Advertisement
చంద్రశేఖర ఆజాద్…దేశ స్వాతంత్ర్య పోరాటంలో సువర్ణ అక్షరాలతో లిఖించిన పేరు. గాంధీజీ పిలుపుతో స్వాతంత్ర్య ఉద్యమంలోకి అడుగుపెట్టిన చంద్రశేఖర్ అనతి కాలంలోనే తనదైన పంథాను ఎంచుకొని బ్రిటీష్ పాలకులకు కొరకరానికొయ్యగ మారాడు.! చిన్నప్పటి నుండి దుందుడుకు స్వభావి అయిన ఆజాద్ మరణించే వరకు కూడా తన ఆత్మగౌరవాన్ని ఎక్కడా తగ్గించుకోలేదు.
సీన్ -1:
బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన చంద్రశేఖర్ ను సంస్కృతం చదివించాలనేది వారి తల్లిదండ్రుల బలమైన కోరిక, కానీ శేఖర్ కు అది ఇష్టం లేదు..దీని కారణంగా ఇంట్లోంచి పారిపోయి….ముంబాయ్ మురికి వాడల్లో రెండేళ్లు కూలిపని చేస్తూ జీవనం సాగించాడు.! తర్వాత మళ్లీ తల్లిదండ్రుల ఇష్టం మేరకు వారణాసిలోని సంస్కృత పాఠశాలలో జాయిన్ అయ్యాడు.
సీన్ -2:
అది సహాయ నిరాకరణ ఉద్యమం సాగుతన్న కాలం….. గాంధీ పిలుపుతో విదేశీ వస్తువులను వీధుల్లో తగలబెడుతున్నారు. విద్యార్థి గా ఉన్న చంద్రశేఖర్ కూడా తన పాఠశాల ముందే దర్నా చేస్తున్న సందర్భంలో పోలీసులు అతనిని పట్టుకెళ్ళి న్యాయమూర్తి ఎదట ప్రవేశపెట్టారు.
Advertisements
Advertisement
న్యాయమూర్తి- చంద్రశేఖర్ మద్య జరిగిన సంభాషణ….( భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. 15 ఏళ్ళ వయస్సులోనే…చంద్రశేఖర్ కు దేశమంటే ఎంత ప్రేమో తెలిసిపోతుంది.!)
- న్యాయమూర్తి: నీపేరేంటి?
- చంద్రశేఖర్ : ఆజాద్
- న్యాయమూర్తి: నీ తండ్రి పేరేంటి?
- చంద్రశేఖర్ : స్వాతంత్ర్యం
- న్యాయమూర్తి: మీ ఇల్లెక్కడ?
- చంద్రశేఖర్: జైలు…..
15 ఏళ్ళ కుర్రాడి నుండి ఇలాంటి సమాధానాలు విన్న జడ్జ్ అతనికి 15 రోజుల జైలు శిక్ష వేశాడు…తర్వాత ఆ శిక్షను 15 కొరడా దెబ్బలుగా మార్చాడు.! అలా ఒక్కొక్క దెబ్బకు భారత్ మాతాకీ జై, ఇంక్విలాబ్ జిందాబాద్, వందేమాతరం అంటూ నినాదాలు చేశాడు. శిక్ష తర్వాత కోర్ట్ వారిచ్చిన 3 అణాలను కూడా వారి మొఖం మీద విసిరికొట్టాడు.!
సీన్ -3 :నా చావు – నా చేతుల్లోనే..
భగత్ సింగ్, సుఖ్ దేవ్ , రాజ్ గురు లు ముగ్గురు కలిసి బ్రిటీష్ పార్లమెంట్ మీద బాంబు దాడి చేశారు. ఆ క్రమంలో వారు పట్టుబడ్డారు, వారికి ఉరిశిక్ష ఖరారైంది., వారినివిడిపించాలనే కారణంతో అలహాబాద్ లోని ఆల్ఫ్రెడ్ పార్క్ లో తన సహచరులతో సమావేశం జరుపుతుండగా పోలీసులు చుట్టుముట్టి కాల్పులు ప్రారంభిచారు. ఈ క్రమంలో ఓ బుల్లెట్ ఆజాద్ తొడ నుండి దూసుకెళ్లింది, అయినా ఆజాద్ పోరాటం ఆపలేదు…. ముగ్గురు పోలీసు అధికారులను కాల్చాడు…ఆయన గన్ లో కేవలం ఒకే బుల్లెట్ ఉండడంతో…అప్పటికే తన శరీరంలో మూడు బుల్లెట్ గాయాలుండడంతో…తన గన్ తో తానే కాల్చుకొని అమరుడయ్యాడు.
Advertisements