Advertisement
మెగాపవర్ స్టార్ గా చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్…. మగధీరతో స్టార్ హీరో ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. రంగస్థలం సినిమాలో తన నటన విశ్వరూపం చూపాడు… చిరుత నుండి రంగస్థలం గ్యాప్ లో చాలా సినిమాలు చేసిన చరణ్ …అటు హిట్లను, ఇటు డిజాస్టర్లను సైతం చూశాడు. ఈ క్రమంలో చరణ్ 5 సినిమాలను కూడా వదులుకున్నాడు…కొన్ని డేట్స్ కుదరక, మరికొన్ని కథ తనకు సెట్ అవ్వదనే ఉద్దేశంతో…..ఇప్పుడు చరణ్ వదులుకున్న ఆ 5 సినిమాలేంటో చూద్దాం!
1. ఏటో వెళ్ళిపోయింది మనసు:
నాని , సమంతా హీరో హీరోయిన్స్ గా గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్లో వచ్చిన ఏటో వెళ్ళిపోయింది మనసు కథని మొదట రామ్ చరణ్ కి చెప్పారు. అప్పటికే ఆరెంజ్ లాంటి పూర్తి లవ్ స్టొరీ సినిమా చేసి ప్లాప్ దక్కించుకున్న చరణ్ మళ్లీ లవ్ స్టోరి ఎందుకని లైట్ తీసుకున్నాడు.
2 . ఒకే బంగారం:
Advertisements
Advertisement
దుల్కర్ సల్మాన్ , నిత్యామీనన్ హీరో హీరోయిన్ లుగా నటించిన ఒకే బంగారం కథని కూడా డైరెక్టర్ మణిరత్నం మొదట రామ్ చరణ్ కి వినిపించాడు . అప్పటికే ఇతర సినిమాల్లో బిజీగా ఉన్న చరణ్ డేట్స్ కుదరట్లేదని సున్నితంగా తిరస్కరించాడట!
3. సూర్య s/o క్రిష్ణన్:
సూర్య హీరోగా గౌతమ్ మీనన్ డైరెక్షన్లో వచ్చిన సూర్య s/o క్రిష్ణన్ సినిమా తెలుగు వర్షన్ కోసం మొదట రాంచరణ్ ని అడగ్గా అప్పటికే రాజమౌళి డైరెక్షన్లో మగధీర చేస్తుండడంతో ఆ సినిమాని రిజెక్ట్ చేయాల్సి వచ్చిందట చరణ్ కు.
4. కృష్ణార్జున యుద్ధం:
నాని , అనుపమ హీరో హీరోయిన్స్ గా మేరపాక గాంధీ డైరెక్షన్లో వచ్చిన కృష్ణార్జున యుద్ధం కథని , నాని కంటే ముందు రాంచరణ్ కి వినిపించగా డేట్స్ కుదరక ఈ సినిమాని కూడా వొదులుకున్నాడు చరణ్ .
5. నేల టిక్కెట్:
కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో ….రవితేజ హీరోగా నటించిన నేల టిక్కెట్ సినిమా స్టోరి కూడా మొదట చరణ్ కే వినిపించినా….ఆ స్టోరీ తనకు సెట్ అవ్వదని రిజెక్ట్ చేశాడట చరణ్.
Advertisements
ఈ 5 సినిమాల్లో ఒకే బంగారం , s/o క్రిష్ణన్ తప్ప మిగిలిన సినిమాలు పెద్దగా ఆడలేదు…దీనిని బట్టి రామ్ చరణ్ తను వదులుకున్న సినిమాల కారణంగా పెద్దగా లాస్ అయ్యిందైతే ఏమీ లేదు. కాకపోతే మణిరత్నం డైరెక్షన్ లో సినిమా మిస్ చేసుకున్నందుకు చాలా బాధపడ్డాడని సమాచారం.