Advertisement
చంద్రయాన్ ప్రయోగం… భారత్ లో ప్రతీ ఒక్కరు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ప్రయోగం. ఇస్రో శాస్త్రవేత్తలు అహర్నిశలు ఈ ప్రాజెక్ట్ కోసం కష్టపడుతూనే ఉన్నారు. ఎలా అయినా సరే చంద్రుడి మీద అడుగుపెట్టాలి అని పట్టుదలగా వ్యవహరిస్తుంది ఇస్రో. అయితే ఈ ప్రాజెక్ట్ రెండేళ్ళ క్రితం విఫలం అయిన తర్వాత దేశం మొత్తం ఇస్రో వెంట నిలిచింది. అయితే చంద్రయాన్ -3 ఈ సంవత్సరం 2021 లో ప్రారంభించబడుతోంది.
అయినా… కోవిడ్ -19 లాక్డౌన్ కారణంగా… చంద్రయాన్ -3 తో సహా పలు ప్రాజెక్ట్ లు వాయిదా పడ్డాయి. ఇస్రో చీఫ్ కె శివన్ మాట్లాడుతూ చంద్రయాన్ -3 2022 లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. చంద్రయాన్ -2 కి భిన్నంగా ఈ ప్రయోగం ఉంటుందని ఆయన అన్నారు. దీని కోసం మేము కృషి చేస్తున్నామని ఆయన వివరించారు. చంద్రయాన్ -2 కి వాడిన కాన్ఫిగరేషన్ దీనికి ఉండదు అని వివరించారు.
Advertisement
చంద్రయాన్ -2 సమయంలో ప్రయోగించిన కక్ష్య చంద్రయాన్ -3 కోసం ఉపయోగిస్తామని తెలిపారు. మేము ఒక వ్యవస్థ కోసం కష్టపడుతున్నామని తెలిపారు. చంద్రయాన్ -3 ప్రయోగం భారత్‌కు ఎందుకు కీలకం అనేది ఒక్కసారి చూస్తే… లూనార్ సౌత్ పోల్ పై రోవర్ ల్యాండింగ్ చేయాలనే లక్ష్యంతో చంద్రయాన్ -2 , జూలై 22, 2019 న ప్రయోగించారు. అత్యంత శక్తివంతమైన జియోసింక్రోనస్ లాంచ్ వాహనంలో ప్రయోగించారు.
విక్రమ్ గా ల్యాండర్ కి నామకరణం చేయగా… 2019 సెప్టెంబర్ 7 న కక్ష్యలోకి వెళ్ళింది. అయితే… చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా అడుగుపెట్టిన మొదటి దేశంగా అవతరించాలని భావించిన భారత్ కి ఈ ప్రయోగం షాక్ ఇచ్చింది. ఇతర గ్రహాల మీద అడుగుపెట్టాలి అని భావిస్తున్న భారత్ కు ఈ ప్రయోగం చాలా కీలకంగా మారింది. దీని తరువాత మరో మానవరహిత మిషన్ ఉంటుందని ఇస్రో పేర్కొంది.
Advertisements
గగన్యాన్ ప్రాజెక్ట్ కింద మొట్టమొదటి మానవరహిత మిషన్ ను ప్రారంభించటానికి ఇస్రో డిసెంబర్ ని లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. 2022 నాటికి ముగ్గురు భారతీయులను అంతరిక్షంలోకి పంపాలని ఇస్రో భావిస్తుంది. మిషన్ కోసం ఎంపికైన నలుగురు టెస్ట్ పైలట్లు ప్రస్తుతం రష్యాలో శిక్షణ తీసుకుంటున్నారు.
Advertisements