Advertisement
ఇప్పటివరకు యూట్యూబ్లో ఎక్కువ మంది చూసిన తెలుగు వీడియో ఏదో గెస్ చేయగలరా.. మా హీరోది, మా హీరోది అని పోటీపడుతున్నారా.. లేదంటే ఏ పొలిటిషన్ పవర్ ఫుల్ స్పీచో అనుకుంటున్నారా.. అయితే మీరంతా కాసేపు పక్కకెల్లి ఆడుకోవాల్సిందే..పెద్ద పెద్ద స్టార్ హీరోల పాటల వీడియోకో, ఫైట్ సీన్ కో వ్యూస్ మహా అయితే మిలియన్స్ మాత్రమే కాని బిలియన్స్ లో ఉన్న యూట్యూబ్ వీడియో ఏదంటే… “చల్ చల్ గుర్రం చల్ చల్ చల్”.. చిన్న పిల్లల వీడియో..
Watch Video :
చల్ చల్ గుర్రం చలాకి గుర్రం.. చిన్నప్పుడు మనందరం పాడుకునే ఉంటాం…దానికి కొంచెం మార్పు చేసిన రైమ్ ఛల్ ఛల్ గుర్రం చల్ చల్ చల్ యూట్యూబ్లో ఇన్ఫోబెల్స్ వారి ఆ వీడియోకి ఉన్నన్న వ్యూయర్స్ సంఖ్య మరే వీడియో కూడా ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదు.. ప్రస్తుతం 1,141,488,823 views.. మూడేళ్ల క్రితమే ఈ వీడియో బిలియన్ వ్యూస్ దాటింది.ఇప్పటికి ఆ క్రెడిట్ అలాగే ఉంది.. వ్యూయర్స్ సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది.. ఇప్పటి వరకు యూట్యూబ్లో ….. 300 కోట్ల వ్యూస్ తో …ఓపెన్ గంగ్నమ్ స్టైల్ సాంగ్ టాప్ లో ఉంది!
Advertisement
కేవలం తెలుగులో మాత్రమే ఇంగ్లీష్ లో,హిందిలో కూడా చిన్నపిల్లల వీడియోసే ఎక్కువ వ్యూయర్స్ ని దక్కించుకున్నాయి..వాటిల్లో టూ వర్డ్ ఫోనిక్స్ సాంగ్, జానిజాని ఎస్ పాపా.. చు చు టివి వాళ్ల ఇతర వీడియోస్ ఉన్నాయి.. ఈ విషయాన్ని మనం రెండు విషయాలుగా అర్దం చేసుకోవచ్చు..ఒకప్పుడు అమ్మమ్మ,తాతయ్యల కథలతో పిల్లల రోజు గడిచేది..ఇఫ్పుడు ఆ స్థానాన్ని యూట్యూబ్ భర్తీ చేస్తుంది..వారిని ఎంటర్టైన్ చేసేందుకు రకరకాల వీడియోస్ క్రియేట్ చేస్తుంది..
Advertisements
ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో విషయం పిల్లలలో ఫోన్ల వాడకం ఏ విధంగా ఉందనేది కూడా.. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి పిల్లల్ని చూసుకునే ఓపిక లేక యూట్యూబ్ వీడియోస్ పెట్టి వాళ్ల చేతుల్లో పెట్టేస్తున్నారు..ఇది ఆ క్షణంతో పోదు..దీర్ఘకాలికంగా నెగటివ్ రిజల్ట్స్ ని ఇస్తుంది..అందుకు సాక్ష్యంగా ఫోన్ ఇవ్వలేదని పిల్లలలో కోపం, ట్యాబ్ ఇవ్వలేదని ఒక స్టూడెంట్ ఆత్మహత్య.. ఇలా ఎన్నో ఘటనలు మనం చూస్తూనే ఉన్నాము..సో.. డెసిషన్ మీకే వదిలేస్తున్నాం..!
Advertisements