Advertisement
బ్యాట్స్ మెన్స్ నిలబడడానికి కూడా ఇబ్బంది పడుతున్న పిచ్ పై…. 211 బాల్స్ ఎదుర్కొన్నాడు….. 10 సార్లు బాల్ వచ్చి బాడీకి తగిలింది అయినా నో రియాక్షన్ ., అదే యాక్షన్! ఒక బాల్ అయితే ఏకంగా హెల్మెట్ కు బలంగా తాకింది అయినా అతడి మనోధైర్యం చెక్కుచెదరలేదు. బౌలర్లకే విసుగుతెప్పించాడు..వీడిని ఔట్ చేయడం మనవళ్ల కాదురా అని ప్రపంచ మేటీ బౌలర్లే చేతులెత్తేశారు. హిస్ ఈస్ నన్ అథర్ దెన్…. ఛటేశ్వరపూజారా. ఆస్ట్రేలియాతో జరిగిన 4వ టెస్ట్… గబ్బా స్టేడియంలో మనోనిబ్బరంతో ఆడి టీమ్ ఇండియాకు చారిత్రక విజయాన్ని అందించాడు.
Advertisement
ఈ ఫీల్డింగ్ సెటప్ చూడండి….ఇంత టైట్ ఫీల్డింగ్ పెట్టి…షార్ట్ పిచ్ బాల్స్ తో తెగ విసిగించారు. ముఖ్యంగా మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ షార్ట్ పిచ్ బాల్స్ , బౌన్సర్లతో హడలెత్తించారు. 328 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియాకు పూజారా అందించిన స్కోర్ 56 యే కావొచ్చు కానీ 211 బంతులను ఎదుర్కొని ది వాల్ గా అడ్డంగా నిలబడ్డాడు….. ఆస్ట్రేలియా బౌలర్ల సహనానికి అగ్ని పరీక్ష పెట్టాడు. బౌలర్లంతా తన మీదే కాన్సంట్రేషన్ పెట్టేలా చేశాడు…దీని వల్ల ఇతర బ్యాట్స్ మెన్ పై ఒత్తిడి లేకుండా పోయింది. వాళ్లు స్వేచ్చగా ఆడే అవకాశం దక్కింది. ఆ ప్రెషన్ అంతా తన మీదకే తీసుకున్నాడు. చరిత్రలో నిలిచిపోయే స్టాండింగ్ ఇచ్చాడు. ఫైనల్ గా ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో LBW గా వెను దిరిగాడు…కానీ అప్పటికే టీమ్ ఇండియా విజయానికి కావాల్సిన పరిస్థితులను సెట్ చేసేశాడు.
Advertisements
Advertisements