుందాం.
1.ప్రేమి విశ్వనాథ్ – కార్తీక దీపం:
ప్రస్తుతం టీవీ సీరియల్స్ హీరోయిన్స్ లో టాప్ లో ఉన్న హీరోయిన్ కార్తీక దీపం ప్రేమి విశ్వనాథ్ . .. మన తెలుగు ప్రేక్షకులకు అందరికి వంటలక్క గా బాగా పరిచయం ఉన్న నటి … కార్తీక దీపం సీరియల్ కి మన తెలుగు రాష్టాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది . అయితే ప్రేమి ఈ సీరియల్ కి ఒక్క రోజు 25 వేల వరకు అందుకుంటుంది అని సమాచారం .
Advertisements
2. సుహాసిని – అపరంజి:
ప్రస్తుతం టాప్ తెలుగు హీరోయిన్స్ లో రెండో స్థానంలో ఉన్న నటి చంటిగాడు సినిమా హీరోయిన్ సుహాసిని .. సినిమాల నుంచి సీరియల్స్ కి వచ్చిన తర్వాత సుహాసిని బాగానే సెటిల్ అయిందనే చెప్పాలి . అపరంజి సీరియల్ ద్వారా ఈమె బాగా ఫెమస్ అయింది . ఈమె కూడా రోజుకి 25వేల వరకు తీసుకుంటుందని సమాచారం .
3. ఐశ్వర్య – అగ్నిసాక్షి:
అగ్నిసాక్షి సీరియల్ లో హీరోయిన్ గా చేస్తున్న ఐశ్వర్య తన అందం , కళ్ళతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది . అగ్నిసాక్షి సీరియల్ కి కూడా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది . అయితే ఐశ్వర్య ఒక్కరోజు సీరియల్ కి 20 వేల వరకు తీసుకుంటుంది .
Advertisement
4. నవ్యస్వామి – నా పేరు మీనాక్షి:
నా పేరు మీనాక్షి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి నవ్యస్వామి . ప్రస్తుతం ఆమె కథ సీరియల్ లో నటిస్తుంది . అయితే ఈమె ఒక్క రోజుకి 20 వేల రూపాయల వరకు రెమ్యునరేషన్ అందుకుంటుంది .
5. పల్లవి రామశెట్టి – ఆడదే ఆధారం:
పల్లవి బుల్లితెర అనుష్కగా మంచి పేరు తెచ్చుకుంది . ఈమెకు మొదట ఆడదే ఆధారం సీరియల్ ద్వారా గుర్తింపు పొందింది . ఈమె ప్రస్తుతం ఒక్క రోజుకి 15 వేల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది .
6. ఆశిక – కథలో రాజకుమారి:
కథలో రాజకుమారి సీరియల్ తో మంచి పేరు సంపాదించుకున్న నటి ఆశిక .. ఈ సీరియల్ లో ఆశిక అవని పాత్రలో నటించింది. ఈమె ఒక్క రోజుకి 12 వేల వరకు రెమ్యునరేషన్ అందుకుంటుంది.
7. హరిత – కుంకుమ పువ్వు:
వైదేహి గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి హరిత కుంకుమ పువ్వు , ముద్దమందారం లాంటి టాప్ సీరియల్స్ లో నటించింది . ఈమె ఒకరోజు నటించినందుకు 12 వేల రెమ్యునరేషన్ తీసుకుంటుంది.
Advertisements