Advertisement
పచ్చబొట్టు.. దానినే ఇప్పుడు స్టైల్ గా టాటూ అని పిలుస్తున్నారు.. టాటూ అంటే ఆసక్తి లేని సెలబ్రిటి లేరు.. అంతేకాదు వారి వారి టాటులకు కొన్ని ఆసక్తికర కథలున్నాయి.. తమ ఒంటిపై పర్మినెంట్ టాటూస్ వేయించుకున్న కొందరు సెలబ్రిటీలు..వారి టాటుల వెనుక కథలేంటో చూద్దామా..
నయనతార
టాటూ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే పేరు నయనతార.. ప్రభుదేవతో పీకల్లోతు ప్రేమలో ఉన్నప్పుడు తన పేరులోని మొదటి అక్షరం P ని నయన్ చేతిపై టాటూ వేయించుకుంది..తర్వాత కొన్ని కారణాల వల్ల ప్రభుదేవా దూరమైనా టాటూ మాత్రం అలాగే ఉండిపోయింది.. ప్రస్తుతం నయన్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ తో పీకల్లోతు ప్రేమలో ఉంది.
త్రిష
Advertisements
తన ఎద భాగంలో టాటూతో బాగా ఫేమస్ అయింది త్రిష.. డిస్నీ క్యారెక్టర్ నెమో త్రిష ఫస్ట్ టాటూ కాగా..తర్వాత చేతి వెనుకభాగంలో తన రాశి వృషభరాశి గుర్తును రెండో టాటూగా..మూడో టాటూ తన ఫ్రొఫెషన్ కి గుర్తుగా ఎడమ భుజం పై ట్రైపాడ్ విత్ కెమెరాని టాటూగా వేయించుకుంది.
తాప్సీ పన్ను
తాప్సీకి ఎడమ కాలు మీద డ్యాన్స్ గర్ల్ టాటూ ఉంటుంది. పచ్చబొట్టు ఆహ్లాదకరమైన ప్రకాశంతో స్వేచ్ఛా స్ఫూర్తిని సూచిస్తుందని తాప్సీ భావన.
సమంత అక్కినేని
సమంతా ఒంటిపై కూడా మూడు టాటూలు ఉంటాయి..అందులో ఒకటి మెడ వెనుక భాగంలో ymc అని ఉంటుంది దానికి అర్దం ఏంటనేది ఇప్పటివరకు సామ్ చెప్పలేదు..కానీ “you are my chai” అని ఫ్యాన్స్ పిక్స్ అయిపోయారు.కుడిచేతి మణికట్టు పైన రోమన్ సింబల్ తో ఒక పచ్చబొట్టు ఉంటుంది..సేమ్ ఇటువంటిదే చైతూకి కూడా ఉంటుంది.మూడో టాటూ నడుముపైన ఉంటుంది..అది గులాబిమొగ్గ.
ఇలియానా
Advertisement
ఇలియానా ఎడమ మణికట్టు మీద “ఇన్స్పిరేర్” అని లాటిన్ భాషలో టాటూ ఉంటుంది. మరొకటి అరచేతి వెనుక భాగంలో, రెండు చుక్కలు మధ్యలో ఒక వృత్తం ఉంటుంది..ఇది తన ఫ్యామిలిని ముఖ్యంగా తన సిస్టర్స్ ని సూచిస్తుంది అన్నట్టుగా చెప్పంది ఇలియానా.
శ్రుతిహసన్
కమల్ హాసన్ గారాలపట్టి నటి మరియు సింగర్ అయిన శృతిహాసన్ తమిళ అక్షరాలతో తన పేరుని టాటూగా వేయించుకుంది..ఈ టాటూ శృతి భుజంపై ఉంటుంది..
నమ్రతా శిరోద్కర్
నమ్రత చేతిపై మహేశ్, సితార,గౌతమ్ పేర్లను టాటూగా వేయించుకుంది.
రష్మిక మందన్న
తన చేతిపై “Irreplaceable” అని టాటూ వేయించుకుంది రష్మిక..అది తన వ్యక్తిత్వానికి సూచనట..
అనసూయ
అనసూయ ఎద భాగంపై నిక్కు అని ఇంగ్లీష్ లో రాసి ఒక టాటూ ఉంటుంది..ఈ నిక్కూ ఎవరో కాదు అనసూయ ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్త సుశాంక్ భరద్వాజ్..
అశురెడ్డి
ప్రైవేట్ పార్ట్ లో పవన్ కళ్యాణ్ పేరుని టాటూగా వేయించుకున్న అశురెడ్డి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. పవన్ తో అవకాశం అయినా వదులుకుంటాను కాని, టాటూ తీయించుకోనని కామెంట్స్ చేసింది.
Advertisements