Advertisement
భర్త చాటు భార్యల అనే ట్యాగ్ లైన్ ను పటాపంచలు చేస్తూ…ఈ హీరోల భార్యలు తమదైన రంగంలో రాణిస్తూ సంపాధించడంలో భర్తతో పోటీ పడుతున్నారు. కొందరైతే ఇప్పటికే భర్తను బీట్ చేశారు. జాబ్ విషయంలో ఎంత ప్రొఫెషనల్ గా బిహేవ్ చేస్తారో….. కుటుంబ విషయానికి వస్తే అంతే హోమ్లీగా ఉంటారు. వాళ్లెవరో ఓ లుక్ వేద్దాం!
1. ఉపాసన W/o రామ్ చరణ్ :
రామ్ చరణ్ భార్య ఉపాసన అపోలో చారిటీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తూనే . బి పాజిటివ్ మ్యాగజైన్ కి చీఫ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఆమె ఏడాది సంపాదన చరణ్ రెమ్యూనరేషన్ కంటే ఎక్కువే ఉంటుంది!
2. నమ్రత W/o మహేష్ బాబు :
Advertisements
మహేష్ బాబు కు సంబంధించిన యాడ్స్ అగ్రిమెంట్స్, AMB మూవీస్ నిర్వాహణతో పాటు రీసెంట్ గా స్టార్ట్ చేసిన ది హంబుల్ గో అనే బట్టల వ్యాపారాన్ని కూడా నమ్రతే డీల్ చేస్తున్నారు.
3. స్నేహ రెడ్డి W/o అల్లు అర్జున్ :
అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి స్పెక్ట్రమ్ అనే మ్యాగజైన్ కి చీఫ్ ఎడిటర్ గా ఉన్నారు . అలాగే తన తండ్రి సెయింట్ ఇన్సిట్యూట్ వ్యవహారాలు కూడా చూసుకుంటుంది . ఇక రీసెంట్ గా పీక్ ఏ బు అనే ఒక సెలెబ్రిటీ ఫోటోగ్రఫీ బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది .
Advertisement
4. అంజన W/o నాని :
నాని భార్య అంజన ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తిచేసింది . ప్రస్తుతం అర్క మీడియాలో కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పని చేస్తున్నారు . బాహుబలి సినిమాకి కూడా ఈమె కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పనిచేశారు.
5. చిన్మయి W/o రాహుల్ రవీంద్రన్ :
యాక్టర్ & డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయి సింగర్ గా , డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేస్తుంది తెలుగులో సమంత కి డబ్బింగ్ చెప్పేది చిన్మయినే .
6. నిరూప W/o అల్లరి నరేష్ :
అల్లరి నరేష్ భార్య నిరూప హైద్రాబాద్ లో టాప్ మోస్ట్ ఈవెంట్ మేనేజర్! మ్యారేజెస్ తో పాటు అన్ని రకాల ఈవెంట్స్ ను ఆర్గనైజ్ చేస్తుంటారు.
7. సుమ W/o రాజీవ్ కనకాల :
ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు….యాంకర్ గా , హోస్ట్ గా ఏ ఛానల్ పెట్టినా తనే, ఏ ప్రోగ్రామ్ అయిన తనే….ఇదికాక సొంత ప్రొడక్షన్ హౌస్ పెట్టి దాన్ని కూడా సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నారు.
Advertisements