Advertisement
క్రీస్తు పూర్వం 313వ సంవత్సరంలో చంద్రగుప్త మౌర్యుడు మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. అప్పట్లో అతను దాదాపుగా భారతదేశం మొత్తాన్ని జయించి పరిపాలించాడు. మైసూర్, తమిళనాడు, కాశ్మీర్ నుంచి పంజాబ్ వరకు, నేపాల్, భూటాన్‌లను కూడా జయించాడు. అయితే క్రీస్తు పూర్వం 305వ సంవత్సరంలో గ్రీకు రాజు సెలెయుకోస్ నికాటర్ పంజాబ్‌పై దాడి చేస్తూ చంద్రగుప్త మౌర్యుడిపై యుద్ధానికి వచ్చాడు. కానీ చంద్రగుప్తుడి ఎదుట
నికోటర్ నిలబడలేకపోయాడు. ఆ యుద్ధంలో నికోటర్ ఓడిపోయాడు.
యుద్ధంలో ఓడినందుకు గాను నికోటర్ తన ఆధీనంలోని పలు ప్రాంతాలను చంద్రగుప్త మౌర్యుడికి ఇచ్చాడు. పర్షియాలోని పలు రాష్ట్రాలను చంద్రగుప్తుడికి ఇచ్చాడు. అవి హెరాట్, కాందహార్, బలోచిస్తాన్, కాబూల్ ప్రాంతాలు. వీటితోపాటు చంద్రగుప్తుడికి నికాటర్ తన కుమార్తె హెలెనాను ఇచ్చి వివాహం జరిపించాడు. అప్పటికి చంద్రగుప్తుడి వయస్సు 40 ఏళ్లు. హెలెనా వయస్సు 15 నుంచి 17 ఏళ్లు ఉంటుంది. అయినప్పటికీ చంద్రగుప్తుడు హెలెనాను వివాహం చేసుకుని పాటలీపుత్రంలోని అంతఃపురానికి తీసుకువస్తాడు. ఆమె వెంట ఆమె తల్లిదండ్రులు, సోదరుడు కూడా వచ్చి కొన్ని రోజుల పాటు అక్కడ గడుపుతారు.
ఇక కూతుర్ని ఇచ్చి వివాహం చేసినందుకు గాను నికోటర్ కు చంద్రగుప్తుడు 500 ఏనుగులు, టన్నుల కొద్దీ బంగారు, వజ్రాభరణాలను అందజేస్తాడు. అయితే హెలెనాను చూసి ప్రేమించిన చంద్రగుప్తుడే స్వయంగా నికాటర్‌తో యుద్ధానికి దిగాడని, నికాటర్ తనంత తానుగా చంద్రగుప్తుడితో యుద్ధానికి రాలేదని.. కొందరు చెబుతారు. కానీ ఇందుకు సంబంధించి చరిత్రలో ఎక్కడా ఆధారాలు లేవు. అయితే చంద్రగుప్తుడి భార్య ధురుధర మహారాణి మరణించి అప్పటికే చాలా కాలం అవుతుంది. దీంతో చంద్రగుప్తుడు హెలెనాను మహారాణిగా చేయాలనుకుంటాడు. కానీ చాణక్యుడు అలా చేయవద్దని వారిస్తాడు. విదేశీ మహిళను మహారాణిగా ప్రకటించకూడదని చెబుతాడు. దీంతో చంద్రగుప్తుడు ఆ పని మానుకుంటాడు.
Advertisement
Advertisements
Advertisements
అయితే ఇండియాలో ఉన్న హెలెనా ఇక్కడి సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలు, ఆహారాలకు అలవాటు పడేందుకు కొంత సమయం పడుతుంది. హెలెనా సంస్కృతం, భారతీయ నృత్యాలను కూడా నేర్చుకుందని మెగస్తనీస్ పుస్తకంలో ఉంది. కానీ దాని గురించి ఇంకా పూర్తి వివరాలు లేవు. తరువాత కొంత కాలానికి చంద్రగుప్తుడికి, హెలెనాకు కుమారుడు జన్మిస్తాడు. అతని పేరు జస్టిన్ అని చెప్పబడింది. కానీ ఆ వివరాలు ఎక్కడా లేవు. ఇక చంద్రగుప్తుడికి ఎంతో మంది భార్యలు ఉండేవారు. అయినప్పటికీ హెలెనా అంటేనే ప్రేమ ఎక్కువగా ఉండేది. ఇక చంద్రగుప్త మౌర్యుడు వృద్ధాప్యంలో 56 ఏళ్ల వయస్సు ఉండగా.. క్రీస్తు పూర్వం 289లో జైన మతాన్ని స్వీకరించి శ్రావణ బెళగొళ వెళ్తాడు. అక్కడే 2 ఏళ్ల పాటు ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండి ప్రాణాలు విడుస్తాడు. తరువాత అతని కుమారుడు బిందుసారుడు రాజ్యపాలన బాధ్యతలు స్వీకరిస్తాడు.
కాగా చంద్రగుప్తుడు జైన మతాన్ని స్వీకరించడానికి కొద్ది రోజుల ముందే.. హెలెనా తన కుమారుడు జస్టిన్‌ను తీసుకుని గ్రీస్‌కు వెళ్లిపోతుంది. అప్పుడు ఆమె వయస్సు 30 సంవత్సరాలు. గ్రీసులో అక్కడి చరిత్రకారులు రాసిన పుస్తకాల్లో చంద్రగుప్తుని పేరు సాండ్రకటోస్‌గా చెప్పబడింది. ఇక చంద్రగుప్తుడి తరువాత అతని అనేక మంది కుమారులు ఉన్నా.. వారందరూ చిన్నవారు కావడంతో బిందుసారుడికి రాజ్యాన్ని పాలించే అవకాశం దక్కింది. అయితే చంద్రగుప్తుడు, హెలెనాల ప్రేమకథ గురించి గ్రీకు చరిత్ర పుస్తకాల్లో రాశారు కానీ.. భారత చరిత్ర పుస్తకాల్లో పెద్దగా వివరాలు లేవు. ఆమె విదేశీ మహిళ కావడమే అందుకు కారణమని తెలుస్తోంది.