Advertisement
కరోనా కలికాలంలో ఏ వైపు నుండి వైరస్ అటాక్ చేస్తుందో ఎవరికి తెలియదు.. ఎవరి ప్రాణాల గురించి వారు భయపడుతున్న తరుణంలో.. తమతో పాటు తమ కడుపులో బిడ్డల్ని కూడా జాగ్రత్తగా చూస్కుంటూ .. కరోనాకి ఎదురేగి మరీ విధులు నిర్వర్తిస్తున్నారు మహిళా అధికారులు…వారే చందన దీప్తి, సింధు శర్మ..
మెదక్ జిల్లా ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న చందన దీప్తి..గతేడాది చివర్లో వివాహం చేసుకున్నారు.. వివాహం అనంతరం డ్యూటీలో జాయిన్ విధులు నిర్వర్తిస్తున్నారు..చందన దీప్తి పనితీరు పట్ల ఆ జిల్లాలోనే కాదు,రాష్ట్రవ్యాప్తంగా మంచి పేరుంది..ఇటీవల హరితహారం కార్యక్రమానికి సిఎం కెసిఆర్ మెదక్ జిల్లాలో పర్యటించారు. సిఎం పర్యటన ఏర్పాట్లన్ని చందన దీప్తి దగ్గరుండి చూసుకున్నారు..అప్పుడే ఆసక్తికర విషయం బయటపడింది..చందని ప్రెగ్నెంట్ అని..!
Advertisement
చందనకి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి..మామూలుగానే చందనకి అభిమానులు ఎక్కువ..ఇప్పుడు తను ప్రెగ్నెంట్ గా ఉన్నా కూడా ధైర్యంగా విధులు నిర్వర్తిస్తుండడంతో అనేక మంది ప్రశంసిస్తున్నారు.. కరోనా మొదటి గురి ముసలివాళ్లు,చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్ లేడిస్..వీరికి ఇమ్యునిటి పవర్ తక్కువగా ఉంటుంది కాబట్టి చాలా త్వరగా వైరస్ బారిన పడేందుకు అవకాశం ఉంటుంది…అయినప్పటికి భయపడకుండా ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజల సమస్యలని నేరుగా తెలుసుకుంటూ, పరిష్కారాలు సూచిస్తున్నారు..
Advertisements
మరో అధికారిణి జగిత్యాల ఎస్పీ సింధు శర్మ కూడా గర్భవతిగా ఉంటూ కరోనా విధులు నిర్వర్తించడం విశేషం. చాలా సాదాసీదాగా ఉండే సింధు శర్మ…ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారు..లాక్ డౌన్ పెట్టినప్పటి నుండి ప్రజలకు కరోనా గురించి అవగాహన కల్పించడమే కాకుండా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేవి సూచిస్తూ వస్తున్నారు.. రెండు రోజుల క్రితం వరకు కూడా డ్యూటీలో ఉన్న సింధు శర్మ, ప్రస్తుతం మెటర్నిటి లీవ్ తీసుకున్నట్టు సమాచారం.
Advertisements
ప్రెగ్నెన్సీ తో ఉండడం అంటే మామూలుగానే ఇమ్యునిటి పవర్ తక్కువగా ఉంటుంది..కొంచెం తేడా జరిగినా కేవలం తల్లి ప్రాణాలకే కాదు, బిడ్డల్ని ప్రమాదంలో పడేయాల్సి వస్తుంది..అయినప్పటికి భయపడకుండా, తమ సేవలు ప్రజలకు అవసరం అని ధైర్యంగా విధులు నిర్వర్తిస్తున్నారు..వైజాగ్ కమీషనర్ సృజన కూడా నెలల పసికందుని వదిలి విధులు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే .. !